గాంగ్ రేప్ కేసుల్లో "నిర్బయ " ల కంటే "నిర్బాగ్య" ఉదంతాలే ఎక్కువ!

                                                               

  డిల్లీ గాంగ్ రేప్ ఉదంతం తర్వాత యావత్ దేశం స్పందించిన తీరుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి "నిర్భయ" చట్టం తెచ్చింది.  దాని దెబ్బతో దేశం లో రేప్ కేసులు తక్కువ అవుతాయని అనుకున్న వారి అభి ప్రాయం తప్పని రుజువు చేస్తూ ఆ తర్వాత అనేక వ్యక్తిగత, సామూహిక అత్యాచార ఘటనలు జరిగాయి. దానిలో ముఖ్యమైనది. మొన్నటి ముంబాయి ఉదాహరణ. అలాగే మరిది శవం తో వెలుతున్న ఒక మహీళా కానిస్టేబుల్ ని  కనికరమ్ లేకుండా కామందులు చెరిచారని ఈ రోజు పేపర్లో చూశాం. మొన్న ముంబాయిలో  సంఘటణ జరిగిన రోజే ఇక్కడ మా ఖమ్మంలో లో కూడా ఒక పదిహేడేళ్ళ అమ్మాయి మీద ఆరుగురు మ్రుగాళ్ళు అత్యాచారం చేసారట. కేసు విచారణ చేస్తున్నారు. అందులో ఇద్దరు కుర్రాళ్ళు తాము ఆ సమయం లో అక్కడ లేమని వాదిస్తునారట. ఈ  గాంగ్ రేప్ మాత్రం తెలిసిన వారు చేసిందే .

 ఒక అమ్మాయి. చదువు మానేసి ఇంట్లో ఉంటుంది. ఆ రోజు కూరగాయలకని బయటకు వచ్చి, సరుకులు కొన్న తర్వాత ఇంటికి తిరిగి వెళుతుంటే ,ఆమె ఉంటున్న ప్రాంతం లోని కుర్రాళ్ళు ఆరుగురు  ఆటో లో వచ్చి, మేము ఇంటికే వెళుతున్నాం రా అని అంటే నిజమేనని నమ్మి ఆ ఆటో ఎక్కిందట. ఆ తర్వాత వారు ఆటో ను ఇంటి దగ్గరికి తీసుకు వెళ్ళకుండా, వేరే నిర్జన ప్రాంతానికి తీసుకు వెళ్ళి అక్కడ గాంగ్ రేప్ చేసారట.ఆ తర్వాత ఆమెను వారు అక్క డే వదిలి వేసి వెళితే, వేరే కుర్రాడు ఎవరో చూసి ఆమె భందువులకు కబరు చేస్తే,వారు అమ్మాయిని హాస్పిటలో జాయిన్ చేసి పోలిసులకు రిపోర్ట్ చేసారట.

   నాకు తెల్సినంత వరకు గాంగ్ రేప్ కేసులలో ఎక్కువుగా నమ్మక ద్రోహం ఉంటుంది. మొదట ప్రేమ పేరుతోనో, మరొక వంక తోనో ఒక అమ్మయిని ట్రాప్ లోకి దించుతాడు ఒకడు. తమ రోజు వారి ప్రేమ కర్యకల్లాపాలను జులాయిగా తిరిగే తన స్నేహితులకు చెపుతూ పెద్ద  హీరోలా పోజ్ కొడుతుంటే తక్కిన వారు ఆహో ఒహో అంటూ వీడిని ఆకాశానికి  ఎత్తేస్తుంటారు. అమ్మాయి సిన్సియర్గ వీడిని లవ్ చేస్తున్నా , వీడూ , వీడి స్నేహితుల ద్రుష్టిలో ఆ అమ్మాయి ఒక కాముకి .కేవలమ్ శరీర అవసరాలకో, డబ్బు అవసరాలకో వీడి చుట్టూ తిరుగుతుందని వారి ద్రుడాభిప్రాయం. అలాంటి అమ్మాయి గురించి ఆ స్నేహితులు ఎంత నీచంగా మట్లాడుకుంటారో వారి మాటలను విన్న వారికే తెలుస్తుంది. అలాంటి  స్నేహితులు ఆ ఫేక్ ప్రెమికుడి ద్వారా ఆ అమ్మాయిని రప్పించి, వారి కార్యక్రమం పూర్తి కాగానే వీరు ఎంటర్ అయి, బ్లాక్ మెయిల్ చేసి గాంగ్ రేప్ చేస్తారు. సాదర్ణంగా ఒక రిద్దరు అయితే విషయం బయట పడదు. పాపం  ఆ అమ్మయి తన తెలివి తక్కువ తననికి తానే చింతిస్తూ, మౌనంగ బరిస్తుంది. కాని ఇటువంటి  విషయాలు వేరే వారు చూసినపుడు కానీ, అదికంగా రక్తస్రావాలు జరిగి హాస్పిటల్ పాలు కావల్సినపుడు మాత్రం ,విషయం పెద్దల ద్రుష్టికి వెళ్ళి కేసులు పెట్టడం జరుగుతుంది.

