మను వాదం స్త్రీలను ఇంట్లో కూర్చొబెడితె ,మోడరన్ వాదం బయటకు తీసుకువచ్చి ,బట్టలు విప్పించి మరీ హోర్డింగ్ ల మీదకు ఎక్కించింది .

పబ్లిసిటి పేరుతొ స్త్రీలను అవమానకరంగా ఒక సిగ్గు ఎగ్గూ లేని వారిగా చిత్రికరించి ,వారి ఒంటి మీద వ్యాపారం చేస్తున్నమోడరన్ వ్యాపార వాదం కళ్ళ ఎదుట బరి తెగించి విస్తరిస్తున్న , మనువాద వ్యతిరేకుల కళ్ళకు కనపడదు .మనువు ఎప్పుడో ఏదో రాసాడని దాని వల్లనే ఈదేశం లోని స్త్రీ జాతి అభ్యుదయం అడుగంటి పోయిందని తెగ బాద పడుతున్న వారు, తమ కళ్ళ ఎదుట జరిగే అమానుష ,అసమాన విదానాలని ఎత్తి చూపలేని వారు, ఎప్పుడో ఏదో జరిగిందని కుంటి సాకులు చెపుతూ హిందూ జాతి మీద విషం కక్కు తున్నారు ."ఉట్టి కెగర లేని వాడు స్వర్గానికి ఎగురుతాను "అన్నట్లు ,కళ్ళ ఎదురు జరిగేదానిని నిరొదించ లేని వారు పూర్వ కాలం లోని దుర్నితిని రూపు మాపటానికి కృషి చేస్తున్నాను అని మతి మాలిన పలుకులు పలుకుతున్నారు ...