ఎయిడ్స్ రోగి అయిన భర్త నుండి విడాకులు తీసుకున్న బార్యకు దక్కేదేమీటి?

                                                            
                                                          

 ఆంద్రా, తెలంగాణా ప్రాంత సంబందాన్ని కొంతమంది అన్నదమ్ములతో పోల్చుతుంటే, మరికొంతమంది భార్యా భర్తలతో పోల్చుతున్నారు. కొంత  మంది అయితే మరీ ఇతర ప్రాంతాల వారి మీద తమకున్న ద్వేషాన్ని,కోపాన్ని వెల్లగ్రక్కడంకోసం లేనిపోనివి, పనికిరాని ఉపమానాలు చేస్తున్నారు. నేడు ఆంద్రప్రదేశ్ లో ఉన్నది సున్నిత పరిస్తితి. ఒకరు తమ డిమాండ్లు సాదించుకోవడానికి,ఉద్యమాలు చేయవచ్చు. అలాగే ఎదుటివారికి కూడ అలాంటి హక్కే ఉంటుందని గుర్తుంచుకోవాలి. నీవు చెప్పేది నీకు సమ్మతం అయినంత మాత్రానా ఎదుటివాడికి కూడ సమ్మతం కావాలని రూలేమి లేదు. రెండు బిన్న వాదనలు ఉన్నప్పుడు సంయమనం పాటించి, ప్రబావవంతంగా, అవసరమైనప్పుడు, సరైన చోట తమ వాదనలు వినిపించి కోరుకుంది సాదించుకోవడమే కార్యదక్షులు చెయ్యాల్సిన పని.

   భారత రాజ్యాంగం ప్రకారం ఏ ప్రాంత ప్రజలకి, తాము ఒక ప్రాంతం నుండి విడీపోతామని కాని, లేక కలసి ఉంటామని కాని చెప్పే హక్కు లేదు. భారత పార్లమెంట్ మాత్రమే, రాష్ట్రపతి రికమెండేషన్తో పార్లమెంటులో బిల్లు పెట్టడం ద్వారా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యడం కాని, ఇతర రాష్ట్రంతో కలపడం కాని చెయ్యగలదు. అది పూర్తిగా పరిపాలానా పరమైన నిర్ణయం. ఒకవేళ ఏ ప్రాంత ప్రజలు అయినా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని బావిస్తే, లేదూ  ఇంకొక ప్రాంతంతో తమను కలపాలని అడగాలనుకుంటే చెయ్యల్సింది ఉద్యమాలు కాదు. పార్లమెంట్లో మెజార్టీ మెంబర్లని ప్రబావితం చెయ్యడం,తద్వారా తాము కోరుకున్నది సాదించడం. అంతే కాని పనికి రాని మాటలతో ప్రజలను మబ్యపెట్టి, వారి మద్య విద్వేషాలు స్రుష్టించి, తమ తమ పార్టిలను బలోపేతం చేసుకోవాలనుకోవడం నీచాతి నీచం.

   కాంగ్రెస్ ,బి.జె.పి పార్టిలు రెండూ తెలంగాణా కు సరె అన్న తర్వాత ఇంక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అడ్డేమిటి? ఒక వేళ సీమాంద్ర వాళ్ళు తెలంగాణా రాష్ట్ర  ఎర్పాటు అడ్దుకోవలనుకుంటే కాంగ్రెస్ ప్రబుత్వాన్ని గద్దె దించండి. ఆ తర్వా త కాంగ్రెస్ కాని, బి.జె.పి. కాని అధికారంలోకి రాకుండా చూడండి. అలా  చెయ్యగల దమ్ము ఉందా? లేనపుడు ఆందోళనలు అనవసరం. రాజ్యంగం ఇవ్వని హక్కును ఉద్యమాల ద్వారా సాదించాలనుకోవడం చాలా నష్ట దాయకం . ఇదే సూత్రం అటు తెలంగాణ వాదులకు వర్తిస్తుంది. ఒకసారి అటు అధికారపక్షం, ఇటు ప్రతి పక్షం తెలంగాణా ఎర్పాటుకు ఒప్పుకున్నాక మీరెందుకు ఆందోళన పడుతున్నారు? సీమాంద్ర వారిని ఉద్యమాలు చెయ్యవదనే హక్కు మీకెక్కడిద? వారిని రెచ్చగొట్టె ప్రకటణలు చెయ్యడం వల్ల సీమాంద్ర సమైక్యత వాదనికే లాభం అని తెలంగాణ వారు గుర్తుంచుకోవాలి. ఓడిపోయినా వారికి ఉక్రోషం ఎక్కువ. దానిని పట్టలేక వారు ఆక్రోశం వెల్ల గ్రక్కుతారు. కాని ఆ సమయం లో విజేతలు సంయంఅనం పాటించకపోతే పలితాలు తారుమారయ్యే అవకాశ ముంది. ఇక్కడ విజేత అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ప్రస్తుతం తెలంగాణా వాదులకి పరిస్తితి అనుకూలంగా ఉందనే ఉద్దేశ్యంతోనే.

  ఇక పోతే ఇందాక  ఒక  బ్లాగులో ఒక మిత్రుడు రాసిన కామెంట్ చూసాను." చెడు తిరుగుళ్ళు తిరిగి ఎయిడ్స్ తెచ్చుకున్న భర్త నుండి విడాకులు కోరుకునే హక్కు బార్య కు ఉంటుంది కాని, సమైక్యంగా ఉందామనే హక్కు ఆ నీతి లేని భరకు ఉంటుందా" అని సదరు మిత్రుడి ప్రశ్న. ఇందులో ఎయిడ్స్ వచ్చిన భర్త సీమాంద్రా అయితే, విడాకులు కోరుకునే భార్య తెలంగాణా అని మిత్రుడి ఉద్దేశ్యంగా కనపడింది. ఇంత అసంబద్దమైన పోలిక మరొకటి ఉండక పోవచ్చు. దీనిని చూశి సీమాంద్ర వారు తెలంగాణా వారికి పోల్చడం కూడా చేతకాదు అనుకునే ప్రమాదముంది. అయినా నాకు తెలియక అడుగుతా, ఎయిడ్స్ వచ్చిన భర్త తో కాపురం చేసిన బార్యకి, ఆ ఎయిడ్స్ రాకుండా ఉంటుందా? అలాంటి భార్య విడాకులు తీసుకుని బావుకునే దేమీటీ? ఎవడన్నా ఎయిడ్స్ లేని వాడు ఆమెను వివాహం చేసుకుంటాడా? ఉన్నంత కాలం ఎయిడ్స్ ఉన్న వాడితోనే కాపురం చెయ్యాలి. కాబట్టి ఇలాంటి పోలికలతో ప్రజల మనోబావాలను కించపర్చడం ఇరువైపుల లాభకరం  కాదు.

   ప్రస్తుత పాలకులు  ప్రజల ఉద్యామాలు చూసి రాష్ట్ర ఏర్పాటు చేస్సారని బావిస్తే అంత కంటె అమాయకత్వం మరొకటి ఉండదు. అలాగే సీమాంద్ర ఉద్యమం చూసి సమైక్యంగా ఉంచుతారనుకోవడమూ పొరపాటే. వారికి ఏది లాబసాటి అయితే అదే  చేస్తారు. అవసరమైతే , బలవంతంగా నైన తాము చెయ్యాలనుకున్నది చేస్తారు. విజ్ణులైన వారు చెయ్యాల్సింది రాజకీయమే కాని అరాచకీయమ్ కాదు.దానికి ప్రజల మనోబావాలు గుర్తించగలిగి,. అందుకు అనుగుణంగా రాజకీయాన్ని మలచగల  నాయకులు కావాలి. అలాంటి వారికి మంచి చాన్స్.         
     

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన