మాలో ప్రవహిస్తుంది తల్లుల్ని పూజించిన ప్రదమాంద్ర పాలకుల రక్తమే తప్పా,ప్రియురాళ్ళ కోసం పట్టణాలు కట్టించిన నిజాం ప్రభువులుది కాదు.


                                                     

 గొప్ప వారు అని పిలువ బడుతున్న వారు, గొప్ప,గొప్ప చదువులు చదివిన వారు, రాజనీతి శాస్త్ర విశారదులు అని కొని యాడబడుతున్న వారే, తుచ్చమయిన పదవుల కోసం,ఎంతో ఘనమైన చరిత్ర గలిగిన తెలుగు వారి ప్రాచీనతను మరుగున పెట్టి, కేవళం మూడు నాలుగు వందల యేండ్ల చరిత్రకు మాత్రమే తాము వారసులమని,తమని బానిసలా పరిపాలించిన హైద్రాబద్ ప్రభువులే తమ పూర్వ వారసులని, వారు నిర్మించిన హైద్రాబాదే నగర సంస్క్రుతే తమ సంస్క్రుతి అని ఫిలవుతూ,నవాబులు తిన్న బిర్యానే తమ ఆహార సంస్క్రుతి గా,  తప్పుడు వాదనలు చేస్తుంటే నిజంగా ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది.

   మన చరిత్ర అంటే ఏమిటి? ఏ సమజానికి అయినా ఉన్నత దశ, అదమ దశ ఉంటాయి. తెలుగువారిలో అత్యదిక శాతం హిందూ సాంప్రదాయం పాటించే వారు. మన పూర్వికులు శైవం,వైష్ణవం తో పాటు బౌద్ద మత్తాన్ని కూడ ఆరాదించారు, పాటించారు. మన తొలి ఆంద్ర పాలకులు అయిన శాతవాహనుల కాలంలో బౌద్దం, హైందవం సమానంగా గౌరవించబడినవి. కాల క్రమేణా బౌద్దం అంతర్దానమైనా, హైందవం కాల పరీక్షకు నిలబడి విరాజిల్లింది. ఎందుకంటే అది పురాతన మైనదే కాక అన్నిo టిని  తనలో ఇముడ్చుకోగల శక్తి గలది. దీనికి ఒకటే ఋజువు . ముస్లిం స్నేహితుల కోసం  మనం "హలాల్ " చేసిన మాంసం తింటాం . అదే మన సెక్యులరిజం . పాలకులు ఎవరైనా ఈ గడ్డ మీద జన్మించిన వారు కాబట్టి, మన సంస్క్రుతి పరిరక్షణకు పాటు పడ్డారు కాబట్టి,  వారి పాలనా కాలం సంస్క్రుతే మన సంస్క్రుతి అని చెప్పుకోవాలి. అంతే కాని ఎక్కడో విదేశాల నుండి దురాక్రమణ  కోసం, పొట్ట కూటి కోసం, వ్యాపారాల కోసం మన ప్రాంతాల కొచ్చి,మన అనైక్యతను ఆసరాగా చేసుకుని , కుట్రలతో మన మద్య విబేదాలు స్రుష్టించి, మనల్ని వారి మతాలలోకి మార్పిడి చేసి, కాదన్న వారిని బానిసలు చేసి పరిపాలించిన వారి సంస్క్రుతి మన సంస్క్రుతి ఎలా అవుతుంది? వారి ఆహారపు అలవాట్లు మనవి ఎలా ఔతాయి? వారి విలాసాల కోసం ఎర్పాటు చేసుకున్నవి మన అభివ్రుద్ది ఎలా అవుతుంది?

  అందుకే ఉంపుడు గత్తె కోసం నిర్మించిన నగరం సంస్క్రుతి మన సంస్క్రుతి కాదు. ఓరుగల్లు సంస్క్రుతి మనది.విజయ నగర సంస్క్రుతి మనది.అంతకుముందు యావత్ బౌద్ద బారతంలో పేరుగాంచిన ధరణీకోట సంస్క్రుతి మనది అని గర్వంగా ప్రతి తెలుఇగువాడు చేప్పుకోవలసిన పరిస్తితి నుండి నాలుగు వందల బానిస చరిత్రే మాది అని మా పిల్లలకి చెప్పుకోవలసిన దుస్తితికి ప్రస్తుత రాజకీయ నాయకులు దిగజారుస్తుంటే మిన్నకుండిన ప్రజలు చరిత్ర హీనులవుతారు.

  ఆంద్రా, తెలంగాణా ప్రజలు అన్న దమ్ములే అని ఒక  పక్క చెపుతూ, మీ సంస్క్రుతి వేరు, మా సంస్క్రుతి వేరు అని చెప్పటంలో ఔచిత్యమేమిటి? వారికైనా, వీరికైనా ఒకటే చరిత్ర. సమర్దులు రాజులు గా ఉన్నంతా కాలం కలిసి ఉన్నారు, అసమర్దుల పాలనలో విడి పోయారు.అందుచేత స్వాతంత్ర పూర్వ హైద్రాబాద్ మనది కాదు. దాని తర్వాత అభివ్రుద్ది చెందిన ఆదునిక  నగరసంస్క్రుతే మనది.తెలంగాణా  విడగొట్టడం కోసం నిజాముల  సంస్రుతిని మన సంస్క్రుతి అని చెప్పుకోవలసిన అవసరం లేదు.వారినెదిరించిన "చాకలి అయిలమ్మ "పోరాట సంస్క్రుతి మన సంస్క్రుతి అని చెప్పండి. అంతకు ముందు కాకతీయ సంస్క్రుతి మాదంటే ఆంద్రా వారు అది కూడా మాదంటారు అనే బావనతోనే చరిత్రను కుదించి పీడకులకు వారసులుగా చెపుతున్నారు.ఇది సమర్దించ దగినది కాదు.మనల్ని పాలించిన మన ప్రదమాంద్ర పాలకులు ,తమ పేరులుకు ముందు తల్లి పేరును చేర్చి మాత్రుమూర్తిని గౌరవించారు .గౌతమి పుత్ర శాతకర్ణి, వాసిష్ట పుత్ర పులుమావి ఇవీ ఆ నాటి మన చక్రవర్తుల పేర్లు. ఇలా తల్లుల్ని గౌరవించిన సంస్క్రుతి మనది అని గర్వ పడండి. మన కాలెండర్కి ప్రామాణికమైన శక  పురుషుడు "శాలివాహన చక్రవర్తి" మన ప్రదమ తెలుగు  పాలకుడు అయినందుకు సంతోషించండి.అంతే కాని బిర్యానీ బాగుందని విదేశి పాలకులను మన వారు అంటే మన స్వాతంత్ర్యానికి అర్దమే లేదు.  
                                                              
  తెలుగు ప్రజలు విడి పోవటాం అనేది అన్న దమ్ముల  చిన్న కుటుంభాల ఏర్పాటు  లాగా ఉండాలి తప్పా, అందుకోసం చరిత్రలను, సంస్క్రుతిని ఎంచుకుని విడిపోవటం అంత బుద్ది తక్కువ తనం మరొకటి ఉండదు. అలా చేస్తే కొంత మంది అంటున్నట్లు నవాబుల మానస పుత్రుల కుట్రయే "దొరల తెలంగాణా ఎర్పాటు" అనెది నిజమని బావించాల్సి వస్తుంది. అటువంటి  తెలంగానా వల్ల, ప్రజలకు కీడే తప్పా మేలు జరుగదు కాక జరుగదు. ఇప్పట్టికైనా ఏర్పాటు వాదులు కొంత సంయమనం పాటించి, హైద్రాబాద్ విషయంలో ఉదారంగా వ్యవహ రిస్తే రెందు ప్రాంతాల ప్రజలు అంగీకార యోగ్యమయ్యేలా విబజన జరగవచ్చు. దీనికి ఓర్పు, సంయమనం రెందు ప్రాంతాల వారికి అవసరం.             

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )