రెండు కళ్ళ బాగు కోసం, ఉన్న గొంతు పోగొట్టుకున్న ఉత్తమయ్య!

                                                               
                                                      


 ఈ రోజెందుకో ఒక కద చెపుదామనిపించింది. నాకు తోచిన కద చెపుతా,బాగున్నా లేకున్నా ఆసాంతం చదువుతారని ఆశిస్తున్నాను.

  అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో  మోతుబరుల కుటుంబాలు ఉన్నాయి. అందులో ఉత్తమయ్య కుటుంబం కూడ ఒకటి.ఆయనకి ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరి కొడుకులుకి చెరో అయిదుగురు సంతానం వలన ,పిల్లా పీచు అంతా కలిసి ముప్పై మందితో ఉమ్మడి కుటుంబం అలరారుతూ ఉండేది. ఆ ఇంటిలో ఉత్తమయ్య మాటే వేదవాక్కు. ఆయన మాటను కాదనే దమ్ము ఎవరికీ లేదు. దానికి కారణం ఆయన వాయిస్ పవరే కాక సమయానుసారంగా ఆయన తీసుకునే నిర్ణయాలు సత్పలితాలు ఇస్తూ కుటుంబ అభివ్రుద్దికి తోడ్పడడమే.

   ఆ ఊరీ కి ప్రెసిడెంట్ గా తొమ్మిదేళ్ళు పని చేసిన అనుభవం ఉంది ఉత్తమయ్యకు.ఆ ఊరిలో ఉన్న అందరితో మంచిగా ఉండే వారు ఉత్తమయ్య కుటుంబ సబ్యులు. ఇలా ఉండగా పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. చిన్న కొడుకు కొడుకు ఒకడు వార్డు మెంబర్కి పోటి చేస్తానంటే ఒప్పుకోలేదు ఉత్తమయ్య. తర్వాత చేద్దువులే అన్నాడు. అంతే , వాడికి కోపం వచ్చింది. ఇంటి నుంచి వేరుగా వెళ్లి  పోయి తన పెళ్ళాం తరపు బందువులు ఎక్కువుగా ఉన్న వార్డులో కాపురం పెట్టాడు. అక్కడ వెనుక బడిన  వారిని కూడగట్టాడు. తాము అభివ్రుద్ది చెందిన  వారితో కలసి ఉన్నంత కాలం అభివ్రుద్ది చెందటం కష్టం అని చెప్పాడు. తక్షణం ఊరిని రెండు చెయ్యల్సిందే అన్నాడు.

      నిజానికి ఆ ఊరు పంచాయితి  మూడు శివారు గ్రామాల తో కూడి ఉంది. ఉత్తమయ్య గారి ఇల్లు వున్న ప్రాంతం కొంచం  ఎక్కువుగా చదువుకున్న  వారు ఉన్న ప్రాంతం కావడం వలన అభివ్రుద్ది చాయలు కనపడుతుంటాయి. మిగతా రెండు శివారు గ్రామాలు వెనుక బడి ఉంటాయి. అది సాకుగా తీసుకుని ఉత్తమయ్య మనవడు చేసిన ఆందోళనతో వెనుకబడిన ప్రాంతం వారిలో మెజార్టీవారు, ఊరును విడదీయాల్శిందే అనేసరికి, తమ బందువుల మాటను కాదనలేక చిన్న కోడుకు కూడా, ఊరి విబజనకు అంగీకరించకపోతే తమ కుటుంభం రాజకీయంగా నష్ట పోవలసి వస్తుందనే సరికి,  పెడ్డకొడుకు, చిన్న కొడుకు తో సమావేశం అయ్యాడు ఉత్తమయ్య.

