మని"'she" లో "అందం" అనేది ఎక్కడుంటుంది?
ఈ ప్రశ్న నాలో ఉదయించడానికి కారణం ఈ రోజు విశాఖ లో "ఫ్యాషన్ వీక్" పేరుతో ప్రారంభం కానున్న అతివల "అందాల ప్రదర్శన" జరుగుతుండడం, దానిని మన మహిళా సంఘాల వారు ముక్త కంటం తో నిరసిస్తుంటే, వారిని కర్తవ్య పరాయణులైన మహీళా పోలిసులు ఈడ్చివెయ్యడం, అరెస్టులు చెయ్యడం , ఇదంతా చూసిన నాకు పై సందేహం కలగడం చక చకా జరిగిపోయాయి. అసలు అందాల పోటిలు ఎందుకు ఆడవారికే నిర్వహిస్తారు? మగవారికి అందం ఉండదా? ఇది కూడ నాకు కలిగే డౌటుల్లో ఒకటి! బహూశా మగవారిలా చొంగ కార్చుకుంటూ చూసే బుద్ది ఆడవాళ్లకి లేకపోవడం వల్లా "అందాల పురుషుల" పోటిలు కి ఎక్కువుగా ఆదరణ ఉండదేమో? కాకపోతే "కండల వీరుల్ని" చూపించే "మిస్టర్" పోటిలు ఉంటాయి.ఎడ్ల పందాలు, బుల్ ఫైట్ లాగా ఇటువంటివి కొంత మందికి వినోదం కలిగించ వచ్చు! ఇక పోతే అసలు విషయం "మనిషిలొ అందం " ఎక్కడుంటుంది. నా ఉద్దేశ్యం లో ప్రతి వ్యక్తిలో ఏదొ రకమైనా అందం ఉంటుంది. అందం ఒక్క ప్రదాన లక్