కబేలాలలో చంపబడుతున్న ఆవుల ఉసురు , ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులుకు తగులుతుందా?

                                                                         

                                             మనిషి తన అవసరాల కోసం కొన్ని రకాల జంతువులు మీద అదారపడడం అనాదిగా వస్తున్నదే. మన సమాజం ప్రాదమికంగా వ్యవసాయం మీద ఆదారపడింది కాబట్టి, వ్యవసాయం లో తనకు సహాయం చేసే ఆవులు వాటి సంతతితిని   పూజించడం అనేది అలవాటు చేసుకున్నాం . నూటికి 80% మంది వ్యవసాయదారులుగానో , వ్యవసాయం మీద ఆదారపడిన వారిగానో జీవిస్తున్నాం కాబట్టి , మనకు పాలిచ్చి మన ఆరోగ్యాన్ని , కోడె దూడలను ఇచ్చి మన వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్న గో సంతతితిని పూజించడం లో రైతుల కనీస ధర్మమే తప్పా వేరేది కనపడదు. ఇదే సూత్రం బర్రెలకు కూడా వర్తిస్తుంది. అందుకే సంక్రాంతి తర్వాతి రోజును "కనుమ" పండుగను ప్రత్యేకంగా "పశువుల పండుగ " గా పరిగణించి ఇంట్లో పశువులకు పూజలు చేస్తుంటాం. అలాగే కొత్త గా ఇండ్లలోకి వెళ్ళేటప్పుడు ఆవును తీసుకుని వెళ్ళడం మన సాంప్రదాయం. అలాగే మన ఇండ్లను కాపలా కాసే "కుక్క" కోసం కూడా ఒక పండుగ ఉంది మనకు. దానినే"కోరల పున్నమి " లేక  "కుక్కల పండుగ" అంటారు పల్లెటూళ్ళలో . ఆ రోజు ముఖం కడ్డుకోగానే ముందుగా చేసే పని , కుడుములు కొరికి కుక్కలకు వేయడం . ఆ తర్వాతే తతిమ్మా పనులు చేసుకోవడం ఇవ్వన్నీ మనం ఎవరి విశ్వాసాలకు వ్యతిరేకంగానో చేయడం లేదు. అనాదిగా వస్తున్నా మన జీవన విదానం లో బాగంగా మనకు అన్ని విదాల సహాయం చ్ఝేస్తున్న జంతువులకు కృతజ్ఞతా పూర్వకంగా చేసే క్రియలే.

                      వ్యవ సాయదారుడు వివిధ రకాల జంతువులను పెంచుతుంటాడు. వాటిలో ఆవు, బర్రె లాంటి జంతువులను పాడి కోసం, వ్యవసాయం కోసం అయితే , గొర్రె, మేక లాంటి జంతువులను, కోడి లాంటి వాటిని మాంసం కోసమే పెంచుతారు. మాంసం కోసం పెంచే జంతువులను ఇంటి వినియోగానికి పోను మిగతా వాటిని మార్కెట్ కి అమ్మి సొమ్ము చేసుకుంటాడు. కాని ఆవులను , బర్రెలను మాత్రం మాంసం కోసం పెంచడం అనేది భారతీయ రైతు కుటుంబాలలో జరగని పని. నాకు తెలిసినంతవరకు , సాంప్రదాయ రైతులు ఎవరూ ఆవులను, బర్రెలను వ్యవసాయదారులకి , పాలకోసం కొన్నుకునే వారికి తప్పా , కటిక వాడికి అమ్మరు. అలా అమ్మటం "మహా పాపం " గా బావిస్తారు. నా చిన్న తనం లో నేను స్వయంగా చూసాను. మాకెంతో ప్రీతి పాత్రమైనవి, తమ జీవిత కాలం మాకు వ్యవసాయం  లో ఉపయోగపడిన ఆవులను, ఎద్దులను, చివరకు బర్రెలు, దున్నలను కూడా ఉప్పు పోసి, మా బీడు భూమిలో సమాధి చేసిన సంఘటనలు చూసాను. ఇది  సాంప్రదాయక రైతుకు ఇంటి జంతువుల మీద ఉండె కృతజ్ఞతా బావం. 

