ఇల్లాలు ఇంటికి రావటం లేదని ఇంటికే నిప్ప్పు పెట్టిన "వరద రాజులు"
పెళ్ళాం అలిగి పోయి ఇంటికి రాలేదనే కోపంతో తనకూ కోపం వచ్చి అసలు ఉంటున్న ఇంటికే నిప్పు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ? ఇదిగో అచ్చం ఖమ్మం జిల్లా అశ్వారావు పేట వరద రాజులు చేసిన పని లాగే ఉంటుంది . వెనుకటి కేవడో ఎలుక మిద కోపంతో గుడిసెకు నిప్పు పెట్టుకున్నాడట! అలా ఉంది ఇతని పరిస్తితి! వరద రాజులు భార్య ఇవాళ కాపోతే రేపు వస్తుంది . ఆమె వచ్చిందని కాలిపోయిన ఇల్లు ప్రత్యక్ష మవుతుO డా? లేదు కదా? మొన్న ఒకాయన పెళ్ళాం విడాకులు ఇచ్చిందని బంగారం లాంటి తన ఇద్దరు పిల్లల్ని చంపి తను రైలు క్రింద పది ఆత్మ హత్య చేసుకున్నాడు . పైగా ఆయనొక గురువు గారు . ప్రోపెసర్ అయితే నేమి తన లోని కోపాన్ని జయించలేక కుటుంబాన్నే కూల్చేసుకున్న నిర్బాగ్యుడు! అయన అలా అయినందుకు నాలుగు రోజులు అయ్యో అనుకున్నారు . ఇప్పుడు ఆయన్ని తలచేదెవరు ? పిల్లలు చనిపోయారు కాబట్టి బ్రతికి ఉన్న అయన బార్య తలస్తూ, విలపిస్తూ ఉండవచ్చు. పదేళ్ళూ కాపురం చేసి పిల్లల్ని కని పెంచి పెద్దచేసినప్పుడు ఉన్న ఓర్పు, సహనం హట్టతుగా మాయమై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో ఈ ప్రొపెసర్ గారి కేసు లాగే ఉంటుంది . లెక్చరర్ గారి కేసు పూర్తీ వివరాలు కోసం పక్కన లింక్ మీద క్లిక్ చేయండి . http://timesofindia.indiatimes.com/city/hyderabad/Hyderabad-professor-killed-sons-before-ending-his-life/articleshow/44548133.cms
ఇంతకీ నేను చెప్పేదేమిటంటే , గురువులు కైనా , గుడిసెలో ఉండెవాళ్ళ కైనా సంసార న్యాయం ఒకటే ! సంసారం సజావుగా సాగాలంటే కావాల్సింది ఓర్పు సహనం. సంయమనం . "తమల పాకుతో నీవొకటి అంటె, తలుపు చెక్కతో నేనొకటి అంట " అనే పద్దతి కరెక్టు కాదు . ఒకరికి కోపం వచ్చినప్పుడు , ఓర్పుతో వారిని దారికి తెచ్చుకోవడమే జీవిత బాగస్వాములు చేయాల్సిన పని . అందుకే పెద్దలు అనేది " తన కోపమే తన శత్రువు " తన శాంతమే తనకు రక్ష ,దయ చుట్టంబౌ " అని . అర్దం చేసుకుని ఆచరించాలి మరి! లేకుంటే ఆనక "వగచి ,వగచి నా ఏమి పలంబు!" అని పద్యాలు పాడుకోవటం తప్పా చేసేదేమీ ఉండదు!
Comments
Post a Comment