అన్నదమ్ములుగా విడి పోదాం! బావా బామ్మార్దులు లా కలసి ఉందాం!
"అన్నదమ్ములు చావు కోరు, బావ బామ్మార్దులు బ్రతుకు కోరు" అని జన ఉవాచ. అలాగే ఉంది మన తెలంగాణా సీమాంద్ర రాజకీయ,ఉద్యోగుల, విద్యార్దుల పరిస్తితి. ఎందుకంటే అన్న దమ్ములు మద్య రక్త సంబందం తో పాటు ఆస్తులు మీద హక్కులు లాంటివి ఉంటాయి. వారిలో అర్దిక పరమయిన విబేదాలు లేనంత కాలం ఎటువంటి సమస్యను అయినా వారు సునాయాసంగానే పరిష్కరించుకోగలుగుతారు.వారిలో ఉండే సహజ రక్త సంబందం అందుకు దోహదం చేస్తుంది. కానీ ఒక్క సారి ఆర్దిక పరమయిన ఆసక్తులు వారి మద్య బేదాలుకు కారణాలు అయితే బేదాభిప్రాయాలు సమసిపోవడం అంత సుళువు కాదు.రాజ్యాల కోసం అన్న దమ్ములు కుత్తుకలు కత్తిరించిన చరిత్ర మనిషిది. ఆస్తులు కోసం శాశ్వత శత్రువులుగా మారీ ఆ శత్రుత్వ వారసత్వాన్ని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న కుటుంబాలు మన గ్రామీణ భారతంలో కో కొల్లలు.వీటన్నిటికి మూల కారణ