గాందీ తాత చెప్పింది వద్దు, గురజాడ తాత చెప్పిందే ముద్దు, అని చాటిన తెలంగానాంద్రులు!

                                                                
                                                        

  బాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలో బాగంగా భారత దేశంలో  మొట్టమొడటగ ఆవిర్భవించిన రాష్ట్రం ఆంద్రప్రదేశ్. తెల్లవాడి పాలన నుండి ,మద్రాస్ రాష్ట్రంలో అంతర్బాగంగా ఉన్న తెలుగువారిని, నిజాం నవాబు పాలనలో మగ్గుతున్న తెలంగాణా లోని తెలుగు వారిని కలిపి, ఒకే బాష మాట్లాడే ప్రజలు ఒకే జాతి గా కలిసి మెలిసి ఉండగలరన్న బావనతో విశాలాంద్ర ఏర్పాటు చేసారు అప్పటి పెద్దలు.

 కానీ ఇప్పటి వారికి కొంతమందికి ఆంద్రా ప్రాంతం తెలుగు వారు తమ వారు కాదని, వారి బాష వేరు తమ బాష వేరని, అలాగే తమ ఆహారపు అలవాట్లుకు వారి ఆహారపు  అలవాట్లకు తేడాలున్నాయని, కొత్త వాదాలతో తెలంగానా వేర్పాటు ఆవశ్యకత నొక్కి చెపుతూ, దాని సాదనకు ఉద్యమించారు. ఉద్యమంలో కూడ కొత్త పోకడలు కనిపెట్టి ఆంద్రావారికి కూడ ఆదర్శ ప్రాయులయ్యారు. సాదార్ణంగా నిరసన తెలిపే విదానం గాందీ గారు చూపిన "నిరాహార దీక్ష".అంటే ప్రజలు ఆహారం తీసుకోకుండా శాంతీయుతంగా నిరసన తెల్పటం. దీనికి ప్రభుత్వం వారు చలించి వారి కోర్కెలు తీర్చడానికి ముందుకు రావచ్చు. కానీ తెలంగానా వారు గాందీ గారి విదానం పసలేనిది అని బావించారు. పొద్దున్నుంచి సాయంత్రం దాక అరవాలంటే శక్తి కావాలి. అరవకుండా కామ్గా కూర్చుంటే మీడియాలో పబ్లిసిటీ రాదు. పబ్లిసిటీ రాకపొటే డిల్లీలో ఉన్న వారికి సీరియస్ నెస్ అర్దం కాదు .అందుకే గాందీగిరి ని పక్కనపెట్టి గురజాడ గిరిని పాటించడం మొదలు పెట్టారు.

 ఇంతకి గురజాడ గిరి అంటే ఎమిటని మీప్రశ్న కదా! ఇదిగో చెపుతున్నా వినండి. గురజాడ గారు చెప్పిన మాటలో సుప్రసిద్దమయినది ఏది? "తిండి గలిగితే, కండ గలదోయి, కండ గలవాడే మనిషోయి" అని అన్నాడు కదా! మరి అలాంటప్పుడు మనం చేసే ఉద్యమం మనుషుల ఉద్యమం లాగా ఉండాలి తప్పా, గాంది గారి కోతి (చెడు అనకు కోతి) లాగా మౌనంగా, ప్రక్రుతికి విరుద్దంగా నోరుకట్టుకుని ఉద్యమం చెయ్యడమేమిటి? నాన్సెన్స్! అందుకే కడుపట్టినంత వరకు తినాలి. నోటికొచ్చినంత వరకు అరవాలి. అలా చెయ్యాలంటే తగినంత తిండి కావాలి. దానికోసం "వంటా వార్పు" మొదలు పెట్టాలి. అదిగో అలా రోడ్ల మీద వంటా వార్పు కార్యక్రమం కూడా నిరసన ప్రక్రియలో బాగమయింది.

  కలిగిన వారు తమకు తోచిన మేర పచారి సరుకులు, ఇతర సామాగ్రి ఇచ్చి ఉద్యమానికి సహాయం చేస్తుంటే, సామాన్య ప్రజలు కూడా సంతోషంతో ఉద్యమంలో పాల్గొని, తినగలిగినంత తిని అరవగలిగినంత అరుస్తున్నారు. ఈ విదానం తెలంగాణా నిరసనోద్యమంలో బాగా పాపులర్ అయి హిట్టయే సరికి, ఆంద్రా వారు కూడ అదే పద్దతిని అవలంబించి సక్సెస్ అవుతున్నారు. ఎక్కడ చూసినా అదే తంతు. హిందువులు ఏ విదంగా అయితే గణపతి పూజతో శుభ కార్యక్రమాలు  మొదలుపెడతారో, ఉద్యమకారులు ముందు వంట పొయ్యి వెలిగించాకే ఉద్యమం మొదలుపెడుతున్నారు. ఈ విదంగా ఆంద్రాకు చెందిన (తెలంగానా వాదుల ప్రకారం) గురజాడగిరిని తెలంగాణా వారు పాటిస్తే, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుతం సీమాంద్రా వారు  చరిస్తున్నారు. అవును మరి. ఎంత కీచులాడుకున్న వీరంతా ఆ  గురజాడ తాత మనవలేగా! అందుకే గాందీ తాత చెప్పిన దానికంటే వారి గురజాడ తాత చెప్పిన దాని మీదే బాగా గురి కుదిరి నట్టుంది . ఒకరి తర్వాత ఒకరు పాటిస్తూ, తాము ఆరంభ శూరులు కాదు, వంటా వార్పు వీరులమని నిరూపిస్తునారు. శబాష్ తెలుగు బిడ్డలారా! ఈ విదంగ నైన మీరంత ఒకటేనని లోకానికి చాటి చెప్పారు. ఎలాగు గురజాడ వారిని స్మరించాం కాబట్టి మన గురజాడ తాత 1910 లో రాసిన ఈ  క్రింది కవితను చదివి ఆనదించండి . ప్రస్తుత పరిస్తితుల్లో మనం అంత కన్నా ఏమి చెయ్యగలం !?.
                                                                    

        దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌


పాడి పంటలు పొంగిపొరలే
దారిలో నువు పాటు పడవోయ్‌
తిండి కలిగితే కండ కలదోయ్‌
కండ కలవాడేను మనిషోయ్‌
ఈసురోమని మనుషులుంటే
దేశమే గతి బాగుపడునోయ్‌
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌

అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్
దేశి సరుకుల నమ్మవలెనోయి;
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయి
వెనక చూసిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనుకపడితే వెనకే నోయి

పూను స్పర్థను విద్యలందే
వైరములు వాణిజ్యమందే;
వ్యర్థ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌

ఓర్వలేమి పిశాచి దేశం
మూలుగులు పీల్చే సెనోయ్;
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్
పరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కద్దోయ్;
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్

సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌
చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌

మతం వేరైతేను యేమోయ్
మనసు లొకటై మనుషులుంటే;
జాతమన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్
దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్తవలెనోయ్;
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండవలెనోయ్

ఆకులందున అణగిమణగీ
కవిత కోవిల పలకవలెనోయ్;
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్తవలెనోయ్
                                                               

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!