కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.
అమెరికా సంయుక్త రాష్ట్రం లోని ఓక్లహామా కు చెందిన పెట్రసియా కు 43 ఏండ్లు. ఆమెకు ముగ్గురు పిల్లలు. కారణాలు ఏమిటో తెలియదు కానీ ఆ పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ వద్దనే పెరిగారు. అలాంటి పరిస్తుతుల్లో 2008 లో పెట్రసియా తన స్వంత కుమారుడిని పెండ్లి చేసుకుంది . వావి వరుసలు మరచి జరిగిన ఈ పెండ్లి జరిగిన 15 నెలలకు ఆమె కొడుకు ఆమె తో డైవోర్స్ కి కోర్టులో కేసు వేసాడు అంట . ఆ కేసులో వేసిన అఫిడవిట్ లో అతను చూపించిన కారణం ఏమిటంటే , తన భార్యా స్వయానా తన తల్లి అని. మనిషికి స్వేచ్ఛ ఎక్కువైతే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఈ కేసు తెలియ చేస్తోంది.
ఆలా కొడుకుని పెండ్లి చేసుకుని పాపం మూటకట్టుకున్న ఆ కామాంధురాలికి అప్పటికి జ్ఞానోదయం అవటం కానీ , పచ్చాత్తాపం చెందటం కానీ కలుగలేదు . తన ఒంట్లో తాపమే ఆమెకు ముఖ్యమనిపించింది. దానిని తీర్చుకోవడానికి కట్టుబాట్లను ,వావి వరుసలను నిస్సిగ్గుగా వదిలేసి 2016 లో తిరిగి తన కూతురిని పెండ్లి చేసుకుని సమాజం నివ్వెరపోయేలా చేసింది.
" నా కూతురిని నేను పెండ్లి చేసుకుంటే చట్ట వ్యతిరేకం అవుతుందని నాకు తెలియదు. అయినా నా కూతురి బర్త్ సర్టిఫికెట్ లో తల్లి గా నా పేరు లేదుగా " అని వాదిస్తోంది అట అన్ని గాలికొదిలేసిన ఈ అమెరికా అతివ. దానిని విన్న పోలీసులు నోటా మాట రావడం లేదట. చివరకు లెస్బియన్ దంపతులుగా మారిన వారు , వావి వరుసలు మరచినందుకు క్రిమినల్ కేసు పైల్ చేసి ఇద్దరినీ కట కటా లోకి నెట్టారు అట. అది సంగతి.
కుటుంబ కట్టుబాట్లు మృగ్యమైన చోట, మనిషికి స్వేచ్ఛ ఎక్కువైతే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో ఈ కేసు లోని స్త్రీలు తెలియ చేస్తున్నారు . బహుశా ఇలాంటి వాళ్ళ కోసమే "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి " అనే మాట పుట్టిఉంటుంది. విదేశాల్లో "మై చాయిస్ " మై చాయిస్ " అనేది దీనికోసమేనేమో !
(Courtesy : Sri U.G. Sri Ram. )
Comments
Post a Comment