ఇంటాయన మీద కోపం తో పక్కింటాయన్ని ముద్దు పెట్టుకున్నట్లుంది!!!!
వారు హైదరాబాద్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్దులు . అందరికి ఉన్నట్లే వారిలోను బావాజాలాల పరంగా బిన్న దృక్పదాలు ఉన్నాయి . ఉండవచ్చు . తప్పేమి కాదు. అయితే అందులో లెప్ట్ వింగ్ విద్యార్దులు అనబడే వారికి మన భారతీయ సంస్క్రుతి అన్నా , ఆచారాలు అన్నా తగని ఒళ్ళు మంట అనుకుంటా . అందుకే ఇన్నాళ్ళూ భారత దేశాన్ని ఏలిన పాలకులు "కుహానా లౌకిక వాదులు" కాబట్టి , వారు భారతీయ సంస్క్రుతి పరిరక్షణ అనే దాని మీద పెద్దగా ఆసక్తి లేదు కాబట్టి , లెప్ట్ వింగ్ విద్యార్దులు ఎంతో స్వెచ్చ గా ఉన్నట్లు ఫీలైపొయి భారతీయ సంస్క్రుతి మీద తమ అక్కసు అంతా వెల్ల గ్రక్కుతూ ఉన్నారు . వారి ద్రుష్టిలో భారతీయ సంస్క్రుతి అంటె బ్రాహ్మణ సంస్క్రుతి అని , అది భారత దేశం లోని నిమ్న వర్గాలను అణచివేసిందని ,అదీ ఇప్పటికి కొనసాగుతుందని , ఇంకా ప్రస్తుత సమాజంలో బ్రాహ్మణ అదిపత్యమే కొనసాగుతుందని , "దళిత వాదం" అనే పేరిట ఒక "గలత్ వాదాన్ని " ప్రచారం చేస్తున్నారు , ఈ దేశం లో