Posts

Showing posts from February, 2016

పూజారి మీద కోపం దేవుడి మీద చూపిస్తే ఎలా?

Image
                  నిన్న ఒకాయన టి.వి లో మాట్లాడు తూ , దసరాకు రావణ దహనం సరికాదని, అసలు రావణుడు ద్రావిడ జాతీయుడు కాబట్టి, మనం రామున్ని దేవునిగ కొలవటం మానేసి, రావణునే కొలవాలని, అసలు రాముడు దేవునిగా కొలవబడడా నికి అనర్హుడని ఏవేవో చెప్పాడు. అదంతా వింటుంటే నాకు తమిళుల నాస్తిక ద్రుక్పదం మనకూ వ్యాపింపచెయ్యడానికి ఆయనగారు కంకణం కట్టుకున్నట్టు అనిపించింది. దానికి తోడు ఆయాన నిమ్న వర్గాలవారైన యస్.టి,యస్.సి, బి.సి,మైనార్టీ వాళంతా మన సాంప్రాదాయక దేవుళ్లను వదీలేసి, రాక్షసులైన,తాటకి, శూర్పణక, మారీచ , సుబాహులను, మహిషాసుర లను  కొలవాలని ఎందుకంటే వాళ్లంతా మన ద్రావిడులని గట్టిగా నొక్కి వక్కాణించారు.ఆయన వాదన వింటుటే నాకోక అనుమానం  వచ్చింది. ఇన్నాళ్లు మనం పూజించేది మన దేవుళ్లని కాదా ?ఇతర జాతుల వారినా?ఒకసారి విశ్లేషిద్దాం అనుకుని మన దేవుళ్ల చరిత్రను తిరగేసాను.                                            మనకు ముఖ్యమైన దేవుళ్లు దశావతారములే కదా!వారిలో మొదటి నల్గురు అంటె మత్స్య,కూర్మ,వరాహా,నరసింహా,మానవులుగా జన్మించలెదు కాబట్టి వారికి కులాలు, జాతులు అంటగట్టలేము.ఆ తర్వాతి వారిలో వామనుడు పరశురాముడు బ్రాహ్మణులు

"విగ్రహారాదన"లో కొంత సైన్స్ ఉంది ! దానిని వ్యతిరేకించే వారిలో ఏముంది....?

Image
                                                                          No other than thou, PRAJAPATI, hast given existence to all these beings ; may that object of our desires for which we sacrifice to thee be ours, may we be the possessors of riches.(Rig Veda 10.121) మొన్న నేను ఒక మిత్రుని బ్లాగులో ప్రచురించిన విగ్రహారాధన కంటె విగ్రహాలు లేని ఎకేశ్వరోపాసనే ప్రాచీనమైనది అని , పూర్వకాలం లో విగ్రహాలు లేకుండానే ప్రజలు దేవతలను ఆరాదించే వారని , విగ్రహాలు ఉన్నా వాటిని పూజించే వారని కాదని , మహా అయితే ఏ 400 సంవత్సారాల క్రితమో విగ్రహారాధన మొదలు అయిందని , ఆకుకు అందని పోకకు పొందని ,అయన గారి  స్వపరిశోధనా పలితాంశాలను చూసి కొంత ఆశ్చర్యం వేసింది. విగ్రహారాధన మొదలు అయి 400 యేండ్లా అని నివ్వెరపోవలసి వచ్చింది. నాకు ఉన్న జ్ఞానం మేరకు మన నాగరికత అని చెప్పుకుంటున్న వేళ యేండ్ల నాటి హరప్పా మొహంజొదారో నాగరికతలోనే విగ్రహారాధన ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.అందులో ముక్యమైనది పశుపతి నాధుని మూర్తి .                                                               చరిత్రకారుల ప్రకా

'మనుస్మృతి ఇరాని ' అంటూ తనను హేళన చేస్తున్న వారి నోళ్ళు మూయించిన "స్మ్రుతి ఇరాని " గారు!!!

Image
                                                                                                 కాళికా దేవి ని పచ్చి వ్యభిచారిణిగా , మహిషాసురుడిని గొప్ప వీరుడిగా   చిత్రీకరించడమే కాక "మహిషాసుర అమరదినం" గా విజయదశమిని జరుపుకోవాలన్న రాక్షస సిద్ద్దాంత కర్తల ముఖం మీద చెప్పు తీసుకు కొట్టినట్లు, "మనువులూ నోరు ముయ్యండి " అనే  తెగిడిచిన రాతలతో తమ "హాస్య పత్రికలలో " ఆర్టికిల్ రాస్తూ , తనను 'మను స్మ్రుతి ఇరాని ' అని అవహేళన చేయడమే కాక ,దేశ ద్రోహ కార్యకలాపాలు చేసే వారిని హీరో లు అని కీర్తించిన , కుహానా ఎర్ర మేదావులను నోరెత్తకుండా చేసినట్లు ఉంది , నిన్న పార్లమెంట్ లో మహిళా మంత్రి "స్మ్రుతి ఇరాని " గారు జవాబు తీరు. నిజంగా కలకత్తా కాళికయే ఆమెను పూనిందా అన్నంత ఆవేశంగా , ఎంతో  ఉత్తేజిత పూరితంగా ఉంది ఆమె సమాదాన ప్రసంగం. ఆమె మాట్లాడిన గంట సేపు ప్రసంగం క్రింది విడియోలో  ఉంది దానిని క్లిక్ చేసి చూడ వచ్చు.    సదరు ప్రసంగం లోని కొన్ని హైలైట్స్ ను క్రింద ఇవ్వడమైనది.         (1). దేశం లో ఉన్న కేంద్రియ విశ్వవిద్యాలయాలలో ఉన్న పాలకామండళ్ళు అన్నీ గత U.P.A ప్ర

కాలిపోయిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఖరీదు 100 కోట్లు "కాపు సంఘం " వారు కట్టాల్సిందేనా ?!!!

Image
                                                                                                                 కాలిపోయిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ఖరీదును (నిర్మాణ వ్యయం)"కాపు సంఘం " వారు కట్టాల్సిందేనా ?! .          కట్టక తప్పేటట్లు లేదు ఈ రోజు మనదేశ అత్యున్నత న్యాయ స్తానం వారు ఇచ్చిన తీర్పును చూస్తుంటె. కాకపోతే తీర్పును ఇచ్చింది మాత్రం కాపు సంఘం వారు కాలబెట్టిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ విషయం లో కాదు. గుజరాత్ గండర గండడు , పటేళ్ళు  అందరూ  కలసి స్పాన్సర్ చేసిన 21 యేండ్ల నూనుగు మీసాల హార్దిక పటేల్ నేతృత్వం లో జరిగిన విద్వంసం  కేసు విషయం లో. అయితే తీర్పును ఇచ్చింది సుప్రీం కోర్టు వారు కాబట్టి , ఎవరైనా పబ్లిక్ ప్రాపర్టీ ద్వంసం చేసారని కాపు సంఘం వారిని పార్టిగా చేస్తూ , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల  మీద ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తే మాత్రం సదరు కేసు తీర్పు వీరికీ వర్తించడం ఖాయం కాబట్టి రత్నాచల్ నష్టం కి బాద్యత వహించక తప్పదు.                                                                                              ఈ  దేశం లో ఉద్యమాలు చేసే వారికి ముందుగా కనిపించేవి ప్

విదేశి ఖాతా లు గురించి విల విల లాడుతున్న కామ్రేడ్ భాయి జాన్ లు "మోడి కో మారో , మోడికో మారో " అంటున్నారు అంట !?

Image
                                                                                                      నిన్న ఒరిస్సా రాష్ట్రం లో జరిగిన ఒక గొప్ప రైతు ప్రదర్శన ఉద్దేశించి , మన ప్రధాని గారు అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన ప్రసంగం లోని కొన్ని  అంశాలు గురించి మేదావులు , విజ్ఞులు అయిన ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనిపిస్తుంది. గత పాలకుల ఉద్దేస్య పూర్వక నిర్లక్ష్య దోరణితో ఈ  దేశం లోని మేదావులు అనబడే కొందరు ఈ దేశ సమగ్రతకు భంగం కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానికి పరాకాష్ట యే  దిల్లీ లోని J N U లో ఉరి తీయబడిన  ఉగ్రవాది అప్జల్ గురుకు అనుకూలంగా , భారత దేశానికి వ్యతిరేకంగా కొంత మంది విద్యార్దులు చేసిన ప్రదర్శన , ఇచ్చిన నినాదాలు . వారి చర్యలు లోని తీవ్రతను గమనించి వారి మీద కేసులకు ప్రభుత్వం ఉపక్రమిస్తే దానికి వ్యతిరేకంగా కొంత మంది ఎర్ర మేదావులు వత్తాసులు. వీట్టన్నింటిని లోతుగా పరిసిలిస్తే తప్పా వారి చర్యలు మాటలు వెనుక ఉన్న కుట్ర అర్దం కాదు. దానిని గ్రహించబట్టే ప్రధాని గారు ప్రత్యేకంగా వ్యక్తులను పేరు పెట్టి అనకపోయినా , వారెవరో ప్రజలకు తెలిసేటట్లే తన ప్రసంగం లో తెలి

'స్త్రీ స్వేచ్చ' తో మొదలై 41 నెలల కాలం లో 5 లక్షలు వీక్షణములు సాధించిన "మనవు " బ్లాగు !!

Image
                                                                      సెప్టెంబర్ 6, 2012 న  "మనవు " బ్లాగు ప్రారంభించబడినది . అంటే సరిగ్గా  41  నెలలు దాటింది . ఈ 41  నెలల కాలంలో సుమారు 900 పై ఛిలుకు టపాలు ప్రచురించడం జరిగింది.మొదటి టపా పేరు  'స్త్రీ స్వేచ్చ'.900 టపాలలో లలో  కొన్ని బంపర్ హిట్ ఐతే , కొన్ని ఫట్ అయినవి. విచిత్రం ఏమిటంటె నేను హిట్ అవుతాయి అనుకున్నవి వీక్షకుల ను ఆకట్టుకోకపోవటం  అలాగే వీటినేమి చదువుతారులే అనుకున్నవి, బాగా ఆదరణ పొందటం. ఎలాగైతేనేమి 41 నెలల కాలంలో  మనవు బ్లాగు 5 లక్షల వీక్షణములు సాదించడం ఘన కార్యం కాక పోయినా , సంతోషం కలిగించే విషయమే . ఈ చిరు  సంతోషం ని  మీతో పంచుకుందామనే ఈ ప్రత్యేక ప్రస్తావన .    మనవు వీక్షణముల చరిత్ర   "మనవు" ప్రారంభించిన  తేదీ :-        6-9-2012 1,00,000 వీక్షణములు పొందినది :-   9-9-2013  2,00,000 వీక్షణములు పొందినది :-   18-2-2014  4,00,000 వీక్షణములు పొందినది :-    9-8-2015               5,00,000 వీక్షణములు పొందినది :-   18-2-2016            మొదటి లక్ష వీక్షణము లు సాదించడానికి ఒక

భారత దేశం లో, రిజర్వేషన్ లకి పేదరికానికి లింక్ పెట్టడం ఎంతవరకు కరెక్టు ?

Image
                                                                                                                ఈ  మద్య,  ప్రస్తుత రిజర్వేషన్ విదానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం  ప్రారంబించాయి  సమాజం లోని కొన్ని సామాజిక వర్గాలు. ఇందులో కొన్ని సామాజిక వర్గాలు తమను వెనుకబడిన వర్గాలుగా గుర్తించి , తమకూ రిజర్వేషన్ లు వర్తింప చేయాలని కోరుతుంటే , మరి కొందరు అసలు రిజర్వేషన్ లు కుల ప్రాతిపదిక మీద కాకుండా , పేదరికం ప్రాతి పదిక మీద కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏండ్ల తర్వాత తమను వెనుకబడిన వర్గాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న వారు కుల ప్రాతిపదిక  రిజర్వేషన్ లకి వ్యతిరేకం కాదు కాబట్టి  వారు వారి డిమాండ్ లు గురించి ఇక్కడ  ప్రస్తావించటం లేదు. కేవలం రిజర్వేషన్ లు ఉందాలి కాని అవి కుల ప్రాతిపదిక మీద కాకుండా పేదరికం ప్రాతిపదిక మీద ఇవ్వాలి అనే దానినే ప్రస్నించడం జరుగుతుంది.     ప్రపంచం లో ఎక్కడా లేని "కులం" అనే   సామాజిక వర్గ వ్యవస్థ  మన దేశం లో ఉంది. ఏదైన దేశం లో  ఒక వ్యక్తి యొక్క సామాజిక స్తాయిని అంచనా వేయాలి అంటె అతనికి ఉన్న ఆర్దిక స్తాయిని , మ

వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?

Image
     మీరు ఎన్నైనా చెప్పండి. నన్ను మూడ చాందసవాది అనుకోండి. నాదొకటే సిద్దాంతం " దేనినైనా గుడ్డిగా నమ్మడం యెంత తప్పో, గుడ్డిగా వ్యతిరేకించడం అంతే తప్పు". అరె! వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం బూటకమా? సైంటిస్ట్ మోసకారి అయితే సైన్స్ బూటకమా ? చెప్పంది. కాదు గదా మరి ఇదే రూలు మన ప్రాచీన శాస్త్రం "జ్యోతీష్యం" కు ఎందుకు వర్తించదు?    ఏమి లేదండి నిన్న కొంచమ్ ఒక లుక్కేదమని అలా బ్లాగుల దర్శనానికి బయలుదేరా. ఒక సహ బ్లాగిని రాసిన నాడీ జ్యోతీశ్యం గురించి అమే స్వీయ అనుభవం చదివా. అమేగారు హేతుద్రుక్పదం కలిగిఉండి, అప్పట్టి దాక నమ్మని జ్యోతీషాన్ని ఒకే ఒక సంఘటనతో నమ్మాల్సి వచ్చిందని రాసారు. అంతే కొంతమంది బ్లాగు మిత్రులు అలా మేదావులు అనబడేవారు, దీని పీరు చెప్పి ప్రజల్ని మూడత్వం లోకి నెట్టడమె కాక, వారిని దోపిడి చేస్తున్నారని కామెంట్లు చేసారు. అందుకే నా ఈ ప్రశ్న.                                                                         అయితే నన్ను మీరు అడగవచ్చు , వైద్యం అనేది నిరూపించబడి శాస్త్రం అయింది, అలా జ్యొతీష్యం నిరూపించబడిందా అని. నిజమే కాని మానవ జాతిని కొన్ని వేల సార్ల

పవన్ కళ్యాణ్ గారు అన్నది, పక్కాగా నిజం అనిపిస్తుంది !!

Image
                                                                                                                                                                      పవన్ కళ్యాణ్ ! సిని హీరో ! జనసేన అధినేత! లక్షలాది అభిమానుల అరాద్యుడు కాబట్టి నేటి ప్రజాస్వామ్య వ్యవస్తకు పనికివచ్చేవాడె . కాకపోతే NTR లా దీటైన వాయిస్ లేకపోవడం తో పాటు , పదిమందిని చూసి సిగ్గుపడే మనస్తత్వం చిన్నప్పటనుండి కలిగిఉండడం చేతో , ఏమో కాని , మీడియా తో మాట్లాడేటప్పుడు సగం మాటలు మింగేస్తూ తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. మాటలు మింగినా , తన మనసులో ఉన్నది మాత్రం దైర్యంగా, మొహమాటం లేకుండా  చెప్పేస్తూ ఉంటాడు కాబట్టి  , అయన గారి ప్రెస్ మీట్ కు కూడా అంతో ఇంతో ప్రాదాన్యత ఇవ్వక తప్పదు.      మొన్న కాపు నాడు వారు నిర్వహించిన సభలో , టపాసులు లాంటి మాటలు తూటాలు పేల్చి , కుల ప్రజలను రెచ్చగొట్టగలిగే  ప్రసంగాలు చేయగలిగిన   కాపు సామాజిక నాయకులు  ఎవ్వరూ లేరు. కాని ఆశ్చర్య కరంగా ఒక్క సారిగా కాపులు అంతా రైల్ పట్టాల మీదకు వెళ్లి , అప్పుడె వస్తున్న "రత్నాచల్ ఎక్సప్రేస్ " ని ఆపుచేయడమే కాక సదరు రైలు మొత్తాన్ని తగుల పెట్టారు

మనం చూడాల్సింది " వుమెన్. ఇన్ బ్రాహ్మనిజం" కాదు".వుమెన్. ఇన్ కాపిటలిజం".

Image
                                                                                                          భారత దెశంలొ హిందూ జీవన విదానాన్ని ఏదొ రకంగా దెబ్బతీసి, తమ మతాలను, బావాలను వ్యాప్తి చెయ్యాలన్న దుర్బుద్దితో కొంతమంది విదేసి బావాజాల బానిసలు, ప్రయత్నిస్తున్నారు. వీరు ముక్యంగా బ్రహ్మాణ బావజాలాన్ని బూచిగ చూపి,మొత్తం హిందూ బావాజాలాన్ని పనికి రానిదిగ ప్రంపంచ ద్రుష్టిలో చిత్రీకరీస్తున్నారు. అటువంటిదే ఈ మద్య వచ్చిన "వుమెన్. ఇన్ బ్రాహ్మనిజం"    సినిమా.దీనికి మేము చెప్పేది ఒకటే.ఎప్పుడో చెప్పబడి ప్రస్తుతం మార్పు చెందుతున్న బ్రాహ్మణ స్త్రీని గురించి కాదు  మీరు చూపించాల్సింది., మీరు వేనొళ్ల కీర్తిస్తున్న నెటి కాపిటలిజంలో  ఆదునిక స్త్రీ  దుస్తితి ఎలా ఉందో చూపించండీ. లేదంటే   క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యండి.  మీకే తెలుస్తుంది డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి సంబందం ఏమిటి" ? http://ssmanavu.blogspot.in/2012/09/blog-post_2064.html                                                        A WOMAN  IN CAPITALISM