విజయవాడ(నిడమానూరు ) చైతన్య కాలేజి హాస్టల్లో, కాళ్ళు భూమి మీద ఉంచి "ఉరి " వేసుకునే సౌకర్యం ఉందా ?!!!!!

                                                                         


 ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లల ఉజ్వల బవిష్యత్ కోసం, తాము ఉండె ప్రాంతాలకు వందల కిలో మీటర్ల దూరంలో ఉండె నగరాలలో ని హాస్టళ్ళలోతమ పిల్లలను  ఉంచి చదివిస్తున్నారు . తమకు స్తోమత ఉన్నా, లేకున్నా లక్షలు వెచ్చించి పిల్లలను చదివిస్తున్నారు అంటె , అది వారికి తమ పిల్లల పట్ల గల ప్రేమతో కూడిన బాద్యతను తెలియ చెస్తుంది . అలా 18 ,20 ఏండ్లు నుంచి తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ , ఎన్నో ఆశలతో తమ పిల్ల బవిష్యత్ కోసం కలలు కంటున్న తల్లి తండ్రులను , చిన్న చీటీ ముక్కతో వారి కలలకు చెల్లు చీటి రాసేయడం పిల్లలకు తగునా? బ్రతికినంత కాలం, లేని ,ఇక రాని  తమ పిల్లల్ని తలచుకుంటూ జీవించమని తల్లితండ్రులకు శిక్ష విదించడమేనా పిల్లలు తీర్చుకునే తల్లితండ్రుల రుణం ?క్షణికావేశంలో ఆత్మ హత్యలు చేసుకునే పిల్లలు ఆలోచించాల్సిన అవసరం ఉంది .తల్లితండ్రులకు సూయిసైడ్ నోట్ లు రాయడానికి నిమిషాలు వెచ్చించే సమయం లోనే , వారికి జీవితాంతం మీరు విదిస్తున్న శిక్ష గురించి ఒక్క నిమిషం , ఒక్క నిమిషం అలోచించండి .

     ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే నిన్న విజయవాడ దగ్గర నిడమానూరు చైతన్య కాలేజిలో కడప జిల్లా కు చెందిన శ్రావ్య అనే అమ్మాయి తన తల్లి తండ్రులకు ఒక సూయి యి సైడ్ నోట్ రాసి  , హాస్టల్లో ప్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయిందట . నిజంగా ఇది చాలా విషాద కరం . కాలేజీ వారు చెపుతున్న దాని ప్రకారం ఆ అమాయి గత కొన్ని రోజులుగా దిగులుగా ముభావం ఉంతుందట. అయినా సరే హాస్టల్ లోని కేర్ టేకర్ లు పట్టించుకోలేదు కామోలు బలవంమరణానికి పాల్పడిందట . ఆ అమాయి ఉరి వేసుకుని చనిపోయిన విదానాన్ని పోలిస్ వారితో పాటు , మీడియా వారు కూడా తమ విడియోలో చిత్రీకరించారు . అది క్రింది విడియోలో ఛూడవచ్చు.

  సాదారణంగా ప్యాన్ కి కాని మరి ఏ ఇతర ఆదారానికైన తాడు లేక చీర , చున్నీ లు ఉపయోగించి ఉరి వేసుకునే వారు తాము తమ కాళ్లను భూమికి అనకుండా ఉండెటట్లు చూసుకుంటారు . ఎందుకంటె భూమికి లేక ఏ ఇతర అదారానికి అయినా తమ కాళ్ళు ఆనితే "ఉరి" అనేది సాద్యం కాదు కాబట్టి. అలాగే మెడకు ఉరి బిగుసుకునే టప్పుడు నరకయాతన అనుభవిస్తూ గిల గిలా కొట్టుకోవచ్చు. ఆ సమయం లో తమకు ఏ మాత్రం ఆదారం ఉన్నా ఆటొమేటిక్ గా వారి శరీరం  ఆ నరకయాతన నుండి తప్పించుకోవడానికే చూస్తుంది కాబట్టి , భూమి మీద కాళ్ళు అనేలా ఉంటె కచ్చితంగా నిలబడి పోతారు . కాని క్రింది  వీడియోను ఒక సారి చూడండి.  అమ్మాయి ఒక కాలు భూమి మీద ఉంటె , మరొక కాలు మడచి మంచం మీద ఉంచింది . మరి ఇటువంటి పొజిషన్ లో అమ్మాయి కి ఉరి ఎలా బిగిసింది ? మరి పోలిస్ వారు స్పష్టంగా అలా కనిపిస్తున్నప్పటికి , కేవలం సూయిసైడ్ నోట్ ఆదారంగా అది ఆత్మ హత్యేనని ఎలా ప్రాధమిక అంచనాకు వచ్చారు ? నోట్ రాసినంత మాత్రానా ఉరి వేసుకుని చావాలని రూలేమీ లేదు కదా? ఆ రాత ఆ అమ్మాయి దో  కాదో   సమగ్ర విచారణ తర్వాతే తెలుస్తుంది . ఏది ఏమైనా ఇది కచ్చితంగా అనుమానాస్పద మృతియె . కాబట్టి దీని మీద సమగ్ర విచారణ చేయిస్తే కాని నిజానిజాలు వెలుగులోకి రాగలవు.

  గత కొద్ది రోజులుగా అన్యమనస్కంగా ఉంటున్న తమ విద్యార్నిని అలా వదిలేసి , ఆత్మహత్య చేసుకున్నాక శవాన్ని తల్లి తండ్రులకు అప్పగించడ మేనా  ,లక్షలు వసూలు చేసి చదువులు చేప్పే విద్యా సంస్తల బాద్యత? మీమీద ఎంతో నమ్మఖ్ఖం తో తల్లి తండ్రులు తమ పిల్లలను మీ వద్ద సజీవంగా వదిలి వెళుతుంటే , వారికి నిర్జీవమైన పిల్లల్ని అప్పగించి చేతులు దులుపుకుంటారా? కొద్దిరోజులుగా ముభావంగా ఉంటున్న విద్యార్ది మానసిక పరిస్తితి  గురించి పట్టించుకోక పోవడం ఖచ్చితంగా  యాజ్యమాన్యం వారి నిర్లక్ష్య పూరిత వైఖైరే . దానికి వారిని బాద్యులను చేస్తూ కేసు పెట్టాల్సిందే . ప్రాసిక్యూట్ చేసి దోషులుగా తేలితే శిఖ్శించాల్సిందే . అదే ఇంటిలో ఉంటె తల్లితండ్రులకు ఈ కడుపుకోత ఉండదు కదా .

  శ్రావ్య ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్దిస్తూ , ఆమే తల్లితండ్రులకు సంతాపం తెలియ చేస్తున్నాను .


క్రింది విడియో లో అమ్మాయి ఉరి వేసుకున్న తీరు ను చూపించారు

    


    ఈ క్రింది వీడియోలో ఒక ప్రేమ జంటే ఉరి వేసుకున్న తీరును గమనిస్తే , ఉరి ఏ పరిస్తితుల్లో సాధ్యమో అర్దమవుతుంది . కాని ఎవరూ ఇలా చేయకూడదు . ఇది భగవంతుదు మెచ్చని పని . దీని వలన చనిపోయినా వారికి ఆత్మ శాంతి ఉండదు .

                                                               

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన