ఆకాశంలో సగం , అవినీతిలో ఆసాంతం అన్నందుకే ఆ 3 మహిళా సర్పంచుల చెక్ పవర్ రద్దు చేశారా?!!
(1). భద్రాచలం డివిజన్ లోని చర్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా జ్యోతిర్మయి గారు 44 లక్షల పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారట. అందుకు బాద్యుడు అయిన పంచాయతీ కార్యదర్శి పేరు దేవరాజ్ .
(2). వాజేడు మండలం చెరుకూరు గ్రామ సర్పంచి అరుణ గారు 10. 30 లక్షల నిధులు దుర్వినియోగం చేశారట . దానికి బాద్యుడిగా పంచాయితీ కార్యదర్శి బాబురావు ఉన్నారు అట .
(3). అశ్వారావు పేట మండలం ఉట్లపల్లి గ్రామ సర్పంచ్ వీరకుమారి గారు 3. 25 లక్షల నిధులు దుర్వినియోగం చేయగా దానికి బాద్యుడిగా పంచాయతీ కార్యదర్శి దొడ్డా ప్రసాద్ ఉన్నారట.
విద్యా , ఉపాధి రంగాల్లో స్త్రీలు పురుషులు కంటే ఎక్కువ ప్రతిభను చూపుతూ ముందుకు చొచ్చుకుని పోవటం ఒకవైపు సంతోషం కలిగిస్తుంటే , ఇలా రాజకీయ రంగంలో స్త్రీలు పురుషులను మించి పోయి అవినీతికి పాల్పడటం విచారించదగిన విషయమే. జిల్లాలో ఎంతో మంది సర్పంచ్ లు ఉండగా కేవలం మహిళా సర్పంచ్ లే అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లభించడం చూస్తుంటే , వారికి పాలన మీద ఉన్న పట్టు , పంచాయతీ లెక్కల నిర్వహణలో లేనట్లు తెలుస్తోంది. పురుష సర్పంచ్ లు ఉన్న చోట్ల పంచాయతీ సెక్రటరీలు లెక్కలు విషయం లో కరెక్టుగా ఉంటారు కాబోలు. అదే మహిళా సర్పంచ్ లు అయితే గోల్ మాల్ చేసినా తెలుసుకోలేరులే అనే ధీమా కాబోలు.
ఏది ఏమైనా ఆకాశం లో సగం కావాలనుకునే వారు , ఇలా అవినీతిలోమాత్రం ఆసాంతం వారికే అన్నట్లు నిధుల దుర్వినియోగానికి పాల్పడడం విచారించ దాగిన విషయం.
Comments
Post a Comment