గాంగ్ రేప్ కేసుల్లో "నిర్బయ " ల కంటే "నిర్బాగ్య" ఉదంతాలే ఎక్కువ!
డిల్లీ గాంగ్ రేప్ ఉదంతం తర్వాత యావత్ దేశం స్పందించిన తీరుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి "నిర్భయ" చట్టం తెచ్చింది. దాని దెబ్బతో దేశం లో రేప్ కేసులు తక్కువ అవుతాయని అనుకున్న వారి అభి ప్రాయం తప్పని రుజువు చేస్తూ ఆ తర్వాత అనేక వ్యక్తిగత, సామూహిక అత్యాచార ఘటనలు జరిగాయి. దానిలో ముఖ్యమైనది. మొన్నటి ముంబాయి ఉదాహరణ. అలాగే మరిది శవం తో వెలుతున్న ఒక మహీళా కానిస్టేబుల్ ని కనికరమ్ లేకుండా కామందులు చెరిచారని ఈ రోజు పేపర్లో చూశాం. మొన్న ముంబాయిలో సంఘటణ జరిగిన రోజే ఇక్కడ మా ఖమ్మంలో లో కూడా ఒక పదిహేడేళ్ళ అమ్మాయి మీద ఆరుగురు మ్రుగాళ్ళు అత్యాచారం చేసారట. కేసు విచారణ చేస్తున్నారు. అందులో ఇద్దరు కుర్...