తెలిసినోడే కదా అని అతని బైక్ ఎక్కితే, అతనికి తెలిసినోళ్ళతో కలిసి "గాంగ్ రేప్" చేసాడట!
నిర్భయ కేసు తర్వాత కూడా మ్రుగాళ్ళలో పరివర్తన రావడం లేదు సరే, కానీ ఆడపిల్లల స్వీయ రక్షణ విదానాలలో మార్పులు రాక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా మెట్రో పాలిటన్ సిటి కల్చర్ ఒఆ లో కొంత విపరీత పోకడ విదానం ఆడపిల్లల్లో ఉన్నదని చెప్పక తప్పదు నిన్న గుర్గావ్ లో జరిగిన ఉదంతం వింటుంటే.
మొన్న డిల్లీ దగ్గర గుర్గావ్ లో ఒక పందొమ్మిది ఏండ్ల అమ్మాయి, మిత్రుల బర్త్ డే పార్టీకి వెల్లిందట.అర్దరాత్రి దాక పార్టీలో గడిపి ఆ పై ఒంటరిగా ఇంటికి బయలు దేరిందట . ఆమె ఇంటికి అర్దరాత్రి నడుచుకుంటూ వెళుతున్న సమయం లో , బాగా పరిచయమున్న వాడు ఒకడు బైక్ మీద వెళుతూ 'లిఫ్ట్" ఇస్తాను అంటే సరేలే అని ఎక్కి కోర్చుందట. ఇంకేముంది షరా మామూలే . వాడు ఒఆ అమ్మాయిని తిన్నగా వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్ళ కుండా తన మిత్రుడు కు చెందిన ఒక ఆపీస్ బిల్డింగ్ దగ్గరకు తీసుకు వెళ్లాడట. తీసుకు వెళ్లి ఊరుకున్నాడా, అంటే లేదు అక్కడ అతని మిత్రులు ఇద్దరూ, ఇతను కలసి ఆ అమ్మాయిని మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగమని బలవంతం చేసారట. ఆ అమ్మాయి బలవంతంగా తాగిందట. ఆ తర్వాత కదా మామూలే . మత్తు వదిలే సరికి మాన భంగానికి గురైనట్లు తెలుసుకుని పోలీసులకు పిర్యాదు చేస్తే వారు కూడా యదాప్రకారం వారి మీద నిర్భయ కేసు పెట్టి విచారణ చేస్తున్నారు.
తరచుగా జరుగుతున్నఈ ఉదంతాల ద్వారా మనకు అర్దమవుతుంది ఏమిటంటే "నిర్భయ " చట్టం అంటే కొంతమంది మ్రుగాళ్లకు ఎలా భయం లేదో, "నిర్భయ " ఉదంతాలు జరుగుతున్నా కూడా కొంత మంది ఆడపిల్లల ప్రవర్తనలలో మార్పు రావడం లేదు. బయం ఉంటే ఒక ఆడపిల్ల ఒంటరిగా పార్టీలకు వెళ్లి, ఇంటికి అర్దరాత్రి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుందా? ఎవడో పరిచయ మున్న వాడు బైక్ ఎక్కించుకుని ,ఒఆ వేరే దారిలో తీసుకు వెళుతుంటే కిమ్మనకుండా ఉంటుందా? ముక్కూ ముఖం తెలియని వాళ్ళు, అనుమానా స్పద పరిస్తితిలో అర్దరాత్రి కూల్ డ్రింక్ ఆఫర్ చెస్తే తాగుతుందా? బలవంతంగా తాగించారని ఆమె అంటున్నా , ఆమె వస్తుంది పార్టీ నుంచే కాబట్టి ఆమె చెపుతున్నది అంతా నిజం కాక పోవచ్చు. ఏది ఏమైనా "రేప్" ఈస్ "రేప్" కాబట్టి రేపిస్ట్ లను వదిలే ప్రసక్తే ఉండదు. వారు శిక్ష అనుభవించి తీరు తారు. కానీ స్వీయ రక్షణా పద్దతులు అవలంబించకుండా , అంతా అయిపోయాక ఏడవడం కంటే జాగర్తలు తీసుకోవడం మంచిది.
ఏ విషయానికైనా సంచలనం తో కూడిన స్పందన కొన్నాళ్ళే ఉంటుంది. రోజూ ఇలాంటి ఉదంతాలే వింటుంటే ఆ.. ఆ అర్దరాత్రి ఒంటరిగా తిరిగే వాళ్ళకీ బుద్ది లేదు, వాళ్ళను పాడు చేసే వాళ్ళకీ లేదు , అని అందరిని ఒకే గాట కట్టె స్తాయికి వస్తుంది సమాజం. అప్పుడు దొంగ తనం కేసు లు లాగానే "మాన భంగం " కేసులు ను పరిగనిస్తారు. చివరకు స్త్రీ శీలం ఒక మామూలు ఆస్తి గానే మారి పోతుంది.అంటే ఒఆ నాడు, ఈ నాడు, ఏ నాటికైనా స్త్రీ ఒక ఆస్తి మాత్రమే , అస్తిత్వం ఉన్న వ్యక్తీ కాదు అని నిరూపించబడుతూనే ఉందన్న మాట. మరి అలా జరుగ కూడదు అంటే ఏమి చెయ్యాలి? ఆలోచించండి.సమాజం లో నైతిక విలువలు ఉన్నంత కాలమే స్త్రీకి రక్షణ . 'మగవాళ్ళలో మార్పు రావాలి' అనే రోటీన్ డైలాగ్ వదిలేసి"మన అలోచనా విదానం లో మార్పు . రావాలి" అనే నూతన విదానం తో కొన్ని కట్టు బాట్ల తో కూడిన జీవనానికి అలవాటు పడేలా మనల్ని మనం మలచుకోవాలి. దీనికి కొంత సమయం పడుతుంది . అప్పట్టి దాక కఠిన శిక్షలతో మ్రుగాళ్ళను కొంత కంట్రోల్ చేస్తూ, స్త్రీలు కూడా విశ్రుంఖల స్వేచ్చా విదానాలు కాక, సమాజ పరిస్తితులు అనుసరించి, స్వీయ రక్షణ చర్యలు అవలంబిస్తే మంచిది.
ఒక మెరుగైన సమాజ నిర్మాణం కోసం నైతిక విలవలు తో కూడిన జీవన విదానం అవలంభించటం మన విది.
(1/11/2013 Post Republished)
Comments
Post a Comment