         ఇంతకి నేను చెప్పేది ఏమిటంటె ప్రతి జీవికి "ఉసురు "  అనేది ఉంటుంది. అన్యాయంగా హీంసించబడినా లేక హతమైన వేళలో ఆ ఉసురు కు కారణమైన వారికి అది తప్పకుండా తగిలి తీరుతుంది. మనం ఏ ఉద్దేశ్యంతో జంతువులను  పెంచుతున్నామో , ఆ ఉద్దేస్యం కి అనుగుణంగా వాటి పట్ల ప్రవర్తిస్తే వాటి "ఉసురు " మనకు తగలకుండా ఒక రక్షణ కవచం లా కాపాడుతుంది. ఆవులు లాంటి జంతువులను మాంసంకోసమే పెంచి , వాటిని కోసుకు తినే వారికి, అమ్ముకునే వారికి వాటి ఉసురు తగలకపోవచ్చు. అలాగే జంతువులను వధించడమే  వ్రుత్తి గా చేపట్టిన "కటిక వాడికి " ఆ ఉసురు తగలక పోవచ్చు. ఆవు మాంసం తినడమే అలవాటుగా పెట్టుకున్న వారికి ఆ ఉసురు తగలక పోవచ్చు. కాని ఆవులను , వాటి సంతతిని బలంగా ఉన్నంత కాలం తన ఇంటి అవసరాలకు , వ్యవసాయ అవసరాలకు వాడుకుని, వట్టి పోయిన  వేళ , లేక వ్యవసాయ పనులకు పనికి రాని  నాడు, డబ్బు కోసం , కబేలాలకు అమ్మి వేసే రైతులకు మాత్రం తప్పకుండా వాటి "ఉసురు" తగిలి తీరుతుంది. అందుకే "గో హత్య" మహా పాపం అని మన పెద్ద వాళ్ళు చెప్పింది. వాటి ఉసురు మన రైతు కుటుంబాలకు తగలకూడదనే , వాటికి పూజలు చేయడం అలవాటు చేసింది. 

     వ్యవ సాయం లో  యాంత్రీకరణ పద్దతులు వచ్చినప్పటికి , మన రైతులు విదేశాలలో మాదిరి మాంసం కోసం గోవులను పెంచే దౌర్బాగ్య స్తితికి రాలేదు. కాని అజ్ఞానంగా మనం "అమ్మ " లా పూజించే ఆవులను మాత్రం అవసరం తీరాక కబేలాలకు అమ్మే దుస్తితికి దిగజారారు. అవునులే , కనీ పెంచిన అమ్మ , బాబులను ,వ్రుదాప్య దశలో వీదులలో వదిలేస్తున్న కొడుకులు పుట్టుకొస్తున్న సమాజం లో , ఆప్ట్రాల్ ఆవులను గురించి పట్టిచుకునేది ఎవరు? ఎవరైనా పట్టిమ్చుకుంటె , వాటి మాంసం కోసం ఉవిల్లు ఊరేవారు , అలా ఉవిళ్ళు ఉరేవారి ఓట్ల కోసం ఆరాటపడెవాల్లూ , పట్టించుకునే వారిని మత వాదులు అని, చాందసులు అని వెర్రి మొర్రి కూతలు కూస్తూ గలాటా చేస్తున్నారు. కాని  , మాంసం కోసం పెంచబడని ఆవులు , అన్యాయంగా కబేలాలో హతమవుతుంటె , వాటి "ఉసురు" , తమ చావుకు కారణమైన రైతులను "ఆత్మహత్యల " రూపం లో బలి తీసుకుంటుంటె , ప్రాంతాలు ప్రాంతాలే కరువు కాటకాల బారిన పడుతుంటే , సదరు ఆత్మ హత్యలు నుంచి, కరువు కాటకాల నుంచి రైతులను కాపాడేది ఎవరు? వీటికి గో హత్యలను ఆపడమే సరి అయిన మార్గం. 

                                     గోవులను పూజించే ఈ  పుణ్య  భూమిలో వాటిని వధించడం మహా పాపం. వాటి మాంసం కోసం ఆరాట పడె వారికోసం, వాటిని వదించడం ఈ  దేశం  లో జరుగ రాదు. ఒకవేళ వాటికి అలవాటు పడిన వారు ఉంటె  ఇతరదేశాల నుండి  తెప్పించు కోవడమే ప్రత్యామ్నాయం . గోవులను చంపడం  అంటే ఇక్కడి మెజార్తీ ప్రజల మనోబావాలను తీవ్రంగా గాయపరచినట్లే. గో హత్య చేసే వారు మాకు రాక్షసులు క్రింద లెఖ్ఖ. ఈ గడ్డ  మీద గో హత్యలు చేయించి వాటి ఉసురు కొట్టుకోవడానికి ఇక్కడి మెజార్తీ ప్రజలు సిద్దంగా లేరు. అందుకే గోవద నిషేదానికి తూట్లు పొడుస్తున్న వారి ఆగడాలను అడ్డుకుంటుంది. భారత దేశం ప్రజాస్వామ్య దేశం అనేది నిజమైతే , ఇక్కడి మెజార్తీ ప్రజల మనోబావాలను గౌరవించి తదనుగుణంగా నడచుకోవడం అందరికి మంచిది. లేకుంటే " గోవుల ఉసురు" ఇంకా ఎంతమందిని బలిగొంటుందో ఆలోచించండి 

జై గోమాత !                                                                                              జై జై గోమాత !!



Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం