పక్కింటాయన అసమర్దుడు అయితే మన ఇంటికి కూడా తప్పవు తిప్పలు!


                                                                 


  మనం ప్రశాంతం గా జీవించాలంటే కేవలం మన ఇంట్లో వారు క్రమశిక్షణ తో వ్యవహరిస్తే చాలదు. పొరుగింట్లో వారు కూడా క్రమశిక్షణ గల వారై ఉండాలి. ఉదాహరణకి మనం మన పిల్లల్ని చక్కని క్రమశిక్షణలో పెంచుతూ,ఇరుగు పొరుగు వారితో గొడవలు పడకుండా సర్దుకు పోయే తత్వాన్ని అలవర్చి, ప్రశాంతంగా జీవించుదామని అనుకోవచ్చు. కాని పక్కింట్లో పరిస్తితి వేరు అనుకోండి.మొగుడు చెప్పిన పెళ్ళాం వినదు. పెళ్ళాం చెప్పిన మాట మొగుడికి రుచించదు. వీరిద్దరు చెప్పే దాని వినే పరిస్తితిని పిల్లలు ఎప్పుడో దాటి పోయారు. పిల్లలు పెంకిగా మారి పోయారు. "తల్లికి వంగని వాడు దాతికి(వద్య శిల) కూడ వంగడు" అని సామెత. కాబట్టి పెద్దోళ్ళ కంట్రోల్ లేని పొరుగింటి  పెంకి పిల్లలు,చీటికి మాటికి మన పిల్లల్తో తగాదా పడుతున్నపుడు, వారి మీద వారి తల్లి తండ్రులకు పిర్యాదు చేసినా పలితం ఏమిటి? ఆ తల్లి తండ్రులు తాము చెపితే తమ పిల్లలు వినరని తెలుసు   అయినా పక్కింటి వారి ముందు తమ అసమర్దతను కప్పి పెట్టుకోవటానికి,మన పిల్లల ప్రవర్తనను తప్పు పడుతూ, వారి పిల్లలను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. దీని వలన ఆ పెంకి పిల్లలు మరింతగా రెచ్చి పోయి మన పిల్లల్ని రెచ్చగొడుతూ ఉంటే, దానితో మన ఇంటి ప్రశాంతత కూడా చిన్నా బిన్నమవుతుంది. వేరే  పెద్ద మనుషులుకు చెప్పినా ఉపశమనం  తాత్కాలికమే. కారణo,  పిల్లల మీద పెద్దలకు కంట్రోలింగ్ పవర్ లేకపోవడమే. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఏమి ఉండదా అంటే, తప్పకుండా ఉంటుంది.

  "ఊదుడు గాడికి బాదుడు గాడే మొగుడుఅంట". అలాగే పెంకిగా వ్యవహరించే పక్కింటి పిల్లల్ను మంచితనం తో చెప్పే మన మాటలు  పట్టించుకోకుండా, కంటిన్యూ గా కవ్వింపు పనులు చేస్తూ మనల్ని నష్టపరుస్తున్నపుడు, గుర్తుండి పోయేలా నాలుగు పీకడమే సరి అయిన మందు. మన ఇంటిజోలికి గాని, మన పిల్లల  జోలికి గాని వస్తే ’వీపు విమానం మోత మోగుద్ది" అనే భయం ఆ పెంకి పిల్లల్లో కలిగితే చచ్చినా ఇటు వైపు చూడరు. అంటే మనం అలాంటి  భయాన్ని ఆ పిల్లలో కలిగించాలి. ఒక వేళా దాని వల్ల పెద్దలతో పెద్ద గొడవైనా బాదలేదు. ఒక్క దెబ్బతో అన్నీ సెట్ రైట్ అవుతాయి. అంతే కాని "ముద్ద ముద్ద కు బిస్మిల్లా" అన్నట్లు తడవ తడవకు పొరుగింటి పిల్లల ప్రవర్తన వల్ల కలిగే గొడవలను పెద్దమనుషుల ద్రుష్టికి తీసుకు వెళ్ళి, వారి జ్యోక్యమ్ కోరుతుంటే మనల్ని కూడా అసమర్దులుగా బావించే ప్రమాద ముంది. ఆ.. ఇదంతా ఆ రెండిళ్ళ వారికి సహజమేలే అనుకుని పెద్దగా పట్టించుకోరు. దీని వలన అంతిమంగా మనమే నష్ట పోవాల్సి ఉంటుంది.

 పైన నేను చెప్పిన ఉదాహరణ ఎవరిగురించో ఇప్పటికే మీ కర్దమై ఉంటుంది. మన పొరుగు దేశం పాకిస్తాన్ గురించి. ఆ దేశ రాజకీయ వ్యవస్త అస్త్యవ్యస్తంగా ఉంది. ఆ దేశ మిలట్రీ మీద ప్రజా  నాయకులకు ఉన్న పట్టు నామ మాత్రం.భారత దేశం అంటే ఒంటి కాలి మీద లేచే ఉగ్రవాద తండాల ప్రబావమే ఆ దేశ సైన్యం మీద ఉన్నట్లు కనపడుతుంది. ఇటు వంటి పరిస్తితిలో ఏ నాయకుడు ఉన్నా చేయగలిగింది శూన్యమే కావచ్చు. నవాబ్ షరీప్ గారి ప్రమాణ స్వీకారానికి మన్మోహన్ సింగ్ గారిని అహ్వానిస్తే, ఇకనైనా దాయాది దేశాల మద్య సత్సంబందాలు నెలకొంటాయని ఆశించాం. కాని గత అయిదు రోజులుగా 12 సార్లు పాకిస్తాన్ సైన్యం సరిహద్దు ప్రాంతంలో కాల్పులకు తెగబడి మన సైనికులను పొట్టన పెట్టుకుంటున్న పరిస్తితి,ప్రజలను గాయపరుస్తున్న పరిస్తితి చూస్తే, సత్సంబందాల మాట దేవుడెరుగు, మనం తగిన సమాదానం త్వరగా చెప్పకపొతే మనల్ని అసమర్దులు అనుకుని వారు మరింత రెచ్చి పోయే ప్రమాదముంది. మాటలు, తీటలు తర్వాత, ముందు నాలుగు పీకులు పీకితేనే వారి ఆగడాలు అణగవు అనిపిస్తుంది. అవసరమైతే మరో కార్గిల్ కి సిద్దపడక తప్పదనిపిస్తుంది. మరి మన నేతలు ఏమి ఆలోచన చేస్తున్నారో!?ఆ.. ఏమి చేస్తారు. దేశ రక్షణ గురించి ఆలోచించాల్సిన రక్షణ మంత్రి,పార్టీ ప్రయోజనాల కోసం ప్రాంత విభజన కమిటీలంటూ లేనిపోని వాటిని కల్పించుకుని,ఉన్న సమస్యలు చాలక లేని సమస్యలను తలకెత్తుకుంటే పరిస్తితి ఇలాగే ఉంటుంది మరి!

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!