  ఆ సమావేశంలో వారు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, గత చాలా యేండ్లుగా నలుగుతున్న సమస్య ఊరి విభ జన. అది పదవి  కోసం చిన్నోడి కొడుకు ఆడుతున్న డ్రామా కాబట్టి, ఊరి విబజనకు ఒప్పుకున్నా జరిగే నష్టం ఏమి ఉండదు కాబట్టి, డేర్ గా విభజనకు ఒప్పుకుంటున్నట్లు ప్రకటించాలని తీర్మానించి, అలాగే ప్రకటించాడు ఉత్తమయ్య! ఈ దెబ్బతో మనవడి వర్గం వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. దానితో ఆ మనవడు ఒక బ్రహ్మాండమయిన ఆలోచన  చేశాడు. ఆ ఊళ్ళో ఒక జమిందారిణి ఉంది . మొదట్లో ఆ ఊరిని ఆమె అత్తగారే ప్రెసిడెంట్ గా ఏలింది. కాని ఉత్తమయ్య మామ గారు ఆమే చేసే అరాచకీయాలు సహించలేక, ఊరి ప్రజలలో చైతన్యం తెచ్చి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఆయన తర్వాత అల్లుడు  ఉత్తమయ్య అదేశత్రుత్వం కొన సాగించాడు. అత్తా, భర్త ఇద్దరూ పోవడం వలన కోడలు జమిందారిణీ అయింది. ఇప్పుడు ఉత్తమయ్య ను దెబ్బ కొట్టే మంచి అవకాశం  గురించి ఉత్తమయ్య మనవడే  ప్లాన్ ఇచ్చాడు. అదేమిటంటే తాము కోరుకున్నట్లు ఊరిని విడగొడితే తాను జమిందారీని వర్గం లో చేరతానని, ఆ విదంగా కొత్తూరు ఆమే ఏలుబడిలోకి వస్తుందని చెప్పే సరికి ఆమే సరే అన్నది.

   లాంచన ప్రాయంగా ఊరి విబజనకు అన్ని వర్గాలా నాయకుల అభిప్రాయాలు సేకరించారు. ఇదంతా డ్రామాలే అనుకున్న పెద్దకొడుకు తరపు వారు సరే అన్నారు. ఎలాగు చిన్న కొడుకు వారికి ఇష్టమే కాబట్టి, ఉత్తమయ్య అంగీకార పత్రం ఇచ్చాడు. అంతే జమీదారిణీ ప్రోత్సాహం తో  విభజన ప్రక్రియ మొదలు పెట్టారు. అంతే! అప్పటి దాక డ్రామా అనుకున్న పెడ్డకొడుకు తరపు వారికి పక్కలో బాంబు పేలినట్లయింది. ఉత్తమయ్యకు మొరపెట్టుకున్నారు. అసలే బిక్క చచ్చి ఉన్న ఉత్తమయ్య ఏమనాలో అర్దం కాక "సమయం మించి పోయింది, ఈ పరిస్తితిలో తాను ఏమి చెయ్యలేను" అనే సరికి ఉత్తమయ్య పెడ్డకొడుకు తరపు వారు ఇక చేసేది లేక ఊళ్లో తక్కిన గ్రామస్తులతో కలసి ఉద్యమం చెయ్యడం మొదలు పెట్టారు. ఇటు చూస్తే చిన్న కొడుకు తరపు వారు కూడా జమిందారిణీ వర్గం లో చేరడానికి నిర్ణయించినట్లు తెలుస్తుంది.ఇటు పెద్దకొడుకు తరపు వారు ఊరి సమైక్యతకు కొత్త నాయకత్వం లో చేరాలని అనుకుంటున్నారట . ఇటు విబజనను మనస్పూర్తిగా అంగీకరించలేక ,అటు సమైక్యతను బలపరచి ,ఆడిన మాట తప్పలేక ,  రెంటికి చెడ్డ రేవడి అయ్యాడు ఉత్తమయ్య.

     రెండు కళ్ళు లాంటి తన కోడుకులు బాగుండి, ఎప్పుడూ తనకు చేదోడు వాదోడుగా ఉండాలి అని ఆశించిన ఉత్తమయ్య, డ్రామా రాజకీయాలకు డామా వాగ్దానాలే మందు, అని నమ్మి ఘోరంగా దెబ్బ తిన్నాడు. తన నోరును తానే కట్టెసుకుని ఎవరికీ కాకూండ పోయే పరిస్తితి తెచ్చుకున్నాడు. పాపం ఉత్తమయ్యా!ఆయనని చూస్తుంటే తాతా మనవడు సినిమాలో పాట గుర్తుకు వస్తుంటుంది. "మంచీ చెడు, తెలిసి కూడా చెప్పలేని పెద్దలూ, ఎవరికీ ఏమి కారూ, ఏమీ చెయ్యలేరూ". అక్షర సత్యం.                   
  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం