మన సమాజంలో స్త్రీకి సముచిత గుర్తింపు లేదనే వారు , ఈ పత్రికా ప్రకటన చూసి ఏమంటారు!?

                                                                     

            
ప్రపంచం లో మన దేశం , మన సంస్కృతులు మాత్రమే స్త్రీలను చిన్న చూపు చూస్తున్నాయని , మిగతా దేశాలు వారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటున్నాయని , ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ , స్వదేశి సంస్క్రుతి గురించి హీనంగా ,విదేశి సంస్క్రుతి గురించి గొప్పగా చెప్పేవారికి ఈ పత్రికా ప్రకటన చూసాకైనా కొంత కనువిప్పు కలుగుతుందేమో!

  విదేశ సంస్క్రుతి గురించి ఏమో కానీ మన దేశంలో వేద కాలం నాటికే స్త్రీలు సమాజంలో మన్ననలు పొందారు . ఆదిశకరాచార్యులు కాలంలో సైతం భర్త తరపున భార్య వాదించి సాక్షాత్ శంకరాచార్యులు వారినే ఇరుకున పెట్టిన చరిత్ర  చదివాము. మన తెలుగు వారి సంగతికి వస్తే మన తోలి పాలకులు తమ తల్లి పేరులనే తమ పేర్లకు ముందు ప్రకటించారంటె వారి స్తానం ఏమిటో అర్దమవుతుంది . "గౌతమి " పేరు లేకపోతె "గౌతమి పుత్రా శాతకర్ణి" పేరుకు ప్రాదాన్యత లేదు అలాగే "వాసిష్ట పుత్రా పులుమావి " కూడా . దీనంటటికి కారణం అల నాటి స్త్రీలలో ఉన్న పాండిత్య  జ్ఞానం లేక విశిష్ట ప్రతిభ. అటువంటి ప్రతిభను అభివృద్ధి పరచుకోకుండా "మమ్మల్ని అణచారు , మమ్మల్ని అణిచారు " అని గగ్గోలు పెడితే ఏమి లాభం? ఎంతవరకు మెళ్ళల్లో ఎంత బంగారం ఉందా అనే యావే కాని మెదడులో ఎంత పవర్ ఉంది అని ఆలోచ్వ్హిస్తున్నారా ? అలా ఆలోచించనంత కాలం అణచివేతకు గురికాక తప్పదు . ఎందుకంటె ఆనాడూ , ఈనాడు తెలివిగలవాడు తెలివి తక్కువ వారి మీద అధిపత్యం చెలాయిస్తూనే ఉన్నారు . కాకపోతే ఆ నాడు జ్ఞాన వర్గం , అజ్ఞాన వర్గం అంటె ఈ నాడు "స్కిల్ల్డ్ పర్సన్" , అన్ స్కిల్ల్డ్  పర్సన్" అంటున్నారు . అంతే తేడా! 
                                                                             
                                                                     
          ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటె నిన్న ప్రముఖ పక్షి శాస్త్రజ్ణులు , క్రిష్ణ జింక రక్షణ కోసం ఎనలేని క్రుషి చేసిన చేసిన వ్యక్తీ శ్రీ జూలూరి వేంకట రమణ గారు మరణించారు . అయన ఎవరనే కదా మీ ప్రశ్న? నాకూడా అదే డౌటు వచ్చి చూస్తె అయన ప్రసిద్ద  చలన చిత్ర నటిమణి శ్రీ మతి జమున గారి భర్త గారు . మరి అంత గొప్ప పక్షి శాస్త్రజ్ఞుడు గారి గురించి అయన పేరుతో మరణ వార్తా ప్రకటిస్తే చాలామందికి అర్ధం కాదనే " జమున  భర్త జూలూరి కన్నుమూత" అని ప్రకటిస్తే చాలా మందికి అయన ఎవరో అర్దమైంది . ఒక స్త్రీకి మొగుడిగా అయన ప్రకటితమయ్యారు తప్పా , తన స్వీయ మేడా శక్తితో కాదు . కారణమ్. జమున గారి విశిష్టత ! ఆయనకంటే ఆమె ఎక్కువ పాపులర్ కాబట్టి. 

  కాబట్టి ఇప్పటికైనా ఆడపిల్లలు అర్ధం చేసుకోవలసింది ఏమిటంటె మీలోని విశిష్ట  ప్రతిభను  వెలుగులోకి తెండి . అబ్బాయిలతో పోటిపడండి . పలానా వారి కూతురు గానో , భార్యగా మాత్రమే కాక మీ వలన మీ తల్లితండ్రులకు , కుటుంభాలకు పేరు తెచ్చే విదంగా మీ పేరు ఉండాలని కొరుకొండి. మీ కంటు ప్రత్యేక గుర్తింపు కోసం కష్ట పడండి . అంతే కాని పనికి రాని  వాదాలు అయిన "లవ్ అప్ కిస్" లవ్ అప్ హాగ్" లు మీకు స్వెచ్చ ప్రసాదించి , మీకెరీర్ కి బాసటగా ఉంటాయని బ్రమ పడకండి . ఒక వేళ అదే నిజమయితే మిమల్ని వెనుక ఉండి ప్రోస్తాహించే అజ్ఞాత పెద్దలు  వారు వారి స్నేహితులని ఎందుకు  బహిరంగ ముద్దులు ఎందుకు పెట్టుకోవడం లేదో  ఆలోచించండి .నేను మొన్న ఒక హింది చానల్ లో ఒక కామెడి ప్రోగ్రామ్ చూసాను . దానిలో పాల్గొన్న ఒక సినిమా నటి మిడ్డి వేసుకుని వచ్చింది కాని కూర్చుని తెగ ఇబ్బంది పడిపోతూ కాళ్ళ మీద "దిండు అడ్డం " పెడుకుని తన అభిమాన్నాన్ని కాపాడుకుంది . కారణం ఆమె లో ఉన్న స్వదేశి సంస్క్రుతి . అదే విదేసీయులు అలా ఇబ్బంది పడతారా? చదువులో , తెలివితేటాల్లో ప్రపంచంతో పోటీ పడాలి కాని, ముద్దుల్లో , హద్దుల్లో పోటి పడట మేమిటి? నాన్సెన్స్! 

  జూలూరి రమణారావు గారి మరణానికి జమున గారికి , ఆమె కుటుంభ సబ్యులకు సంతాపం తెలియ చేస్తు , అయన గారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్దిస్తున్నాను .  

Comments

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )