చేసే ఉద్యోగం తిరుమల కొండ మీద, మత ప్రచారమేమో "కల్వరి కొండలు" గురించా?
మన దౌర్భాగ్యం వల్ల, దివంగత ముఖ్యమంత్రి గారు తను నమ్మిన మతానికి రాష్ట్రంలో పెద్ద పీఠ వేయాలనే సంకల్పంతో, హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే తిరుమల-తిరుపతి కొండల స్వామి క్షేత్రాన్ని కొంత మంది అన్యమతస్తులకు అలవాలంగా చేస్సాడు. అందులో భాగంగా ఒక ప్లాన్ ప్రకారం వివిద ప్రాంతాలనుండి కొంత మంది అన్య మత భోదకులను కొండ మీద ఉన్న ప్రైవేట్ హోటల్లు లాంటి ఇతర సంతలలో వర్కర్స్ గా చేర్పించి, వారి ద్వారా చాప క్రింద నీరులా మత ప్రచారం చేయించారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే, తిరుమల కొండలు అంటే ఏదు కొండలు కాదని, ఒక కొండ మాత్రమే అని మిగతా వాటి మీద అందరికి హక్కు అంటే ముఖ్యంగా ఆ వంకతో తమ మత సంస్తలు నెలకొల్పుకునే హక్కు ఉందని ప్రాచారం చేయడం వరకూ వెళ్ళింది. కాని తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలచినట్లు, వారు గోర దుర్ఘటనలో మ్రుతిచెందడంతో అన్యమత విశ్వాసులకు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. కాని కాసులకు కక్కుర్తి పడే మన అధికారులు గురించి తెలుసు కాబట్టి, తమ పద్దత్తులను వారు ఇంకా గుట్టు చప్