నాగు పాము మహిమలను స్వయంగా వీక్షించిన మా తల్ల్లి తండ్రులు
నాగు పాములకు ఎటువంటి విశిశ్టతలు ఉండవు, అది ఒక విష జీవి అంటారు. ఒక వేళ నేను ఎప్పుడూ అబద్దం ఆడటం ఎరుగని మా తల్లితండ్రుల ద్వారా వారి స్వానుభవాలు విని ఉండక పోతే నేను అలాగే అనుకుని ఉండేవాడినేమో! ఏది ఏమైనా నాగు పాములు కి మన తెలుగు జాతికి ఒక అవినాబావ సంబందం ఉంది. మనం నాగజాతికి చెందిన వారం అని చెపుతారు. అలాగే మన దేవదేవుల్లైన విష్ణువు, శివుడు ఇద్దరికీ నాగ దేవత, ఆదిశేషుడు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉంటూ ఆరాద్య దైవలలో ఒక రయ్యారు. అందుకే తెలిసిన వారెవరూ నాగు పాములను హీంసించటానికి కానీ, చంపటానికి కానీ ఇష్ట పడరు. పైగా దీపావళీ వెళ్ళిన నాలుగవ రోజును "నాగుల చవితి" గా నిర్ణయించి ఆ రోజు తెలుగింటి ఆడపడచులు ఆ నాగేంద్రుని బక్తిశ్రద్దలతో కొలచి , నాగ జాతి పట్ల తెలుగు జాతికి ఉన్న భక్తీ పరంపర ను చాటుకుంటారు . ఈ రోజు నాగ చతుర్దీ. మనవు తెలుగు బ్లాగు మిత్రులకు, వీక్షకులకు , అగ్గ్రిగ్రేటర్లకు నాగుల చవితి పండగ శుభాకాంక్షలు తెలియ చేస్తూ, నాగేంద్రుని మహిమలు గురించి గతం లో పోస్ట్