ఇవ్వకుంటే బార్యతో తంటా!ఇస్తే ప్రభుత్వం తో తంటా!


                                                            
      


  ప్రభుత్వాలను అంచనా వెయ్యడానికి వారు వసూలు చేస్తున్న పన్నుల విదానం, ప్రజల నుండి వివిద రూపాలలో పొందే అన్ని రకాల ప్రభుత్వ ఆదాయ వనరుల  విశ్లేషన ఉపయోగపడుతుంది. ముస్లిం రాజుల కాలంలో హిందువుల మీద "జుట్టు" పన్ను, తీర్ద యాత్ర పన్ను అనేవి కూడా వసూలు చేసే వారట, అంటే హిందువులు దైవదర్శనానికి తీర్ద యాత్రలు చేసినా, జుట్టు పెంచుకున్న పన్ను కట్టాల్సి వచ్చేదట! ఇప్పుడైతే లౌకిక రాజ్యాలు కాబట్టి అటువంటివి ఏమిలేవు. పైపెచ్చు మక్కా యాత్రకి ప్రబుత్వ సహాయం కూడా లభిస్తుంది.

  కాని ఎందుకో ఆంద్ర ప్రదేశ్ ప్రబుత్వం వారికి బార్య,భర్తలు సంబందాలు అన్నా,ఇతరకుటుంబ సబ్యుల మద్య సంబందాలు అన్నా కొంచంకోపంగానే ఉన్నట్లుంది. అందుకే వారి మద్య ఉచితంగా ఇచ్చిపుచ్చుకోవడాలను నియంత్రించాలని చూస్తుంది. ఒక వ్యక్తి స్వార్జితమయినా, పిత్రార్జితమయినా అతని కుటుంభ సబ్యులు అందరూ అనుబవిస్తుంటారు. వారిలో వారికి తగాదా వచ్చినప్పుడు మాత్రమే ఆస్తుల స్వబావ రీత్యా వాటాల పంపక నిర్ణయం జరుగుతుంది. వారిలో వారు ఇష్ట పూర్వకంగా చేసుకునే ఆస్తుల పంపిణీ విదానానికి ప్రబుత్వం వక్ర బాష్యం చెప్పి, రిజిస్త్రేషన్ స్టాంప్ డ్యూటీ వసూలు చెయ్యడం అక్రమమ్. మతిమాలిన తనానికి నిదర్శనం.

  మన రాష్ట్రంలో స్తిరాస్తి బహుమతిగా ఇవ్వాలంటే, కుటుంబ సబ్యులకైతే మూడు శాతం, వేరెవ్వరికైనా ఆరు శాతం స్టాంప్ డ్యూటి వసూల్ చేస్తారు. అలాగే ఇప్పటి వరకూ వసూలు చేస్తున్నారు. కాని కొత్తగా జారీ అయిన రిజిష్ట్రెషన్ శాఖ అంతర్గత సర్కులర్ ప్రకారం, కుటుంబ సబ్యులకైనా సరే , ఆస్తి స్వార్జితమయితే ఆరు శాతం వసూలు చెయ్యాలని, వంశ పారంపర్య ఆస్తి అయితేనే మూడు శాతం వర్తిస్తుందని సెలవిచ్చారట. వారు ఏ రకంగా కుటుంబ సబ్యులను ఆస్తి స్వబావ రీత్యా తేడా చూపారో అర్దం కావటం లేదు. కుటుంభ సబ్యుడు అనే నిర్వచనం వ్యక్తి ఒక్క జన్మ ,లేక వైవాహిక సంబందాలు వలన నిర్ణయించబడతాయి. అంతే కాని ఆతను బహుమతిగా ఇస్తున్న ఆస్తి స్వబావ రీత్యా నిర్ణయించబడవు. అటువంటప్పుడు ఇతరులకు వసూలు చేసినట్లు కుటుంబ సబ్యులకు  ఇచ్చే బహుమతుల మీద స్టాంప్ ద్యూటీ వసూలు చెయ్యడమేమిటి? అడిగే వాడు లేకపోతే సుఖ సంసారమ్ కి కూడ పన్నులు వేసేటట్టునారు కలి రాజులు.

 పొరుగున ఉన్న కర్ణాటకలో కుటుంబ సబ్యులకు ఇచ్చే బహుమతి రిజీశ్త్రేషనలకు  నామమాత్రపు రుసుములు వసూలు చేస్తారట. మరి ఇక్కడ రూపాయికి కిలో బియ్యం ఇచ్చే ఏలికలు ఉన్నారు కాబట్టి ఇలా అనుచితంగా వసూలు చేస్తున్నట్లుంది. అటు మద్య పాన విషయంలోను ఆంద్ర సర్కార్ కుటుంబాలను నాశనం చేసి ,తన ఆదాయాన్ని మాత్రం పెంచుకుంటుoది.  ఏ వ్యక్తి అయినా ఒంటిగా సంపాదించలేడు . అతనికి కుటుంబ సబ్యులు ఇచ్చే తోడ్పాటు , వారి కోసం జివించాలనే ఆసే అతనిని ఆస్తులు ఆర్జించేలా చేస్తుంది కాబట్తి స్వార్జిజితమయినా,పిత్రార్జితమయినా అది కుటుంబ ఆస్తియే. వారి మద్య పంపకాలు ఏవైనా, నామమత్రపు రుసుములు వసూలు చెయ్యడం కరెక్ట్.  బార్య ముచ్చట తీర్చటానికి తన ఆస్తిలో బహుమతిగా ఇద్దామనుకునే వాడుకూడా ఈ ప్రబుత్వ బాదుడు చూసి నోరు మూసుకుంటాడు.అలా కూడా స్త్రీలు నష్ట పోతారన్నమాట!       

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )