24-1-2014 న "మనవు " ఉహీంచింది ,6-1-2015 నాటికి నిజం అని తేలిందన్న మాట !
సునందా పుష్కర్ ! మాజీ మంత్రి గారి బార్య ! ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిగా పదవి బాద్యతలు నిర్వహించిన ఆ మాజీ మంత్రిగారికి ముచ్చటగా మూడో భార్య సునందా గారు .ఎక్స్టర్నల్ అపైర్స్ మినిస్టర్ గా ఉన్న శశి ధరూర్ గారికి ఎక్స్ట్రా మారిటల్ ఎపైర్స్ మీద కూడా మక్కువట . అందుకే వారి తాజా ప్రియురాలికి ,సునందా గారికి గొడవలు జరిగి ,చివరకు అవి ట్విట్టర్ లో తిట్టుకునే వరకూ వెళ్ళాయి . అయితే ఆతర్వాత భార్యా భర్తల మద్య రాజీ కుదిరిందని చెప్పి ఇద్దరూ కలిసి ఒక మీడియా స్టేట్ మెంట్ ఇవ్వడం జరిగింది . అలా మీడియా ముందు తమకు బేదాలు లేవని చెప్పిన ఆమెగారు 24 గంటల్లో అనుమానాస్పద స్తితిలో మరణిస్తే భారత దేశం లోని మహిళా సంఘాలు ఆమె గారి అనుమానాస్పద మృతి గురించి అంతగా పట్టించు కోలేదు . కాని నాకు ఎందుకో ఆమె మృతి పట్ల ఆనాడే అనుమానం కలిగింది . అందుకే ది 24-01-2014 న ఇదే బ్లాగులో మా మద్య విబేదాలు లేవని మీడియా ముందు చెప్పిన 24 గంటల లోపే లోపే ఆమె ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమిటి? అనే టపా పెట్టాను .మరింత సమాచారం కొరకు క్లిక్ చేసి చూడండి . అందులో పో