అనుజుడిని చంపేసిన వారు ,ఆలి ని చంపాలనుకున్న వారు మన ప్రజా ప్రతినిదులు లంటా !

                                                            


 ఎన్నికల్లో డబ్బు, కులం లాంటివి ప్రబావం  చూపుతున్నంత  కాలం  మన కిటువంటి నాయకులే దాపురించక తప్పదు. వారివురూ సాక్షాత్తు యం.యల్.ఎ లు. అంటే ప్రజల తరపున శాసనాలు చేయడానికి ప్రజల ద్వారా ఎన్నిక కాబడిన వారు. ఒకరు జడ్చెర్ల యం.యల్.ఎ అయితే మరొకరు కైకలూరు యం.యల్.ఎ.

  ఇందులో జడ్చెర్ల యం.యల్.ఎ గారు సర్పంచ్ ఎన్నికల్లో తన బార్యకి పోటిగా తన తమ్ముడు అతని భార్యని నిలపటం సహించలేక, పోటి నుండి తప్పుకోమని తమ్ముడిని హెచ్చరించాడట. మాట విననందుకు తమ్ముడిని కాల్చి చంపాడట!. రాజకీయాల కోసం సోదరుల మద్య వైరం కొత్తేమి కాకపోయినా ఇలా నీచంగ తోడపుట్టిన వాడిని చంపటం అదీ ఒక ప్రజా ప్రతినిది చెయ్యడం అనేది రాష్ట్రం లో దిగజారిన రాజకీయాలకు పరాకాష్ట గా బావించవచ్చు.

 ఇక పోతే మరొక ఆయన కైకలూరు యం.యల్.ఎ. ఆయనకి ఆయన భార్యకి రెండేళ్ళ నుండి పొసగటం లేదట. పడకపోతే గౌరవంగా విడాకులు తీసుకోవచ్చు. యం.యల్.ఎ కాబట్టి భార్యని వదిలించుకోవాలంటే ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి రావచ్చు. తనని  హింసిస్తునాడని, ఒకసారి హత్యా ప్రయత్నం కూడా చెయ్యబోయాడని భార్య పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే, ఆ ప్రజా ప్రతినిది తల ఎక్కడ పెట్టుకుంటాడు.ప్రజల కోసం  పోలిసులకు అదేశాలు ఇవ్వగలిగిన గౌరవ పదవిలో ఉన్నవాడు, ఇంటి పంచాయతీలో వారి చేత కౌన్స్లింగ్ తీసుకునే స్తాయికి దిగజారడం సిగ్గు చేటు.అటువంటి పరిస్తితులు తెచ్చుకోవడం స్వయం క్రుతాపరాదమే. కట్టుకున్న భార్యకే న్యాయం చేయలేని పెద్ద మనిషి, తనను ఎన్నుకున్న ప్రజలకు ఏమి చెయ్య గలుగుతాడు.

    ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దల మాట. అది చేత కానప్పుడు రాజకియాల లోకి రాకపోవడమే మంచిది.ప్రజలు కూడా తాము ఎన్నుకునే వ్యక్తి ఒక్క వ్యక్తి గత గుణ గణాలను, వెనుకటి చరిత్రను పరీశీలించాకే ఓటు వేయడం మంచిది. లేకుంటే తమ స్వార్దం కోసం తోడపుట్టిన వారినే చంపగలిగిన వారు ,ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తారని గ్యారంటీ ఏమిటీ?అయినా మనం ఏ నాడో పాపం చేసి ఉంటాం. అందుకే ఇటువంటి వారి పాలనలో బ్రతుకుతున్నాం. మంత్రుల మీదేమో అవినీతి ఆరోపనలు, యం.యల్.ఎ ల మీద అనైతిక ఆరోపణలు. వీరు మన నాయకులంటా! వారు మన జాతీయా జండాలు ఎగరవేసి సుద్దులు చెపుతుంటే బుద్దూ గాళ్ళు లాగా చెవిలో పువ్వులు పెట్టుకుని వినాల్శిన ఖర్మ పట్టింది ప్రజలకి. అందుకే వీర బ్రహ్మం గారు చెప్పిన మాట "చోరులు పాలకుల రూపంలో ఉందురు" నిజమైంది అనిపిస్తుంది.         

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!