ఎప్పటి "మనువు "నో టార్గెట్ చేస్తున్న మోడ్రన్ స్త్రీ వాదం , ఇప్పటి మన్మదులకు ఎలా ఉపయోగ పడుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి !
భారత దేశం లో స్త్రీ స్వెచ్చను అరికట్టిన పరమ దుర్మార్గుడిగా మను స్మ్రుతి కర్త అయిన "మనువు " ను మోడ్రన్ స్త్రీ వాదం ఆడి పోసుకుంటుంది .బహూశా అప్పటి పరిస్తితులు అనుసారం , స్త్రీకి స్వెచ్చ కన్నా రక్షణే ప్రదానం అని బావించిన మనువు , స్త్రీకి బాల్యంలో తండ్రిగా , యవ్వనం లో భర్త గా , వృద్దాప్యం లో కొడుకుగా జీవన పర్యంతం పురుషుడు స్త్రీకి రక్షణ ఇవ్వాలని చెపుతూ ,తనకు రక్షణ ఇచ్చె పురుషుడుకు వ్యతిరేకంగా స్త్రీకి స్వ్వాతంత్ర్యం ఉండరాదు అని చెపుతాడు .అదే 'న స్త్రీ స్వాత్రంత్ర మర్హతి ' అనే బహుళ ప్రచారం పొందిన వివాదాస్పద మను నినాదం . పైన మనువు చెప్పిన సహజ మరియు సాంప్రదాయ రక్...