గుడిలో ఇలాంటి "గుడి చేటు " పనులు చెయ్యడం నేరం కాదా?
వారు యువతీ యువకులు . ఇద్దరూ గుడికి అంటే శివాలయానికి వచ్చారు. అక్కడ అమ్మాయి గుడి అంతరాలయం వెలుపల ఉంది. అబ్బాయి లోపల ఉన్నాడు. అమ్మాయిని లోపలికి రమ్మని బలవంతపెడితే లోపలకు అంటే అంతరాలయం లోకి వచ్చింది. అక్కడ అతను ను ఆ అమ్మాయి నుదిటి మీడ బొట్టు పెట్టినట్లు పెట్టి అదే ఉపులో ఒక ముద్దు కూడ పెట్టి తన తమకం తీర్చుకున్నాడు. వారిద్దరూ భార్యాభర్తలు కాదు అనేది స్పష్టం ఎందుకంటే భార్య భర్తల మద్య అలా గుడిలో ముద్దులు పెట్టుకోవాలనే ఆత్రపు కోరికలు ఉండవు. పోని ప్రేయసి ప్రియులు అయినా , తమ కోరికలు తీర్చుకోవడానికి గుళ్ళను ఎన్నుకోవడం తగని పని. ఏ రకంగా చూసినా వారు ముక్యంగా ఆ అబ్బాయి చేసిన పని మత విశ్వాసాలను గాయపరచే పనే. ఇది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకార ం నేరం కూడా .
కాని విచిత్రం ఏమిటంటే యూ ట్యూబ్ లో ఈ వీడియో మీద కామెంట్ చేసిన వారిలో అధిక శాతం వీరు చేసిన పనిని సమర్దించారు.తప్పు చేసిన వారికన్నా , వారి చేష్టలను సమర్దించే వారే నిజమైన నేరస్తులు . ఏ పని ఎక్కడ చేయాలో అక్కడె చేయాలి. తీట కోరికలు తీర్చుకోవడానికి గుళ్ళను ఎంచుకునే ఏ పని అయినా, గుడి నియమాలకు చేటు కలిగించేవే. అవి కచ్చితంగా నేరాలే. కాదంటారా? పూర్తీ వివరాలకు క్రింది వీడియోను చూడండి.
Comments
Post a Comment