భారత దేశం లో, రిజర్వేషన్ లకి పేదరికానికి లింక్ పెట్టడం ఎంతవరకు కరెక్టు ?
ప్రపంచం లో ఎక్కడా లేని "కులం" అనే సామాజిక వర్గ వ్యవస్థ మన దేశం లో ఉంది. ఏదైన దేశం లో ఒక వ్యక్తి యొక్క సామాజిక స్తాయిని అంచనా వేయాలి అంటె అతనికి ఉన్న ఆర్దిక స్తాయిని , మానసిక స్తాయిని బట్టి అంచనా వేస్తారేమో కాని ఇక్కడ మాత్రం ముందు కులాన్ని బట్టి తర్వాతే తతిమావన్ని. కాబట్టి కేవలం ఆర్దికంగా స్తితిమంతుడు అయినంత మాత్రానా నిమ్న వర్గాల వారి సామాజిక హోదా ఆటో మేటిగ్గా అగ్రవర్నాలతో సమానంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు.సమాజం లో అన్ని వర్గాల ప్రజా మద్య సమానత్వం రావాలంటే కేవలం నిమ్న వర్గాలు వారు తమ విద్యా స్తాయి, ఆర్దిక స్తాయి పెంచుకుంటే సరిపోదు , అగ్రవర్ణాలలో కూడా " మనుషులు అంతా ఒకటే " అనే సమ బావం పెంపొందించుకోవాలి. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న కుల ఆదిపత్య లేక కుల హీన బావనలు కేవలం మాటలు చెప్పినంత ఈజీగా సమాజం నుండి తొలగిపోతాయనుకోవడమ్ బ్రమ. అందుకే దానికొక దీర్గ కాలిక ప్రణాలిక , క్రుషి అవసరం. అందులో బాగంగా ఏర్పరచినవే తరగతి లేదా కుల ఆధారిత రిజర్వేషన్ లు.
ఆర్దికంగా వెనుకబాటు తనం అనేది బౌతిక పరమైనది కాబట్టి దేశం ఆర్దికంగా అభివృద్ధి చెందితే ఆ వెనుకబాటు తనం దానంతట అదే మాయమవుతుంది . కాని సామాజిక వెనుకబాటు తనం అయిన కుల వెనుకబాటు తనం మానసిక పరమైనది. ఆర్దిక వెనుకబాటు తన్నాన్ని రూపు మాపినంత తేలిక గా దీన్ని రూపు మాపలేమ్. శతాబ్దాల కాలంగా మనసుల్లో తిష్ట వేసుకున్న కుల భూతాన్ని రూపుమాపాలంటే కనీసం కొని దశాబ్దాల కాలం అయినా పడుతుంది. ఈ విషయం లో మీ కోక ఉదాహరణ చెపుతాను. ఒక బీదవాడైన వ్యక్తికీ ఎవరైనా సరే ఒక కోటి రూపాయల చెక్కును దానం చేస్తే మరు నిముషం లో అతను కోటిశ్వరుడు అవుతాడు. కాని అదే శతాబ్దాల సామాజిక వెనుకబాటు తనం లేక అణచి వేత వలన మేదో పరిణతిని పెంపొందించుకోలెని వ్యక్తికీ , అతని మేదో లేక విద్యా స్తాయిని పెంచాలంటే ఎంత సమయం పడుతుంది? అది అతని కుటుంబ నేపద్యాన్ని బట్టి ఒక తరం లేక కొన్ని తరాల కాలం కూడా పట్టవచ్చు. మరి అలాంటి వ్యక్తికీ రిజర్వేషన్ లు అనే ఆసరా యే ఇవ్వకపోతే అగ్రవర్ణాలు వారితో కలసి ఎలా సమానం గా నడువగలుగుతాడు. అలా నదవలేనప్పుడు సమాజం లోని ప్రజల మద్య సమానత్వం సాదించడం ఎలా సాద్యం?
ఇకపోతే కొంత మంది, రిజర్వేషన్ లు ఉండటం వలననే "ప్రతిభ " అనేది మ్రుగ్యమవుతుందని తెగ వాపోతున్న వారి వాదన గురించి పరిసిలిద్దాం . డబ్బులకు ఆశపడి పరీక్ష పేపర్లు లీక్ చేసే విద్యాదాతలు , విద్యావేత్తలు ఉన్న దేశం లో , చచ్చిన శవాలకు ఆపరేషన్ లు చేసే డాక్టర్లు ఉన్నంటువంటి మన సమాజం లో ఉన్న మనకు ప్రతిభ గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? "నా కుల పరంగా నన్ను పరిగణిస్తూ నన్ను హీనంగా చూసే నీవు ఎంత ప్రతిభావంతుడైతే నాకేమిటి ?" అని నిమ్న వర్గాల ప్రజలు నిలదీస్తున్నారు. అవినీతి సమాజంలో ఏ ప్రజా పదకమైనా అంతిమంగా అవినీతి మయం అవుతుంది . అలాగే మనిషిని మనిషిగా చూడలేని కుల వివక్షత ఉన్న సమాజం లో ఎటువంటి ప్రతిభ అయినా అది అంతిమంగా ప్రజా వివక్షత నే పెంపొందిస్తుంది . ప్రతిభ అంటే కేవలం పరీక్షల్లో సంపాదించే మార్కులు పరంగా కాక , వ్యక్తీ యొక్క సమస్త పాజిటివ్ లక్షణాల పరంగా నిర్దారిస్తే , ఈ దేశం లో కేవలం కొద్ది శాతం మందే ప్రతిభావంతులు ఉన్నారు అని చెప్పక తప్పదు. అటువంటి ప్రతిభావంతులు ఎవ్వరూ నిమ్న వర్గాలకు ఇచే రిజర్వేషన్ లు గురించి గోల చేయరు. ఈ దేశం అదొక సామాజిక అవసరం అనుకుంటారు.
భారత రాజ్యాంగం ప్రకారం విద్యాపరంగా , సామాజికంగా వెనుకబడిన తరగతుల విషయం లో వారిని సామాజికంగా , విద్యా పరంగా, ఉద్యోగాల పరంగా తతీమ్మా వర్గాలతో కలిసిపోఎందుకు కొంత వెసులు బాటు ఇచ్చే చట్టాలను ప్రబుత్వాలు చేయవచ్చు. అందులో బాగంగానే ప్రభుత్వాలు రిజర్వేషన్ చట్టాలు చేసాయి తప్పా , రాజ్యాంగానికి వ్యతిరేకంగా కాదు. ఈ దేశం లో సోషలిజం సాదించడం అంటె "కుల సోషలిజం " సాదించడమే . ముందు కులాల మద్య సమానత్వం సాదిస్తే అటోమేటిగా "కులం " అనేది మాయమవుతుంది. అప్పుడు బౌతిక పరమైన ఆర్దిక సోషలిజం ని ఇతర ప్రపంచం తో పాటు మనమూ సాదించవచ్చు. కాబట్టి కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు అనేవి "కుల సోషలిజం " సాదించే వరకు ఉంటాయి, ఉండాలి కూడా ..
మనకు కావాల్సింది మొదటగా "కుల సోషలిజం " , ఆ తర్వాతే అన్నీను .
Superb Anna. Good Information.
ReplyDeleteThanks for your response brother
DeleteGood one
ReplyDeleteThank you kalidasu garu
ReplyDeletei am sharing this on my facebook wall. please permitt
ReplyDeleteNo objection, with a condition at the end of article this blog post link should be given as a source
Delete