పిర్ర గిల్లి జోల పాడటమంటే ఇదేనా ?!


                                                        
        


 తిలా పాపం తలా పిడికెడు అని రాష్ట్ర వేర్పాటు నిర్ణయం కేవలం అధికార పార్టీ వారిదే అని ఇతర పార్టీల వారు, ముఖ్యంగ ప్రధాన  ప్రతిపక్షం అయిన తెలుగుదేశం వారు అనటం బాద్యతా రాహిత్యమే అవుతుంది. రాష్ట్ర విబజన అనేది అంద్రా ప్రాంతం లోని అయిదుకోట్ల ప్రజలకు ఇష్టం లేదని, తెలంగానాలోని మెజార్టీ ప్రజల అభిలాష అని తెలిసినపుడు,అదే విషయాన్ని అఖిల పక్ష మీటింగ్ లో చెప్పాల్శి ఉండె. తెలంగాణా ఇవ్వడం, ఇవ్వక పోవడం అనేది పూర్తిగా పాలనా పరమయిన నిర్ణయం కాబట్టి,మరియు రెండు ప్రాంతాల ప్రజల మనో బావాలకు సంబందించినది కాబట్టి,   దాని గురించి పార్టి పరంగా తాము ఏమి చెప్ప జాలమని, రాజ్యాంగ ప్రక్రియలో భాగంగ  అసెంబ్లీలో  బిల్లు పెడితే తమ పార్టీ సబ్యులుకు విప్ జారీ చెయ్యకుండా వారి వారి అభిప్రాయాలు స్వేచ్చగా చెప్పుకునే వీలు మాత్రమే తమ పార్టీ కల్పిస్తుందని, ఒక్క మాట చెప్పినట్లైతే, ఈ రోజు ఇంత అయోమయానికి గురయ్యే పరిస్తితి ప్రతి పక్షానికి ఉండెది కాదు కదా!ఇప్పుడు పార్టీ నిర్ణయమని చెప్పి, తెలంగాణ ఏర్పటుకు అంగీకార లేఖ ఇచ్చినంత మాత్రానా, రేపు అభిప్రాయా సేకరణలో అసెంబ్లిలో ఆ లేఖ కు కట్టుబడి సీమాంద్ర. తెలుగుదేశం  M.L.A లు     ఉంటారా? ఉండి పార్టీ కోసం తమ రాజకీయ భవిష్యత్ ని  నాశనం చేసుకుంటారా? మరి అలా ఉండనప్పుడు పార్టీ వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానికి సాహసం చేస్తుందా? ఎందుకు ఈ పనికి మాలిన పనులు అన్నీ?

 ఒకసారి తెలంగాణా కు అనుకూలమని లేఖ ఇచ్చాక, ఇక దాని ద్వారా ఏర్పడే పరిణామాలు అన్నిటికి, అటు అధికార పార్టీ,ఇటు ప్రతిపక్ష పార్టిలు బాద్యత వహించాల్సిందే. అవ్వా, బువ్వా రెండు కావాలంటే అసంభవం. అప్పుడు అంగీకార లేఖ ఇచ్చిన తెలుగు దేశం అదినాయకుడు ఇప్పుడు ప్రధాని గారికి మీరు మౌనంగా ఉండొద్దు అని లేఖ రాయడం నష్ట నివారణా చర్యల్లో బాగం అని అనుకోవాల్సి వస్తుంది.ఆ నాడైనా, ఈ నాడైనా తెలంగానా విషయం లో పాపం ప్రదాన మంత్రి గారు నిమిత్త మాత్రులు. అసలు ప్రదాన మంత్రి అనే వారు ఒక రున్నారని, అటు ప్రజలు, ఇటు పార్టీలు ఎప్పుడో మరచి పోయాయి. అందరికి ఆ అమ్మ ఒకటే. అమ్మ యస్.అంటె యస్. నో అంటె నో.కానీ ప్రతిపక్ష నాయకుడికి గారికి సడెన్ గా ప్రదాన మంత్రి గారు ఉన్నారని గుర్తుకు రావడం ఆశ్చర్యమే మరి! బహూశా ప్రతిపక్ష నాయకుడిగా తనకు గల చట్టబద్దమైన అధికారాలు, బాద్యతలు గుర్తుకు వచ్చి ఉంటాయి కాబోలు.

  ఏది ఎమైనా ఇప్పటికైన రెండుకళ్ళ సిద్దాంతానికి స్వస్తి చెప్పి, చేతనైతే పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి దానికి మిగతావారు కట్టుబడేలా చెయ్యడం, లేక పోతే పార్టీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని, ఆ యా ప్రాంత నాయకుల అభీష్టానికి వదిలి వెయ్యడం మంచిది. అంగీకార లేఖ ఇచ్చిన చేతితోనే, "మీ చర్యలు వల్ల తెలుగు వారి మద్య చిచ్చు ఏర్పడిందనే" లేఖలు రాస్తే అది ఖచ్చితంగ పిర్ర గిల్లి, జోల పాడినట్లు అవుతుంది. ప్రజలు అమా యకంగ లేరని జరుగుతున్న ఉద్యమాలు లో రాజకీయ నాయకులకు  ఎదురవుతున్న నిరసనలు చూసి అయినా రాజకీయ పార్టిలు పాఠాలు నేర్చుకుంటే  మంచిది.             

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.