మనం తినే తిండి, కట్టే బట్టా శాస్త్రీయం కానప్పుడు, " చేప మందు" శాస్త్రీయత గూర్చి "గోల" ఏల "శాస్త్రులూ"
కొంత మంది శాస్త్రులు(సైన్స్ విజ్ణానులు అని చెప్పుకునే వారు), పబ్లిసిటీ కోసమో, లేక వెనుక ఎవరి ప్రోత్సాహా ప్రోద్బలమో తెలియదు కాని, తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందానా వ్యవహరిస్తుంటారు. బారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తాము నమ్మిన మతం ని ఆచరించుకునే హక్కు ఇచ్చింది. ఇటువంటి మతపరమైన కార్యక్రమాలు మనిషి ఆరోగ్యానికి కాని, సమాజ బద్రతకు కాని బంగం వాటిల్లనంత వరకు నిర్వహించుకోవచ్చు. అలాంటి మత పరమైన నమ్మికతో కూడినదే హైద్రాబాద్ బత్తిన గౌడ్ సోదరులు నిర్వహిస్తున్న "చేప ప్రసాదo" పంపీణీ కార్యక్రమం. ఈ కార్యక్రమం సుమారు నూటా అరవై సంవత్సారులుగా తమ కుటుంబ సబ్యులు నిర్వహిస్తున్నారని గౌడ్ సోదరులు చెపుతున్నారు. వారి తాత గారికి ఒక సాదువు చెప్పిన చేప మందు విదానం ఆస్త్మా(ఉబ్బస వ్యాది) ని నియంత్రిస్తుందని , కాబట్టి ప్రజలకు మ్రుగశిర కార్తే రోజున "చేప ప్రసాదాన్ని," ఉచితంగా పంపీణీ చేస్తున్నామని బత్తిన సోదరులు చెపుతున్నారు. అలాగే వివిద ప్రాంతాల నుండి అనేక వేల మంద...