కబేలాలలో చంపబడుతున్న ఆవుల ఉసురు , ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులుకు తగులుతుందా?
మనిషి తన అవసరాల కోసం కొన్ని రకాల జంతువులు మీద అదారపడడం అనాదిగా వస్తున్నదే. మన సమాజం ప్రాదమికంగా వ్యవసాయం మీద ఆదారపడింది కాబట్టి, వ్యవసాయం లో తనకు సహాయం చేసే ఆవులు వాటి సంతతితిని పూజించడం అనేది అలవాటు చేసుకున్నాం . నూటికి 80% మంది వ్యవసాయదారులుగానో , వ్యవసాయం మీద ఆదారపడిన వారిగానో జీవిస్తున్నాం కాబట్టి , మనకు పాలిచ్చి మన ఆరోగ్యాన్ని , కోడె దూడలను ఇచ్చి మన వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్న గో సంతతితిని పూజించడం లో రైతుల కనీస ధర్మమే తప్పా వేరేది కనపడదు. ఇదే సూత్రం బర్రెలకు కూడా వర్తిస్తుంది. అందుకే సంక్రాంతి తర్వాతి రోజును "కనుమ" పండుగను ప్రత్యేకంగా "పశువ...