"న అజ్ఞాని స్వాతంత్ర్య మర్హతి " అని చాటుతున్న నల్లగొండ అరుణ మరణ ఉదంతం. !
ఈ రోజు రాష్ట్రంలో ఇద్దరు ఆడపిల్లలు ప్రేమ ఉన్మాదానికి బలి అయి పోయిన రోజు. ఒకరు పిఠాపురంనకు చెందిన రేవతీ కాగా , మరొకరు నల్గొండ జిల్లా కు చెందిన అరుణ అనే ఇంజనీరింగ్ విద్యార్దిని . ఇరువురూ తమ ఉన్మాద ప్రియులు కిరోసిన్ పోసి నిప్పు అంటించిన తర్వాత ఎగిసిన ప్రేమ జ్వాలలకు తాళలేక మరణించిన వారే. ఇరువురూ హాస్పిటల్లో చేర్చినాకనాలుగైదు రోజులు నరక యాతన అనుభవించి చనిపోయిన వారే. పాపం ఆ ఆడపిల్లల మరణ యాతన చూస్తున్న వారికి ఎవరికైనా హ్రుదయం ద్రవించక మానదు. నల్గొండ అరుణ తండ్రి తన కూతురుని చంపిన వాడిని ఉరి తీసి చంపాలని చెపుతూ రోదిస్తున్న తీరు మనసున్న ఎవరినైనా కదలించి వేస్తుంది. నల్ల గొండ అరుణ కేసులో ఆమె ప్రియుడు సైదులును నేరం జరిగిన 24 గంటలలో నే పోలిసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిస్తే కోర్టు అతన్ని రిమాండ్ కి పంపింది. ఒక వేళ పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపితే , ఆరునెలలోపే విచారణ పూర్తీ చేసి అతనికి గరిష్టంగా శిక్ష విదించవచ్చు. రోజు నల్ల గొండలో రాజకీయ పార్టిలు, మహిళా సంఘాలు, విద్యార్ది సంఘాలు