  ఇంకొక రకం కేసులు, విటులు ఒకరు లేక ఇద్దరితో మాత్రమే అని బేరం కుదుర్చుకుని దూరంగా తీసుకు వెళ్ళి అక్కడ మరికొంత మంది కలిసి గాంగ్ రేప్ చెయ్యడం. ఇది కేవలం డబ్బులు ఇచ్చే దమ్ము  లేక దౌర్జన్యంగా లైంగిక త్రుష్ణ  తీర్చుకోవడం. ఇటువంటి కేసులు తప్పకుండ కేసులు దాకా వచ్చి డబ్బులుతో సెటిల్ అవుతుంటాయి. ఎక్కువుగా ఆటో వాళ్ళు, జులాయిగా తిరిగే అసాంఘిక శక్తులు వలననే ఈ ఘోర క్రుత్యాలు జరుగుతుంటాయి.ఆడపిల్లల అమాయకత్వం , అనైతిక జీవన విదానం కూడా వీటికి తోడ్పడుతున్నాయి. పోలిస్ వారు కూడా రౌడి షీట్ ల మాదిరి రేపిస్ట్ షీట్ లను ఓపెన్ చేసి తరచూ లైంగిక దాడులు చేసే వారి మీద నిఘా  పెడితే పలితం ఉంటుందేమో.

  పైన నేను చెప్పిన నిర్భయ కి నిర్బాగ్య కి ఉన్న బేదం ఏమిటంటే, నిర్భయ లు అంటే ముఖ  పరిచయం లేని వారు, ఏ మాత్రం అంగీకారం లేకుండా లైంగిక దాడి చెయ్యడం  ద్వార బాదితులైన వారు. నిర్బాగ్యలు అంటే పైన ఉదాహరణలలోచెప్పిన విదంగా నమ్మక ద్రోహం ద్వారా  లైంగిక దాడికి గురి కాబడిన వారు. ప్రతి నిర్బాగ్య కేసులో అంతో ఇంతో నిర్బయ విదానం ఉంటుంది కాబట్టి అట్టి కేసుకు కూడా నిర్భయ చట్టం వర్తిస్తుంది.


 ఏది ఏమైనా ,కారణాలు ఏవైనా లైంగిక దాడి అనేదాంట్లో స్త్రీ మాత్రమే బాదితురాలు  కాబట్టి స్త్రీని కోర్కె తీర్చే వస్తువుగా బావించే సమాజం  లో దోపిడి అనేది ఉంటుంది .ఒంటి   నిండా  బంగారు ఆబరణాలు  ఉన్న వ్యక్తీ ఎంత జాగర్త పడతాడో అంత జాగర్త స్త్రీలు తీసుకోవాలి . అలాగే నేరస్తుల గుండెల్లో బయం కలిగించే చర్యలు కూడా  పోలిస్ వారు చేపట్టాలి . ప్రభుత్వాలు చిత్త  శుద్దితో చేస్తే నేర కట్టడి పెద్ద కష్టం కాదు .

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన