70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

                                                                       
    

మొన్నీ మద్య అంటె సరిగ్గా వారం రోజుల క్రితం మన దేశం లోని వార్తా పత్రికలూ మీడియా ఒక రేప్ కేసు కేసు లో ఇచ్చిన తీర్పు మీద సంచలన కదనాలు ప్రచారం చేసాయి. అదేమీటంటే అక్టొబర్ ౩౦ న డిల్లీ హైకోర్టు వారు అచేలాల్ అనే నలబై యేంద్ల వ్యక్తి కేసులో తీర్పు ఇస్తూ " రేప్ కు గురి కాబడ్డ మహిళ 7౦ యేంద్ల స్త్రీ కాబట్టి, ఆమే మొనో పాజ్ దశకు చేరుకుని ఉండటం వలన, నిందితుడు ఆమెను రేప్ చేసినా అది రేప్ క్రిందకు రాదు" అని . ఇది విన్న నాకు నిజంగా  మైండ్ బ్లాంక్ అయింది . నాకు తెలిసి ఏ న్యాయ మూర్తి అంత అసంబద్ద తీర్పును ఇవ్వజాలరు. ఎందుకంటె ఇండియన్ పీనల్ కోడ్ లో ఎక్కడా మోనోపాజ్(రుతు క్రమం ఆగిపొయిన దశ), నాన్  మొనోపాజ్ అనెదే లేదు. కేవలం స్త్రీ అయితే చాలు.అమె మీద అత్యాచారమ్ అంటె ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అమెతో సెక్స్ వల్ ఇంటర్ కోర్స్ జర్పితే అది రేప్ క్రింద పరిగణించబడుతుంది. అదే అమ్మాయికి 16 యేంద్లు దాటక పోతే, ఆ అమ్మాయితో  ఆమె ఇష్టం తోనే  సెక్స్ కాయక్రమంలో పాల్గొన్న అది రేప్ క్రింద పరిగణించ బడుతుంది . అంటె 16 యేండ్లు లోపు ఉన్న మైనర్ బాలిక తెలిపే అంగీకారానికి ఎటువంటి చట్టబద్దత లేదు. అదే సెక్స్ ని జంతువులతో కాని , ఏ వ్యక్తులతో అయినా అసహజ రీతిలో జర్పితే దానికి జీవిత ఖైదు విదించే అవకాశం ఉంది .  

  మరి చట్టం ఇంత పకడ్బందిగా ఉంటె, సక్షాత్తు డిల్లీ హైకోర్టు వారు "మ్రుతురాలి మోనోపాజ్" ను వంక గా తీసుకుని నిందితుడిని ఎలా అదిలి వేయగలిగింది? అని ఆశ్చర్య పోయాను. ఈ రోజు ఆ కెసు తాలుకు పూర్తి తీర్పు ప్రతిని చదివాక కాని జడ్జ్ గారి అంతరంగం ఏమిటొ తెలియ లేదు . జడ్జ్ గారి తీర్పును విస్లేషించే ముందు అసలు ఈ కేసులోని వివరాలు ఏమిటొ టూకీగా తెలుసుకుందాం. 

  ౪౫ యేంద్ల అచే లాల్ అనే డిల్లీ వాసికి , ౭౫ యేంద్ల శారదా అనే వ్రుద్దు రాలితో పరిచయం ఉంది . అతను ఎప్పుడూ అమెను అమ్మా, అమ్మా అని పిలుస్తూ ఎంతో అప్యాయంగా ఉండెవాడట. శారదా గారికి భర్త కూడ ఉన్నాడు. ఒక దురద్రుష్టకరమైన రోజు సదరు అచేలాల్ మద్యం బాటిల్ ఒకటి తీసుకుని శారదా గారి ఇంటికి వచ్చడట. ఆమె ౭౫ యేంద్ల వ్యక్తి, పై పెచ్చు మందు కొట్టె అలవటు ఉందంటమ్ వలన ఇరువురూ పుల్ గా మందు కొట్టె సరికి, వారిద్దరి మద్య ఉన్న మాటల సంబందం, వయోబేదాలు  మరచిపోయి, తాము కేవలం స్త్రీ పురుషులమని గుర్తుకువచ్చి స్రుష్తి కార్యానికి తలపడ్డారట. అతనేమో ౪౫ యేంద్ల వాడు అవటం చేత అతని మోటు తనానికి ఆ వ్రుద్ద నారి విల విల లాడి, చివరకు గాయాల చేత మరణించింది. దానితో పోలిస్ వారు అతని మీద రేప్ కేసు పెడితే , క్రింది కోర్టు వారు అతనికి ౧౦ యేంద్లు జైలు శిక్ష విదిస్తే అతను డిల్లీ హై కోర్టు వారికి అప్పీల్ చేసుకున్నాడు. ఇరుపక్షాల వాదన విన్న అనంతరం కోర్టు అచేలాల్ ని నిర్దోశిగా ప్రకటిస్తూ, అతని విడుదలకు అదేశాలు జారి చేసింది  

