కేరళ కు చెందిన దేవుని బిడ్డలు "చుంబన సమరం" ద్వారా తిరిగి "అదాం ,అవ్వ" ల స్వేచ్చ కావాలి అంటున్నారు !

                                                                         
క్రైస్తవుల  పవిత్ర గ్రందం అయిన బైబిల్ లో ఒక కధ ఉంది . సృష్టిలోని అది మానవులు అయిన ఆదాం , అవ్వలు దేవుని అజ్ఞ మేరకు "ఎదేన్స్" వనం లో స్వేచ్చ గా , దిగంబరంగా ఏ అరమరికలు లేకుండా సంచరిO చేవారు . అయితే వారిని ఎలా అయినా దేవుని శాపానికి గురి చేయించి , తన అధినంలో ఉంచుకోవాలని బావించిన సైతాన్ "సర్ప" రూపo లో వారి వద్దకు వచ్చి వారిని ప్రలోభపరచి , దేవుడు తినవద్దని సూచించిన "జ్ఞాన ఫలం" తినేలా చేస్తాడు . దానితో వారికి జ్ఞాన నేత్రం లు తెరచుకుని ,తాము దిగంబరంగా ఉన్న విషయాన్ని తెలుసుకుని , సిగ్గుపడి తమ శరీరాలను ఆకులుతో కప్పుకుంటారు . ఆ తర్వాత దేవుని శాపానికి గురి అయి అనేక కష్ట నష్టాలకు గురి అవుతారు . అది వేరే కధ.

 అయితే ఇక్కడ విషయం ఏమిటంటే జ్ఞానం లేనంతకాలం మనిషి ఇతర జంతువుల మాదిరే ప్రక్రుతి ప్రేరపణానుసారమ్ నడిచాడు . కాని జ్ఞానం అబ్బాక  మాత్రం  కొన్ని సామాజిక నియమాలు ఏర్పరచుకుని  వాటి  ప్రకారమే జీవిస్తున్నాడు . ఈ నియమాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. కాకపోతే ఒక ప్రాంతంలో ఆచారంగా ఉన్నది మరొక ప్రాంతంలో అనాచారం కావచ్చు . కాబట్టి నీ ఇంట్లో నీవు ఎలా ఉన్నా , వీదిలోకి వచ్చినప్పుడు మాత్రం ఆ  ప్రాంతాల్లో ఉన్న సామాజిక నియమాలు అనుసరించే నడుచుకోవలసి ఉంటుంది .  ఎడం ప్రక్కకు నడవాలని ట్రాపిక్ నిభందనలు ఉన్న చోట , "మా ఊళ్ళో కుడి పక్కకే నడుస్తారు " అని చెప్పి మూర్కంగా  వాహనాలకు ఎదురు వెళితే ఏమి జరుగుతుంది , ఏదో  ఒకటి గుద్దుకుని చస్తారు . అందుకే చెప్పేది "లాండ్ లా" పాలో కమ్మని.

 ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే , నిన్న కేరళలో కొంత మంఅంది యువతీ యువకులు "మోరల్ పోలిసింగ్ " కి వ్యతిరేకంగా బహిరంగంగా  " ముద్దుల ప్రేమ" ను  ప్రదర్సించాలి అనుకున్నారు . కుక్కలకు , నక్కలకు ఉన్న లైంగిక  స్వేచ్చ తమకు ఎందుకు లేదని బావించిన వారు నిన్న సాయంత్రం  ఒక కాలేజి గ్రౌండ్ దగ్గర  ముద్దుల ప్రదర్శన ఇవ్వాలని చూస్తె , వారు ముద్దులు పెట్టుకోవడం సీన్ ను  ప్రీగా  చూడాలనే ఉబలాటంతో వేల మంది జనం పోగయ్యారు అట . ముద్దులు పెట్టుకునే వారు 50 మందికి మించి లేరు . ఎందుకంటె  అందరూ దేవుని బిడ్డలు కాదు కాబట్టి . ఇక ఎప్పుడొ దేవుని అజ్ఞను మీరి జంతు కోటి నుంది విడిపోయిన కొంతమంది  దేవుని బిడ్డలు తిరిగి ఆ జంతువులు మాదిరే తమకు లైంగిక స్వేచ్చ ఉండాలని బావిస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఒకవేళ దేవుడు ఒప్పుకున్నా మనిషిలోని  సైతాన్ ప్రసాదిత మిడి మిడి జ్ఞానం ఒప్పుకుంటుందా ? నెవ్వర్ !  దానికి "అంతా ఒకటే "  అనే బ్రహ్మ జ్ఞానం కావాలి . అది పొందిన నాడు,  'శునకం' 'మనిషి' ఒకటే అనే తత్వం ఎరుక అవుతుంది కాబట్టి , వీదిలో శునకాలు చేసే పనులు మనుషులు కూడా చేయొచ్చు.  అప్పటివరకు  ప్రాంతీయ  సామాజిక నియమాలు  అనుసరించి నడవడం మంచిది. లేకుంటే పబ్లిక్ న్యూసెన్స్ లు! పోలిస్ కేసులు !. ఇవి మీడియా" సాక్షిగా" రేటింగ్ లుకు తప్పా దేనికి పనికి రావు.

 మొతానికి నిన్న కేరళలో తలపెట్టిన" ముద్దుల గోల " అట్టర్ ప్లాప్ అయి భారతీయ సంస్కృతి కి బహిరంగ ముద్దులు వ్యతిరేకం అని ప్రపంచానికి చాటి చెప్పినట్లు అయింది . ఈ విషయం లో ముద్దుల లవ్ కి తమ వ్యతిరేకతను ప్రకటించిన హిందూ , ముస్లిం సంఘాల వారికి అభినందనలు .

 ముద్దులు కోసం ఆరాటపడే ముద్దరాళ్ళ వాదన ఏమిటో క్రింది విడియోలో చూడవచ్చు .
 
        

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.