సంక్రాంతి పండుగ ఎప్పుడు చెయ్యాలో "పండితులకు" తెలియదు! కోడి పందాలు ఎలా ఆపాలో పోలీసులకు తెలియదు!
ఉన్న ఊరే ! ఉదకమండలం అయిన వేళ ! బోగి మంటలు మా గుడిలో గోదాదేవి కల్యాణం రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు , అరిసెలు వండుకోవడాలు , ఇవ్వన్ని సాంప్రాదాయక సంక్రాంతి పండుగలో కనిపించే అంశాలు . తెలుగు గ్రామాలలో ఎ పండుగ గొప్పగా జరుపుకోలేక పోయినా సంక్రాంతి పండుగ మాత్రం తమకు కలిగినంతలో ఘనంగానే జరుపుకుంటారు ప్రజలు. కారణం అప్పటికే రైతులకు పంటల తాలూకు పలాలు చేతికొచ్చి ప్రతి ఇంట్లో దన దాన్యాలు ఉండడమే . అంతే కాకుండా చలికాలం చివరి నెల కావడం వలన వాతా వరణం కూడా మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తూ పండుగ మూడు రోజులు ఆనందంగా గడచి పోయేలా చెస్తుoది . నిజంగా సంక్రాంతి శోభ చూడాలంటే పల్లెలకు వెళ్ళాల్సిందే . పొద్దునే పట్టిన పొగమంచు అందాలు పల్లెలను ఉదక మండలాలుగా మారుస్తాయి . బోగి నాడు వేసుకునే "బోగి మంటలు" , దాని చుట్టూ చేరి కుటుంబ సబ్యులు అంతా వెచ్చని చలి కాగుతుoటె, ఆహా ! ఆ ఆనుబూతే వేరు . అ తర్వాత ఆడపిల్లలు ఇం