మనకు కావలసింది బట్టలు విప్పే స్వెచ్చ కాదు , మనసు విప్పే స్వెచ్చ మాత్రమె !
మన దేశ రాజ్యాంగం తన పౌరులకు బావ ప్రకటన స్వేచ్చ ఇచ్చింది . కాని ఆ స్వెచ్చ ఉంది కదా అని మనం బడా లీడర్లు చేసే తప్పుడు పనులను విమర్శిస్తే మాత్రం వారు కాని వారి అనుచర గణం కాని ఊర్కోరు ." దొర గారి గురించి మాట్లాడే దమ్మున్న మగాడు అయ్యాడా వీడు" అని సదరు లీడర్ గారి పిశాచ గణం మనల్ని తిరిగి నోరెత్తకుండా చేస్తుంది . ఇది కేవలం లీడర్లు చుట్టూ తిరిగే చదువు సంద్యలు లేని అనుచర గణం మాత్రమె చేసే పని కాదు. బాగా చదువుకుని , రాజ్యoగం ప్రజలుకు ప్రసాదించిన బావప్రకటన స్వేచ్చా ఉల్లంగణ జరిగితే , వారి తరపున కోర్టుల్లో పోరాడి న్యాయం చేయించగలిగిన న్యాయవాదులే , బావ ప్రకటన చేసే వారి మిద బౌతిక దాడులు చేస్తుంటే , నోరెళ్ళ బెట్టడం తప్పా కనీసం అది తప్పు అనే పరిస్తితుల్లో ప...