సోనియాజీ తో గేమ్స్ ఆడితే రెండుగా విడిపోవాల్సిందే !
"మంచీ చెడు తెలిసి కూడ చెప్పలేని పెద్దలు ఎవ్వరికీ ఏమీ కారు, ఏమీ చెయ్యలేరూ " అన్నాడో సినీ కవి. చెప్పక పోతే చెప్పక పోయారు, కనీసం తమకేమి అవసరం లేదని ఊరుకున్నారా అంటే అదీ లేదు . మీరిస్తే మాకేమి అబ్యంతరం లేదని సన్నాయి నొక్కులు నొక్కారు . తీరా వీరు చెప్పేది ప్రజలందరి అభిప్రాయమే అనుకుని తెలంగాణా ఇవ్వడానికి సిద్ద పడుతుంటే ఇప్పుడు దానిని ఆపటం ఎలాగా అని మల్లగుల్లాలు పడుటున్నారు. వీరిని చూస్తుంటే ఎదో సినిమాలో బ్రహ్మానందం గారి డైలాగ్ లు గుర్తుకు వస్తున్నాయి. "ఖాన్ తో గేమ్స్ అడకు శాల్తీలు లేచి పోతాయి " అని ఒక పంచ్ డైలాగ్ ని ఊత పదం గా వాడుతుంటాడు . ఇక్కడ తెలంగాణా విషయంలో మింగలేక...