అలాంటి ఖతర్నాక్ చట్టాలు భారత్ లో లేవని బాదపడుతుంది కాబోలు ఈ టెన్నిస్ స్టార్ !
ఆమె గారు ఒక గొప్ప క్రీడాకారిణి . ఆమె పుట్టింది భారత్ లో మెట్టింది పాకిస్తాన్లో. ఆమె గారిమీద, భారత జాతీయ జెండాను అవమానించిందన్న ఆరోపణలు ఉన్నా , భారత్ దేశం ఆమెను ఏమి అనలేదు. పై పెచ్చు ఆమెకు మన రాష్ట్రం "తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ " గా ప్రకటించి కోటి రూపాయలు నజరానా ప్రకటించింది . తెలంగాణా కోసం పోరాటం చేసిన "విమలక్క " లాంటి అక్కలు ను కాదని ఇలాంటి "క్రీడా చుక్క" లకు బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇచ్చినప్పుడు కూడా బారత్ సంతసించిందే తప్పా వేరు మాట అనలేదు. అలాంటి ఆవిడ గారు ఐక్యరాజ్య సమితిలో ఏదో గౌరవం దక్కిందని చెప్పి , పుట్టింటి భారత్ గురించి అంత మాట అంటుందా? ఆమె ఏమి అందో చోడండి.
నిజంగా భారత్ లో మహిళా స్వేచ్క కు ఆటంకం కలిగించే చట్టాలు ఉన్నాయా? ఎన్నో చట్టాలు మహిళలకు అండగా ఉండి , కొన్ని సార్లు కుటుంబ హక్కులను కాల రాస్తున్నా , ఆ చట్టాలను కొనసాగిస్తున్నామే తప్పా రద్దు చేయమని ఎవరూ కోరుకోవటం లేదు. సమాజంలో జరిగే అత్యాచారాల్లో నోటికి 75% కేసులు విదేశి సంస్క్రుతి వలననే జరుగుతున్నాయని గణాంకాలు చెప్పినా , కొంచం జాగర్తగా ఉండడండమ్మా అని ఓరల్ గా చెప్పారు తప్పా , ఇలాంటి కతర్నాక్ చట్టాలు చేసి పబ్లిక్ గా బోర్డులు పెట్టారా ? సానియా గారు సెలవివ్వాలి . ఇలాంటి చట్టాలు ఉంటె సానియా గారు పైన చిత్రంలో చూపిన డ్రెస్ లు వేసుకోగలిగెదా !?
ఈ దేశంలో స్త్రీల మీద లైంగిక దాడులు అధికంగా జరగటానికి సాంప్రదాయ బావాలు కారణం కాదు. ఖచ్చితంగా విదేశి బావ వ్యామోహమే. దీని మీద ఈ బ్లాగులో ప్రచురించిన టపా చూడగలరు .
భారతీయ సంస్క్రుతి వద్దు ,భాయ్ ఫ్రెండ్ సంస్రుతే ముద్దు ! అన్నవారందరు సిగ్గుపడాల్సిన విషయం ఇది! చూడండి
ప్రపంచం లో స్త్రీ ల పట్ల లైంగిక దాడులు చేయని దేశం ఏదైనా ఉంటే , అలాంటి దానిని ఆదర్శంగా చూపి భారత్ ని విమర్శిస్తే బాగుంటుంది . ఒక రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన వ్యక్తీ మాత్రుదేశO గురించి ఇలాంటి తప్పుడు స్తేట్మెంట్ లు ఇస్తుంటె , ఆమె బ్రాండ్ అంబాసిడర్ హోదాకి అర్హురాలా? తెలంగాణా ప్రజలు ఆలోచించాలి.
Comments
Post a Comment