అమరావతి భారతదేశ రెండో రాజధాని కానుందా!?

                                                                       

                       
                                         అమరావతి ! నవ్యాంద్ర నూతన రాజధాని! రేపు విజయదశమి నాడు గుంటూర్ జిల్లా, తుళ్ళూర్ మండలంలోని ఉద్దండ రాయుని పాలెంలో, అమరావతి నగర నిర్మాణానికి, భారత దేశ ప్రియతమ ప్రధానమంత్రి గారైన శ్రి నరేంద్ర మోడి గారి చేతుల మీదుగా శంకుస్తాపన జరుగనుంది. ఇదేదో మాములు ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా అత్యంత వేడుకగా, యజ్ణ హోమాది క్రతువులతో పాటు, సర్వ మత ప్రార్దనలతో, అనేక మంది జాతియ, అంతర్జాతీయ అధికార, అనధికార ప్రముఖుల సమక్షంలో దూం దాం గా జరుగుతున్న కార్యక్రమం. దీనిని కేవలం ఒక రాష్ట్ర రాజధాని శంఖుస్తాపన కార్యక్రమం అనుకునేలా కాకుండా, ఒక జాతీయ స్తాయి రాజధాని నగర శంఖుస్తాపన కార్యక్రమం అని తలపించేలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహింస్తుంది, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం.

            కేవలమ్ ఒక రాష్ట్ర  రాజధాని నగర నిర్మాణం కోసమే అయితే, ఆ రాష్ట్రం లోని పుణ్యనదీ జలాలు, పుణ్యక్శేత్రాల నుండి మట్టి ని తెప్పిస్తే సరి పోతుంది అనుకుంటా. కాకపోతే హిందూ దేశం లోని పుణ్య  నది  జలాలు కూడా తెప్పించవచ్చు. కాని" మన మట్టి, మన నీరు, మన రాజ ధాని పేరుతో   అన్ని రాష్ట్రాలనుండి, పుణ్య  నదుల జలాలు, మట్టి సేకరించి, అమరావతి శంకు స్తాపన ప్రాంగణానికి తరలించి పూజలు నిర్వహించడానికి సంకల్పించారు అంటే, ఈ కార్యక్రమం కేవలమ్ మానవ సంకల్పం తో జరుగుతున్నది కాదని, దీని వెనుక ఏదో మహతరమైన దైవ సంకల్పం ఉండి, నవ్యాంద్ర నాయకుల చేత ఇంత గొప్ప కార్యక్రమం చేయిస్తుందని నాకు అనిపిస్తుంది.

  అమరావతి రాజధాని శంఖుస్తాపన కోసం ఎంపిక చేసిన ప్రాంతం, మాములు సాదా సీదా ప్రాంతం ఏమి కాదు. చరిత్ర పునరావ్రుతం అవుతుంది అనే సిద్దాంతమే నిజమయితే, మళ్ళి తెలుగువారి ప్రతిభా పాటవాలు ప్రపంచ వ్యాప్తంగా చాటాడా నికే "అమరావతి" నగర నిర్మాణం రూపుదిద్దుకుంటుంది అనేది కూడా నిజమై తీరాలి. ఒకప్పుడు ధాన్యకటకమ్ పేరుతో రాజధాని నిర్మాణం సలిపి, క్రిష్ణా నది తీరం నుండి  భారతం లోని చాలా ప్రాంతాలను ఏలిన తొలి తెలుగు చక్రవర్తులు అయిన శాతవాహనులు పాలన సాగించింది ఈ ప్రాంతం నుండె. నాటి ధాన్యకటకమ్ లేదా ధరణి కోట అనే ప్రాంతం నేటి అమరావతి ప్రాంతం ఒకటే. కాకపోతే నాడు ధాన్యకటకం అని పిలువబడితే నేడు అమరావతి అని పిలువబడుతుంది. అంతే తేడా . అసలు నవ్యాంద్ర రాజధాని నగరానికి అమరావతి అనే పేరు పెట్టాలనే సంకల్పం అంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి కలుగడం, అట్టి నగర నిర్మాణ శంఖు స్తాపనను  శ్రీ నరేంద్ర మోడి గారి చేత చేయించడం వెనుకాల ఖచ్చితంగా "దైవ సంకల్పం " ఉంది అని చెప్పగలను.
                                                                                   
 
                                          కాబట్టి ప్రస్తుత విషయానికి పరిమితమైతే, భారత దేశానికి రెండొ రాజధాని అనేది బౌగోలిక బద్రతా ద్రుష్ట్యా అవసరమని డాక్టర్ బాబా సాహెభ్ అంబేద్కర్ చెప్పారు. దానికి అనువైన ప్రాంతం  నాటి ఆంద్ర ప్రదేశ్, నేటి తెలంగాణా  రాజధాని హైద్రాబాద్ అనువుగా ఉంటుందని చెప్పారు. అయితే అప్పట్లో ఒక ప్రత్యేక రాజ ధాని నగర నిర్మానం చేయడమ్ భారి ఖర్చుతో కూడుకున్న పని కా బట్టి, అప్పటికే జాతీయ రాజధాని స్తాయిలో ఉన్న హైద్రాబాద్ ను భారత రెందో రాజధాని చేస్తే అన్ని విదాల బాగుంటుందని "అభినవ మనువు" ఆశించారు.