"As regards the offence punishable under Section 376 IPC the deceased 
was aged around 65-70 years, thus beyond the age of menopause. We find 
force in the contention of the learned counsel for the appellant that even if
the sexual intercourse was forceful it was not forcible and contrary to the 
wishes and consent of the deceased. From the MLC of Achey Lal and the 
post-mortem of the deceased it is evident that both Achey Lal and deceased 
had consumed alcohol. The forceful penetration is evident from the injuries 
on the vaginal orifices. However, besides the injuries on the vagina there is 
no other injury mark on the body of the deceased or on the appellant to show 
that there was any protest by the deceased. Hence we are of the opinion that 
                     it has not been proved beyond reasonable doubt that the appellant committed 
                    sexual intercourse with the deceased contrary to her wishes or her consent. 
                   Consequently the appellant is also acquitted of the charges under Section 
                    376 IPC. The impugned judgment of conviction and order on sentence are 
                       set aside. ". 


 డిల్లీ హై కోర్టు వారు  ద్రుష్టిలో "అచేలాల్, శారదా మద్య జరిగిన సెక్స్ బలమైనదే తప్పా, బలవంతమైనది కాదు". అంతే కాకుందా ఆమే మొనో పాజ్ కు చేరుకున్న వ్యక్తి అవటం వలన అమె ఇష్టానికి వ్యతిరేకంగా సెక్స్ జరపటం సాద్యం కాదన్న డిపెన్స్ వారి వాదనలో బలముందని హైకోర్టు వారు అభిప్రాయపడ్డారు. వారిద్దరూ ఏమి జరుగుతుందో తెలుసుకోలెనంతంగా మద్యం సేవించి ఉండటమ్ వలన అచేలాల్ కు ఎటువంటి దురుదేశ్యం లేదు అని కోర్టు వారు అభిప్రాయపడ్డారు. మొత్తానికి తప్పును మద్యం మీదకు నెట్టెసి అచేలాల్ ను కోర్టు వారు విడుదల చేయడమ్తో, "మద్యం బాటిల్" కి జై కోడుతూ అచేలాల్ మరిన్ని  మద్యమ్ బాటిల్ళు  ఓపెన్ చెయడానికి  బయలుదేరి ఉంటాడు. 

  పై కేసు గురించి విస్లేషించడం కూడా వేస్టె అనిపిస్తుంది. వ్యక్తులు తమ కున్న  స్వెచ్చను ఎంత ఘోరంగా దుర్వినియోగం చేస్తున్నారో ఈ కేసు తేటతెల్లమ్ చేస్తుంది .  "మేమ్ కలిసి తాగుతాం, కలిసి ఊగుతాం, మీరెవ్వరూ మాకు మోరల్ పోలిసింగ్ చెయ్యడానికి అని వాదించే "బలమైన " వర్గాలు ఉన్నంత కాలం శారదా గారి లాంటి ముసలివారే కాదు, ఎంతో మంది యువతులు బలమైన చర్యలకు  బలికాక తప్పదు. ఇదే పని సాంప్రదాయ పరంగా చూడాల్సి వస్తే అసలు ఒక వ్రుద్ద మహిళ, ఆమే  కంటె 25 సంవత్సరాల  తక్కువ వయసున్న వ్యక్తి మద్య, అదీ కూడా అమ్మా, అమ్మా అని పిలిచిన వ్యక్తితోనే అక్రమ సంబందం పెట్టుకున్న ఆ వ్యక్తి చేసింది ముమ్మాటికి రేప్ కంటె ఘోరమైన నేరం. దానికి దేవుడు ఆమెకు శిక్ష విదిస్తే, కనీసం సమాజమ్ ఇతనికి శిక్ష విదించాలీ . కాని టెక్నికల్ గా ఆలోచించి అతనిని విదుదల చేసే చట్టాలు ఉండటం  విచారించ వలసిన విషయం. 

  అయితే నాకొక సందేహమ్ ఉంది . శారదా గారు వివాహిత. భర్త బ్రతికి ఉన్నాడు. అటువంటి స్త్రీతో అక్రమ సంబందమ్ కలిగిఉండడం  "రేప్" క్రిందకు రాక పోయినా అడల్ట్రీ క్రిందకు వస్తుంది కదా! మరి  దనిని ప్రాసిక్యూషన్ వా రు ఎలా మరచి పోయారు? ఇది తప్పఖుండా సుప్రీం కోర్టుకు వెల్లవలసిన కేసే అని నా అభిప్రాఅయమ్. 
   

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )