తండ్రి గా పరిగణించ బడడానికి " జన్మ దాతే " కానవసరం లేదు !.




                                                         

   సినీ తారల జిలుగు వెలుగులు వెనకాల ఎంత కంపుకొట్టే కుటుంబ సంస్క్రుతి ఉందో అర్దమవుతుంది. నాకు తెలిసి ఏ మాత్రం మాన మర్యాదలు  ఉన్న వారు తమ ఆడపిల్లల్ని సినిమా రంగం వైపు కన్నెత్తి చూడనివ్వరు. పెద్ద పెద్ద హీరోలు సైతం తమ మగ పిల్లల్ని, సినిమాల్లో నటించేందుకు అంగీకరిస్తున్నారు కాని,సాద్యమైనంత వరకు కూతుళ్ళని సినిమా రంగంలో పరిచయం చెయ్యడానికి ఇష్టపడరు. సినిమా రంగం లో స్త్రీలకు లబించే గౌరవం ఎటువంటిదో వారి గురించి తీసిన సినిమాలే గొప్ప ఉదాహరణ. సినిమాలలో నూటికి పది లేక పదిహేను శాతం సినిమాలే సక్సెస్ అవ్య్తుంటాయి. అల సక్సెస్ అయిన సినిమాలలో నటించే నటీమణులు క్లిక్ అయ్యాక ,వారికి కొంత ఇమేజ్ వచ్చాక "క్రుత్రిమ గౌరవాలు" ఏర్పడి ఒక స్తాయి లో నిలదొక్కుకోగలుగుతారు. అంటే నూటికి తొంబై తొమ్మిది మంది చెడిపోతే గాని ఒక్క స్త్రీకి గౌరవం దక్కదు. స్త్రీలను ఆటబొమ్మలు చేసే అత్యంత నీచ నిక్రుష్ట రంగం సినిమా రంగం.కాని మన దౌర్బాగ్యం కొద్దీ స్త్రీ పురుష సంబందాలు ఎలా ఉండాలో ఈ నటీ మణులే అప్పుడప్పుడు సెలవిస్తూ సంచలనాలు రేపుతుంటారు.ఆ క్లిక్ అయిన ఒక్కరిద్దరిని చూసీ యువతులు , వారి జీవితాలు ఏవో గొప్పవని,డబ్బుకు డబ్బు, పేరుకు పేరు దొరికే గొప్ప అవకాశాలు ఉన్న రంగం గా బావించి సినిమా గబ్బులో కూరుకుపోతున్నారు.

  మొన్నటికి మొన్న అంజలి అనే తెలుగు అమ్మాయి, తన కుటుంబ సబ్యుల మీద తివ్ర వ్యాక్యలు  చేసి,కొన్నాళ్ళు కనపడకుండా పోయి చివరకు స్వాతంత్ర్యం పొందినట్లుంది. నిన్న సాయి శిరీష అనే అమ్మయి, మూడు నెలలనుండి కనపడకుండా పోయి, ఆమె తల్లి పోలిస్ రిపొర్ట్ ఇస్తే, తను ఇల్లు వదలి పోవడానికి ముఖ్య కారణం తన పెంపుడు తండ్రి లైంగిక వేదింపులే కారణమని ఒక బాంబు పేల్చింది. మరి తండ్రి కాని తండ్రి వేదింపులు నిజమయితే ఆ విషయం తల్లితో ఎందుకు చెప్పలేదో, ఆ తల్లి తన కూతురు ప్రవర్తననే ఎందుకు తప్పు పడుతుందో, ఇంకా పూర్తి సమాచారం బయటకు రాలేదు కాబట్టి, ఈ గాడి తప్పిన కుటుంబ సంబందాలు గురించి ఇప్పుడే చెప్పటం సరి కాదు.

  ఏది ఏమైనా గత్యంత్రం లేని పరిస్తితుల్లో స్త్రీలు రెండవ పెండ్లి చేసుకోవలసి రావచ్చు. అటువంటపుడు ఆ భర్త గా వచ్చిన వాడు తప్పకుండా ఆమే సంతానానికి తండ్రి లాంటి వాడే. ఒక వ్యక్తి తండ్రి కావటానికి జన్మ దాతే కానవసరం లేదు,అమ్మకి మొగుడు కావల్సిన అవసరం కూడ లేదు. పిత్రు హ్రుదయం ఉంటే చాలు. పిల్లల మీద ప్రేమతో కాని, జాలితో కాని చేరదీసి విద్యాబుద్దులు నేర్పించి కుటుంబానికి అండగా నిలిచే వాడు ఎవరైన తండ్రితో సమానమే. తండ్రి ఒక్క ప్రాదమిక కర్తవ్యం పిల్లల్ని  అన్ని బాదల నుండి కాపాడి వారి ఉన్నతికి తోడ్పడడం .అదే నిజమైన పితృ హ్రుదయం ఒక వేళ స్వంత తండ్రి అయినా సరే "పితృ  హ్రుదయం " లేక పోతే వాడిని తండ్రిగా పరిగణించవలసిన అవసరం లేదు. కొంత మందిని చూస్తుంటాం. మగపిల్లల్ని ఎక్కువుగా గారాబం చేస్తూ, ఆడపిల్లల్ని ఈసడించుకుంటుంటారు. ఆడపిల్లకి పెట్టేదంతా వేస్ట్,అది ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టబడేదే అనే ముందు చూపుతో వ్యవహరించే వారు మన సమాజంలో తక్కువేమి కాదు. అటువంటి "వ్యాపార తండ్రులు" గా వారు మారడానికి కారణం వారిలో పిత్రు హ్రుదయం లోపించడమే.కొంత మంది మాత్రం పిల్లలు తమ వారు కాకపోయిన వంచకుల చేతిలో పడి నష్టపోతున్నారని బావించినపుడు రిస్క్ తీసుకుని వారిని కాపాడతారు. కారణం ఆ పిల్లల్ని చూస్తుంటే తమ పిల్లలు గుర్తుకు వచ్చి వారిలో "పితృ  హ్రుదయం " మేల్కొంటుంది. అలాగే మాతృ హ్రుదయం కూడా.అటువంటి వారి పట్ల పిల్లలు కూడ క్రుతజ్ణతా బావం చూపాలి. స్వంత తల్లితండ్రుల ప్రేమాభిమానాలు పొందడం పిల్లల పూర్వ జన్మ సుక్రుతం. అలా లేనపుడు ఆదుకుని అన్నం పెట్తి తమ ఉన్నతికి పాటు పడే వారే తల్లితండ్రులు. అందుకే మన హిందూ ధర్మం జన్మ దాతలకు ఏ హోదానిచ్చిందో, పెంపుడు తల్లి తండ్రులకు అదే సమాన స్తాయి ఇచ్చింది. అటువంటి తల్లితండ్రులను, అవసరంతీరాక నిందలు వేసే వారు, నిర్లక్ష్యం చేసే వారు రౌరవాది నరకాలు పొందుతారు.             

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం