పద్దతులు ఫారెనువి అయినా,బుద్దులు ఇండియావే గదా!
నేను నిన్ననే టి.వి లో ఒక ప్రత్యక్ష ప్రాసరం చూసాను. పాపం ఎవరో ఒక అమ్మాయి బాగ చదువుకున్న దానిలా ఉంది.ఒకటే వెక్కి, వెక్కి ఏడుస్తుంది. ఏడుస్తూనే తనకు జరిగిన అన్యాయం గురించి ప్రేక్షక లోకానికి వివరిస్తుంది.ఏమిటా పాపం ఆ విదంగా ఏడుస్తుంది, ఏమి జరిగి ఉంటుందా అనే కుతుహలంతో అంఏ చెప్పేదానిని, శ్రద్దగా ఆలకించటం జరిగింది. ఇంతకి కథ ఏమిటంటే అమే(ఏడ్చే అమ్మాయి), ఆమే గారి బాయ్ ఫ్రండ్ ఒకరినినొకరు ఇస్టపడి, ఆ ఇష్టాని వివాహం వరకు తీసుకెళ్లాలంటే ఒకరినొకరు మరింతగా అంటే బాగా లోతుగా అర్థం చేసుకొవాడానికి ఫారెన్ పద్దతి అయిన డేటింగ్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని బావించి ఒక శుభముహుర్తాన ప్రొసీడ్ ఐయి పోయారు. ఇక్కడ ఒక విషయం మనం ముచ్చట్టించుకోవాలి. ఏమిటంటే మన సాంప్రాదాయం ప్రకారం వివాహానికి ముందు పెండ్లి చూపులు,తర్వాత నిశ్చయ తంబూలాలు లాంటి కార్యకమలతో ఇరువైపుల పెద్దల అంగీకారంతో పెండ్లి...