అడవుల్లో నాగు పాములను చంపేవారిని పట్టించుకోకుండా , నగరం లో స్త్రీలకు "నాగపూజ " వద్దని చెపుతున్న ఆటవిక అధికారులు!!?
రేపు నాగ పంచమి ! శ్రావణ మాసం లో 5 రోజును నాగపంచమిగా జరుపుకోవడం హిందువులకు ఆచారం. ఉత్తరాది వారి సంగతేమో కాని , మన తెలుగు వారు నాగపంచమి నాడు కంటే దీపావళి తర్వాత వచ్చె "నాగచతుర్ది " కే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు . దానినే మనం నాగుల చవితి పండుగ అంటాం. నాగపంచమి నాడు అయినా , నాగుల చవితి నాడైనా స్త్రీలు చేసేది ఒక్కటే . నాగుపాముల అరాదించడం . నాగుపాములకు ప్రతీకలుగా జనావాసాలకు దగ్గర్లోనో, దేవాలయాల్లోనో ఉండె పుట్టలు వద్దకు వెళ్లి అందులో ,పిండి పదార్దాలు తో పాటు పాలు పోసి , భక్తీ బావంతో ...