మోక్షజ్ణ నిజంగా దురదృష్ట జాతకుడు !
మొన్న విజయవాడ కృష్ణా నదిలో విగత జీవిగా పడి ఉండి ఎంతో మంది ప్రజల కంట నీరు తెప్పించిన చిన్నారి మోక్షజ్ణ ఉదంతం వింటుంటే నిజంగా అ చిన్నారి అన్నీ ఉండి ,అందరు ఉండి కూడా ఎవరికీ ఏమికాని దురదృష్ట వంతుడు అనిపిస్తుంది . అ చిన్నారి జాతకం చూసిన వారెవరో కాని ,మోక్షజ్ణ జాతకం వలన తండ్రికి కీడు అని తప్పుడు జాతకం చెప్పాడు ,కాని నిజంగా జరిగింది తన తండ్రి కుటుంబ సబ్యుల వలననే చిన్నారి హత మయ్యాడు . చిన్నారి ని చంపింది పిచ్చోడు అయిన అతని బాబాయి అవునో కాదో కాని ,చావుకు కారణం మాత్రం ఖచ్చితంగా మోక్షజ్ణ ను కన్న తల్లితండ్రులు ,వారి కుటుంబ సబ్యులు యావన్మంది అని చెప్పక తప్పదు .
మోక్షజ్ణ తల్లితండ్రులు ఇద్దరూ సాప్ట్ వేర్ ఇంజనీర్లు . వారికి సాప్ట్ వేర్ గురించి తెలిసినంతగా సంసార బాద్యతలు గురించి తెలియ నట్లుంది .అందుకే చిన్నారి మోక్షజ్ణ ఆలనా పాలన ను తమ తల్లి తండ్రుల మీద వదిలేసి తాము తమ ఉద్యోగాలను హైదరాబాద్ లో చేసుకుంటున్నారు . మోక్షజ్ణ తండ్రికి జాతకాల పిచ్చి ఉందని , మోక్షజ్ణ పుట్టగానే అతని జాతకం వలన తనకు కీడు ఉందని ,తన భర్త గొడవ చేసాడని మోక్షజ్ణ తల్లి చెప్పడం చూస్తుంటె , మొక్షజ్ణ ఆలనా పాలనా బాద్యతలు పెద్దోళ్ళ మీద వదిలేయ్యడానికే జాతకాల కట్టుకద అల్లారని తెలుస్తుంది . నిజంగా జాతకాలు నమ్మే వారికి ,అందులోని ప్రతి కీడుకు శాంతి కార్యక్రమాలు ఉంటాయి . అవి చేస్తే సరిపోతుంది అని నమ్ముతారు . కాని పిల్లాడు పుట్టిన 18 నెలలకు జాతకం పేరుతో చంపుకోరు .
మోక్షజ్ఞ తండ్రికి మొక్షజ్ణ ఆలనా పాలన కంటె ,తన బార్య తెచ్చె జీతం మీదే ఎక్కువ మక్కువ అనుకుంట . అందుకే భార్యా వద్దని చెపుతున్న వినకుండా మోక్షజ్ణ బాద్యతను అత్తమామలు మిద నెట్టేందుకు "జాతకం " వంక పెట్టాడు .కూతురు అల్లుడు మద్య గొడవలెండుకని కాబోలు మోక్షజ్న బాద్యతను చెరి కొన్నాళ్ళు బరించడానికి ఇరువైపులా పెద్దలు ఒప్పుకున్నట్లుంది . అందులోబాగంగానె మొదటి ఆరు నెలలు మొక్షజ్ణ అమ్మమ్మ చుస్తే , తరువాయి 6 నెలలు నాయనమ్మ వాళ్ళు చుసినట్లుంది . నాయనమ్మ పెంపకంలో ఉన్న మోక్షజ్ణ ను భరింపరాని బారంగా ఎప్పుడు అనుకునే వారు కాబోలు .ఆ మాటలు విన్న మొక్షజ్ఞ పిచ్చి బాబాయి అతనిని హతమారిస్తే అందరికి బారం లేకుండా పోతుంది కదా అనే పిచ్చి ఆలోచనతో అతనిని చంపి నదిలో పడేసి ఉండాలి . అది తెలిసిన మోక్షజ్ణ తాత తన రెండవ కొడుకు చేత , పిచ్చి కొడుకు మీద కేసు పెట్టించి ఉండవచ్చు . దీని మీద మోక్షజ్ణ తల్లి ,తాత ,మేనమామ అబ్యంతరాలు అర్దం లేనివి . కేసు ఎవరు పెట్టినా ,తమ వద్ద ఉన్న అదారాలను పోలీసులకు అందిస్తే నిజమైన దోషులకు శిక్ష పడేలా చేయవచ్చు .
నిజంగా తన భర్త తరపు వారి వలన ,వారి జాతకాల పిచ్చి వలన తన కొడుక్కి అపాయం ఉందని అనుకుంటే ,మోక్షజ్ణ తల్లి తన కుమారుడిని అత్త మామల దగ్గర ఎందుకు ఉమ్చుతుంది ? కాసుల కోసం కన్న వారిని పెద్దల మీద వదిలేసే వారికి పిల్లల్ని పెంచడం లోఉన్న బరువు బాద్యతలు ఎలా తెలుస్తాయి . కట్నాల కోసం పెండ్లిళ్ళు , భార్యల సంపాదన కోసం సంసారాలు చేయాలి అనుకునే వారు పిల్లల్ని కనడం ఎందుకు ?తిరిగి ఏదో వక వంకతో పిల్లల బాధ్యతలను పెద్దల మీద వదలద మెందుకు ? తల్లి తండ్రులకు బారమైన బిడ్డ అందరికీ బారమే .. అందుకే ఆ పిల్లవాడి అనాధ ఆవస్త చూడలేకే అతని బాబాయి లోని పిచ్చి అతనికి శాశ్వత విముక్తి కలిగించి ఉండాలి . ఈ కేసులో పిచ్చి బాబాయికి శిక్ష పడకపోయినా ,మోక్షజ్ణ తల్లి తండ్రులకు వారి వారి ఉద్దేశ్యాల అనుసారం తగిన శిక్షలు విదించాల్సిన అవసరం ఉంది .
కనీసం ఒక్క పిల్ల వాణ్ణి కని పెంచే తీరిక లేని బ్రతుకు కోసం ,తెగ కష్ట పడిపోతున్న ఓ నవ నాగరిక తల్లితండ్రుల్లారా ! మీకు మాత్రుత్వపు అనందం గురించి కాని ,పిత్రుత్వపు అనుబందం లో ఉండె మాదుర్యం విలువను గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకని ఆనందపు క్షణాలు వదులు కున్నాకా ,ఎంత సంపాదిస్తే ఏమిలాభం . మీ లాంటి తల్లి తండ్రులకు పుట్టడమే నిజంగా మోక్షజ్ణ లాంటి చిన్నారులు చేసుకున్న దురదృష్టం . అందుకే మోక్షజ్ఞే కాదు అలాంటి చిన్నారులు అందరూ దురదృష్ట జాతకులే .
మరింత సమాచారం కోసం క్రింది వీడియోను చూడవచ్చు
(29/12/2014 Post Republished).
Comments
Post a Comment