Ex బాయ్ ప్రెండ్ ని కాదని ఫ్రెష్ బాయ్ ప్రెండ్ తో రొమాన్స్ చేస్తే, రోమ్ లో కూడా కాల్చి చంపడం ఖాయమట !!
ఇదిగో మరొక రుజువు దొరికింది. అదేనండి ప్రపంచం లో ఏ దేశం లో అయినా బాయ్ ప్రెండ్ , బాయ్ ప్రెండే , వాడిలో ఉండే మగబుద్ది ఎక్కడైనా ఒకటే అనే దానికి రుజువు.కొంత మంది మనస్తత్వం ఎలా ఉంటుంది అంటె , పెళ్ళాం విడాకులు ఇచ్చి మరొక వ్యక్తిని పెండ్లి చేసుకున్నా పెద్దగా బాదపడరేమో కాని, గర్ల్ ప్రెండ్ కొంత కాలం తనతో తిరిగి , ఏదో కారణం తో మరొక బాయ్ ప్రెండ్ ను చూసుకుంటే చచ్చినా ఒప్పుకోరు. "దాన్ని చంపి నేను చస్తా " అంటారు. అంతేగా మరి! సంసార బందం కంటె బలియమైనది రంకు సంబందం. దానినే మై చాయిస్ వాదులు ప్రేమ బందం అంటారు కాబోలు! సరే, ఇంతకి అసలు విషయం ఏమిటంటే సో కాల్డ్ ఈ ప్రేమ విషయాలలో బాయ్ ప్రెండ్లు చాలా సీరియస్ గా ఉంటూ గర్ల్ ప్రెండ్స్ తమ సొత్తు అయినట్లు , వారు తమని కాక వేరెవరి వంక చూసినా తట్టుకోలేక అతి కిరాతకంగా డాడి చేసి చంపడానికి కూడా వెనుకాడరు . ఇందుకు ఉదాహరణ , మన రాష్ట్రం లో జరిగిన శ్రీ లక్ష్మీ, మనోహర్ కేసు, వరంగల్ ఎన్ కౌంటర్ కేసు. అదే కోవలోకి వస్తుంది ఇటీవల రోమ్ లో అతి కిరాతకంగా ...