Posts

Showing posts from April, 2021

బుద్ధుడు చెప్పిన మోక్షం మానవునికి ఈ విధంగా కలుగనుందా!!??

Image
                                 49 రోజులు భోది వృక్షం క్రింద ధ్యానం చేసి గౌతమ బుద్ధులు వారు తెలిసికున్నదేమిటంటే మానవుడి దుఃఖానికి కోర్కెలు కారణం,అవి అనంతం కాబట్టి,వాటిని విడిచి పెట్టనిదే దుఃఖం నుండి మనిషి విముక్తుడు కాడు అని.సరే కోర్కెలను మన నుండి వెల్లగొట్టడం కష్టం కాబట్టి ఎలాగో కష్టపడి బౌద్ధ ధర్మాన్ని ఇండియా అంచుల వరకూ తరిమి బుద్ధుని పేరు మీద కార్యక్రమాలు జరుపుకునే అంత మేరకు కోర్కె ను నియంత్రించుకున్నాం.దేశం లో అక్కడక్కడ బుద్ధ మతం పేరుతో ఎదో చేయాలని ఆరాట పడుతున్న వారు,బుద్ధుని బోధనలు మీద మమకారం తో కాక,హిందూ ధర్మం మీద ప్రతికారంతో ఎగురుతుండడం వల్ల వారిలో కూడా కోర్కెలు ఏ మాత్రం తక్కువ కాలేదు. బుద్ధుని బోధన లో ఒకటైన బ్రహ్మచర్యం వల్ల మనిషి సంతతి తగ్గి చివరకు మానవ జాతికి భూమి నుండి మోక్షం లభిస్తుంది. ఈ రకమైన మోక్షాన్ని మనిషి సాధించటం కష్టం కాబట్టి ,మానవ ఆవిష్కృత సైన్స్ ఆ పని చేయటం మొదలు పెట్టినట్లుంది. ఆధునిక మానవుడు ఉపయోగిస్తున్న సాంకేతిక పనిముట్లు,కారకాలు వలన పర్యావరణం కలుషితమై దాని ఫలితంగా పురుషుల్లో సంతాన ఉత్పత్తి శక్తి తగ్గిపోతుంది అంట. ప్రస్తుతం 40%మందిలో ఉన్న ఈ సమస్య ,2045 నాటికి 9