24-1-2014 న "మనవు " ఉహీంచింది ,6-1-2015 నాటికి నిజం అని తేలిందన్న మాట !

                                                                           


సునందా పుష్కర్ ! మాజీ మంత్రి గారి బార్య ! ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిగా పదవి బాద్యతలు నిర్వహించిన ఆ  మాజీ మంత్రిగారికి ముచ్చటగా మూడో భార్య సునందా గారు .ఎక్స్టర్నల్ అపైర్స్ మినిస్టర్ గా ఉన్న శశి ధరూర్ గారికి ఎక్స్ట్రా మారిటల్ ఎపైర్స్ మీద కూడా మక్కువట . అందుకే వారి తాజా ప్రియురాలికి ,సునందా గారికి గొడవలు జరిగి ,చివరకు అవి ట్విట్టర్ లో తిట్టుకునే వరకూ వెళ్ళాయి . అయితే ఆతర్వాత భార్యా భర్తల మద్య రాజీ కుదిరిందని చెప్పి ఇద్దరూ కలిసి ఒక మీడియా స్టేట్ మెంట్ ఇవ్వడం జరిగింది . అలా మీడియా ముందు తమకు బేదాలు లేవని చెప్పిన ఆమెగారు 24 గంటల్లో అనుమానాస్పద స్తితిలో మరణిస్తే    భారత దేశం లోని మహిళా సంఘాలు ఆమె గారి అనుమానాస్పద మృతి గురించి అంతగా పట్టించు కోలేదు . కాని నాకు ఎందుకో ఆమె మృతి పట్ల ఆనాడే  అనుమానం కలిగింది . అందుకే ది 24-01-2014 న ఇదే బ్లాగులో  మా మద్య విబేదాలు లేవని మీడియా ముందు చెప్పిన 24 గంటల లోపే లోపే ఆమె ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమిటి?  అనే టపా పెట్టాను .మరింత సమాచారం కొరకు క్లిక్ చేసి చూడండి . అందులో పోలిసుల విచారణ  ,మహిళా సంఘాల నిర్లక్ష్యం గురించి ప్రశ్నించడం జరిగింది .అందులో నేను ఏమన్నాను అంటే,

"పోస్ట్ మార్టం రెపోర్టులో కూడా ఆమె ఒంటి మీద కొన్ని  గాయాలు  ఉన్నాయని తేలిన తర్వాత ఇంకా నిందితులను అరెస్ట్ చెయ్యక పోవడం అనేది సరి అయిన దర్యాప్తు విదానం అనిపించుకోదు. ఇంప్లూయన్స్ చేయగలిగిన స్తాయిలో ఉన్నవారే  ఈ కేసులో అనుమానితులుగా ఉన్నపుడుదర్యాప్తు ఈ కేసు నిస్పక్షపాతంగ దర్యాప్తు జరుపబడుతుందని సామన్య పొరుడు ఎలా నమ్మగలడు. స్త్రీలకు ఏదైన జరిగితే ముందుండే మహిళా సంఘాలు సైతం  సునందా గారి కేసు విషయంలో ఎందుకు మౌనంగ ఉన్నాయో అర్దం కావటం లేదు. ఈ కేసు దర్యాప్తు సక్రమంగ సాగాలంటే కేంద్ర మంత్రి పదవి నుండి శశిదరూర్ గారు తప్పుకోవడం మంచి పద్దతి. లేదా ప్రదాన మంత్రిగారైనా ఆయనను తాత్కాలికంగ అయినా ఆయనని  పదవి నుండి దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. "

 కనీసం ఈ మాత్రం డిమాండ్ ఆ నాడు మహిళా సంఘాలు చేసి ఉంటే ఆనాడే నిజాలు బయట పడి ఉండెవి . కాని అలా జరుగలేదు . సంతోషించ దగ్గ విషయం ఏమిటంటే కల్ల బొల్లి రిపోర్ట్ లతో కేసును క్లోజ్ చేయకుండా ,ఎలాగో సంవత్సరం పాటు దర్యాప్తు జరిపిన పోలిసులు నిన్ననే సునందా గారి అనుమానాస్పద మృతిని మర్డర్ కేసుగా తీర్మానించి సెక్షన్ 302 క్రింద కేసు రిజిస్టర్ చేసారు . ఇక మర్డర్ కి బాద్యులు ఎవరో తేలాల్సి ఉంది . అయితే ఆమె గారి మృతి ని మర్డర్ కేసు గా పోలిసులు బావించడం తనకు  ఆశ్చర్యం కలిగిస్తుందని ,మాజీ మంత్రి గారు స్పందించడం ఇందులో కొసమెరుపు . పోలిసులు దోషులను పట్టుకుని తగిన శిక్షలు విదింప చేస్తారని ఆశిద్దాం 

 Source :-       http://timesofindia.indiatimes.com/city/delhi/Sunanda-Pushkar-was-murdered-Delhi-Police/articleshow/45775554.cms?utm_source=facebook.com&utm_medium

Comments

Popular Posts

విగ్రహారాధన వేస్ట్ అనే మౌలానా గారిని నిగ్రహం కోల్పోయేలా చేసిన "ముజ్ర ముద్దుగుమ్మ" !!

అమ్మా బాబులను కాదని , ఆటో డ్రైవర్ ని ప్రేమించినందుకు ఆ పిల్ల బ్రతుకు ఏమయిందో చూడండి !.

సంతానం కోసం సన్నాసి బాబాలతో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏమిటి చండాలంగా?

ప్రేమించిన ప్రియురాలిని 'విధవ' ను చేయబోయి 'వెధవ' అయిన "ప్రేమ పూజారి"

పచ్చల దీప్తి ని హత్య చేసింది ఆమె తల్లి తండ్రులు కాదు!కాదు !కాదు!

"శీలం" విషయంలో మన పెద్దలు స్త్రీలకే ఎందుకు ఎక్కువ అంక్షలు విదించారో కొండయ్య కేసు వలన అర్దమవుతుంది !

"సింగిల్ పేరెంట్ సిస్టం " వలన భవిష్యత్ లో మగాళ్లు ఇలా "దున్నలు " లా పనికొస్తారు తప్పా ,మొగుళ్లుగా మాత్రం కాదు!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

విదేశీ డేటింగ్ సంస్కృతీ కి బలి అయి బావురుమంటున్న స్వదేశీ కన్నెపిల్లలు !.