అటు చైనా కి గాని ,ఇటు పాకిస్తాన్ కి గాని మన దేశం దేని తో సమానమో తెలుసా ?


                                                                     
     

గడ్డి పోచతో ! ఎందుకంటే వారి ద్రుష్టిలో మనది  ఆఫ్ట్రాల్ అసమర్దుల కంట్రీ అని బావం కాబోలు. మన  పొరుగు దేశాలలో ఒకటైన చైనా మన కంటే జనాబా పరంగా యే కాక ఇతరత్రా కూడా  ముందున్న దేశం కావచ్చు . కాని అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంగించి అప్పుడప్పుడు భారత  భూబాగంలోకి చొరబడటం ,అదేమిటని అడిగితే ఆ.... అదంతా ,అలవాటులో పొరపాటు అంటూ వెనక్కి పోవటం లాంటి తమాషాలు చేస్తుంది . ఇంకొక  పొరుగు దేశం పాకిస్తాన్ ,ఒక బుడత దేశం . భారతీయులు అందరూ గట్టిగా ఖాండ్రించి ఉమ్మితే ,  ఉమ్ముకే కొట్టుకు పోయే దేశం . అయినా సరే దానికి మన దేశం అన్నా , మన సైన్యం అన్నా లెక్క లేదు . కార్గిల్ యుద్దం జ్ఞాపకాలు మరవక ముందే మొన్న ఐదుగురు భారతీయ జవాన్లు మీద కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు . అలా కాల్పులు జరిపింది పాకిస్తాన్ ఆర్మీ వారేనని మన సైన్యం రిపోర్ట్ ఇచ్చింది కూడా .

  కానీ ఆశ్చర్యంగా ఘనత వహించిన మన రక్షణ మంత్రి గారు అలా కాల్పులు జరిపింది , పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఉగ్రవాదులు అని ప్రకటించి , పాకిస్తాన్ వారికి డిఫెన్స్  "లా" పాఇంట్ అందించారు . అదేమని ప్రతిపక్షం ఉబయ సభలలో నిగ్గదీసే సరికి , తనకు అందిన సమాచారం మేరకు చెప్పానని , మళ్లీ  రిపోర్ట్ తెప్పించుకుని అసలు విషయం చెపుతానని సెలవిచ్చారు అమాత్యవార్యులు . ఇలాంటి వారి చేతిలో భారత దేశ రక్షణ ఉండటం నిజంగా మన దౌర్బాగ్యం .

  నిజంగా ఒకవేళా ,పాకిస్తాన్ సైనికుల దుస్తులలో ఉగ్రవాదులు ఉంటే దానికి బాద్యత ఎవరిదీ ? ఈ రోజు వారి దుష్క్రుత్యాలు ఉగ్రవాదుల చర్య గా బావిస్తే , నిజంగా అది మన దేశానికి పెద్ద ప్రమాదం అని చెప్పాలి . సైన్యంలోనే ఉగ్రవాదులు చొరబడితే కనిపెట్టలేనీ పాకిస్తాన్ ని నమ్మి మన సరిహద్దు గస్తీ దళాలు ఎలా నిబ్బరంగా ఉండగలవు . ఎదురుగా పాకిస్తాన్ సైన్యం దుస్తుల్లో ఉన్నది ఉగ్రవాదులు కాదని ఎలా నమ్మాలి . ఆ అనుమానంతో భారత సైనికులు ,వరస పెట్టి పాకిస్తాన్ సైనికులను కాల్చేస్తే ,పాకిస్తాన్ ఊరుకుంటుందా ? అసలు మొన్న మనకి జరిగినట్లు వారికి జరిగితే యెంత యాగీ చేసే వారూ . కాబట్టి మన రక్షణ మంత్రి  మన కు డిపెన్స్  చేయాలి కాని ,పాకిస్తాన్కి కాదు అనేది ఆయనకు తెలియక పోవడం మన దౌర్బాగ్యం .

   ఇప్పుడే  తెలిసిన సమాచారం ప్రకారం మన మంత్రి గారు కొత్త స్టేట్మెంట్ ఇచ్చారట . బారత జవానుల మీద కాల్పులుకి తెగబడింది , పాకిస్తాన్ సైన్యం లోని స్పెషల్ ట్రూప్ వారట ! చూసారా , ఇలాంటి విషయాలలోనే బాధ్యతా రహితంగా ,చట్ట సభలలో  పొరుగు దేశానికి అనుకూలంగా ఉండే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చే వారు రక్షణ శాఖ  మంత్రులుగా ఉండదగిన వారా ? ఆలోచించండి .

 ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏంటోలా మాట్లాడే సదరు ఆంటోనీ గారే ఈ రాష్ట్ర  విబజన ప్రక్రియ కమిటికి అద్యక్షుడు . అలాగే కాంగ్రెస్ మానిఫెస్టో  అమలు కమిటికి కూడా  అద్యక్షుడు అంటా!పూర్తీ సమాచారం తెలియకుండా , కనీసం ఏ విషయంలో ఎలా మాట్లాడాలో తెలియని ఐ మహానుబావుణ్ణి  సున్నిత సమస్య అయిన రాష్ట్ర విభజన కమిటీకి అద్యక్షుడిగా రావడం, తెలుగు ప్రజలు ఆలోచించ దగ్గ విషయమే మరి

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )