కలపడానికైనా,విడగొట్టడానికైనా బలమైన శక్తి ఒకటి అనివార్యం


                                                                     
  మన రాష్ట్రం విబజించుతున్న తరుణంలో తెలుగు జాతి గురించి , జాతి మూలాలు గురించి కావల్సినంత సమాచారం వివిధ వెబ్సైట్లలో ప్రత్యక్ష మవుతుంది . అటు విభజన వాదులు కానీ ,సమైఖ్య వాదులు కానీ ఎవరికీ అనుకూలమైన వాదనలు వారు చేస్తున్నారు . వేర్పాటు వాదులు 'మీసంస్క్రుతి వేరు ,మా సంస్క్రుతి వేరు ' అని 400 యేండ్ల చరిత్రను ఉదాహరణగా చూపుతుంటే , "లేదు ,లేదు మీరూ మేము అన్నదమ్ములమే ,గతిమాలిన రాజకీయాలు వల్ల విడిపోయాం " అని వేల యేండ్ల చరిత్రను ఉదాహరిస్తునారు ,సమైఖ్య వాదులు . అయితే వారైనా , వీరైనా గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ,"ఆస్తులు కోసం కీచులాడుకుని విడిపోవటం అనేది కూడా మన  అన్నదమ్ముల సంస్కృతిలో బాగమే " అన్న విషయం .

   అసలు తెలుగు నాడు హిందూ రాజుల తర్వాత నవాబుల.పాలన లోకి వచ్చిన ప్రాంతం . అందులో కొంత బాగం ఇంగ్లీష్ వారికి ఇచ్చి, అందుకు ప్రతిపలంగా పైకం తీసుకున్న ఘన చరిత్ర నైజామ్ నవాబులది. అలా అమ్ముడుపోయిన అన్నలు ఆంద్రావారైతే, నవాబుల ఏలుబడిలో ఉన్నవారు తమ్ముళ్లైన తెలంగాణా వారు. అలా అమ్మబడిన ఆంద్రా అన్నలు వారి ఇంగ్లీష్ ప్రభువులు దగ్గర నుండి కొన్ని తెలివి తేటలు నేర్చుకుని,ఇంగ్లీష్ వారిని ఎలాగో దేశం నుండి వెల్లగొట్టి స్వతంత్రులయ్యారు. అప్పటికి తమ్ముళ్లుకు స్వాతంత్ర్యం లేక నైజామ్ వోడి రాజ్యంలో తిప్పలు పడుతుంటే తెలుగు సోదరులకోసం, తమకున్న విజ్ణానంతో "కమ్మ్యూనిజం" అనే బావంతో విమోచన ఆయుదంతో తెలంగాణా తమ్ముళ్ళను చైతన్య పరచి, నైజామ్ రజాకార్లను ఎదిరించి పోరాడుతున్న తరుణంలో, అటు కాంగ్రెస్ వారు కూడా భారత సైన్య సహకారంతో  నిజాం ని దించి, తెలంగాణ ప్రజలకు విముక్తి ప్రసాదించారు. ఇందులో ఆ నాడు ఉన్నది సోదర బావమే తప్పా దోపిడి బావం ఉందని నేననుకోను.ఇప్పటి వరకు కూడా తెలంగాణాలో కమ్మ్యూనిశ్ట్ పార్టీల మీద ప్రజలకు అభిమానం ఉందంటే, నాడు వారు ఆంద్రా నుండి వచ్చి చేసిన త్యాగాలే.

   కొన్ని వందల యేండ్లుగా జరుగుతున్న మన చరిత్రను పరిశిలిస్తే, బలమైన నాయకులు ఉన్నప్పుడు కలిసి ఉన్నాం. అసమర్దులు అయినప్పుడు విడిపోయాం. ఇదే సూత్రం ప్రస్తుతం కూడా వర్తిస్తుంది. మనం అన్నదమ్ములమే. అందులో నోడౌట్. కాని కొన్ని బలమైన  స్వార్ద రాజకీయ శక్తులు మనల్ని విడదీస్తున్నపుడు, మనల్ని కలపడానికైనా, బలమైన శక్తి ఒకటి అవసరం . అంత దమ్మున్న మగాడు ప్రస్తుతం ఎవరున్నారు? ఉద్యోగులు, విద్యార్దులు, వీరు చేశే ఉద్యమాలు హైద్రాబాద్ లోవాటా పరిష్కరించే వరకే అని అనిపిస్తుంది.ఎవరి వాదనలు వారు చేస్తున్నంత కాలం ,కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కి తలొగ్గక తప్పదు . తెలంగాణాలో సమైక్య వాదం అనే భావన బయట పడనంత వరకు అందరా వారి ఉద్యమం చేయగలిగింది ఏమి ఉండక పోవచ్చు . సమైక్య ఆంద్రా అంటూ సీమాంద్ర వరకే ఉద్యమం చేస్తే , అది తెలంగాణా లేని సమైక్యాంద్ర ఉద్యమం అవుతుంది కాని , సమైక్యాంద్రప్రదేశ్ ఉద్యమం ఎలా అవుతుంది ? అక్కడా ఇక్కడా ప్రజలని ఒక మాటమీద నడిపి, కేంద్ర ప్రబుత్వ మెడలు వంచగల దమ్మున్న వాడు ఎవరు? అలా లేనపుడు గొడవలతో కలసి ఉండే కంటే విడిపోయి కొంత గోల తగ్గించుకోవడం మంచిది కాదా? ఇప్పటికి తమ మనసులో మాటను స్పష్టంగా చెప్పే వెన్నెముక లేని ఈ రాజకీయ నాయకులు ఏలుబడిలో కలిసి ఉండే బదులు బారాన్ని దేవుడి మీదకు వదలి విడిపోవటమే మేలు అనేది నా అభిప్రాయం.     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!