                                              కాని లక్షల రూపాయల కోట్ల బడ్జెట్ అంచనాలతో, ప్రపంచం లో పేరెన్నిక గన్న నగరాల సరసన దీటుగా నిలబడేలా ఉండే ఒక మహా నగర నిర్మాణాని ఆంద్ర ప్రదేశ్ రాజధాని కోసం నిర్మిస్తున్నప్పుడు బవిశ్యత్ లో అదే భారత దేశపు రెండో రాజధాని కావడానికి సర్వ విదాల యోగ్యమైనది. అంబేద్కర్ గారు జీవించి ఉంటే ఇదే మాట అని ఉండెవారెమో! చారిత్రకంగా చూసినప్పుడు దక్కన్ రాజులు హైద్రాబాద్ నుండి పరిపాలన సాగించినప్పట్కి, ఆంద్ర శాతవాహనుల శౌర్య పరక్రమాల ముందు వారు తక్కువే. దీనికి ఆ యా రాజులు నివసించే స్తల లేదా  కోటల ప్రబావం  ఉంటుందని వాస్తు పండితులు  చెపుతుంటారు. ఆ విదంగా చూసినప్పుడు హైద్రాబాద్ కంటే, అమరావతి కే స్తలప్రభావ  బలం ఎక్కువ అనిపిస్తుంది. అదీ కాక పైన చెప్పినట్లు పేరుకు రాష్ట్ర రాజ ధాని అయినా, జాతియ రాజధాని నగర నిర్మాన స్తాయిలో  బడ్జెట్ , ఇతర అంచనాలు ఏర్పాట్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వారు కూడా అమరావతి నగర నిర్మాణ బాద్యతను పూర్తీగా తాము చేపట్టి, ప్రమ్పంచం లోనే ఒక మేటి నగరంగా తీర్చి దిద్దితే ఖచ్చితంగా  రాబోవు రోజులలో "అమరావతి " ఇండియాకి రెండో రాజధాని అయ్యే అవకాశాలు ఎక్కువ .

   ఏది ఏమైనా నాకు సుమతి పద్యాలలోని పద్యం ఒకటి గుర్తుకు వస్తుంది. "పామరుడు తగని హేమంబు కూడబెట్టిన భూమీశుల   పాలు చేరు భువిలో సుమతి " అని  దేశం లోని ఒక రాష్ట్ర  స్తాయికి మించిన మరియు ప్రపంచం లోనే మేటి అయిన నగర నిర్మాణం  చేస్తున్నామని నాయకులు మురిసిపోయే ముందు , భారత దేశ రెండో రాజధానికి ప్రపోసల్ గా తెలుగు ప్రాంతం  లోని హైద్రాబాద్ నగరం ఉందని, దాని తలదన్నే స్తాయిలో ఆధునిక నగర నిర్మాణం జరిపితే బవిష్యత్ లో హైదరాబాద్ కు ఉన్న ప్రతిపాదన అమరావతి వైపు మారలే అవకాశం ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి. ఒకవేళ దైవ సంకల్పం అదే అయితే ఎవరూ ఏమి చేయలేరు కాని, పాపం, రాజధానులను త్యాగం చేయడం తమకు వారసత్వం గా వస్తుందని వాపోతున్న నవ్యాంద్రులు మరొక మారు నిరాశకు గురి కాక తప్పదు .

     అందుకే ఎందుకైనా మంచిది "అమరావతి " ని 50,000 ఎకరాలలో భారిగా నిర్మించాలి అనుకుంటే ,బవిష్యత్ దృష్ట్యా  దాని నిర్మాణ బాద్యత అంతా కేంద్రం  వారికే అప్పచెపితే మంచిది.ఒక వేళ అది భారత దేశ రాజధానిగా తీసుకున్నా నష్టం ఉండదు. తర్వాత నూజివీడు , మైలవరం మద్య నవ్యాంద్ర రాజధాని కట్టుకోవచ్చు.  లేదు అనుకుంటే ప్రతిపక్ష నాయకులు కోరుతున్నట్లు 10,000 ఎకరాలలో అన్ని హంగులతో "ఆధునిక అమరావతి " నగరం నిర్మిస్తే నవ్యాంద్రా రాష్ట్రానికి అన్ని విదాల  సరి పోతుంది. కీడెంచి మేలెంచడం అన్ని విదాల స్రేయస్కరం.

     విజయ దశమి వేళ  చరిత్రలో మరపు రాని  విదంగా  నవ్యాంద్ర రాజధాని  "అమరావతి " నగర శంకు స్తాపన మహోత్సవం  జరుపుకుంటున్న  తెలుగుసోదరులు  అందరికి శుభాభి నందనలు.



          

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

N.T.R. గారిని "హిందూ జీవన విదానానికి" దూరం చేసిందెవరు?