పద్దతులు ఫారెనువి అయినా,బుద్దులు ఇండియావే గదా!


                                                            

నేను నిన్ననే టి.వి లో ఒక ప్రత్యక్ష ప్రాసరం చూసాను. పాపం ఎవరో ఒక అమ్మాయి బాగ చదువుకున్న దానిలా ఉంది.ఒకటే వెక్కి, వెక్కి ఏడుస్తుంది. ఏడుస్తూనే తనకు జరిగిన అన్యాయం గురించి ప్రేక్షక లోకానికి వివరిస్తుంది.ఏమిటా పాపం ఆ విదంగా ఏడుస్తుంది, ఏమి జరిగి ఉంటుందా అనే కుతుహలంతో అంఏ చెప్పేదానిని, శ్రద్దగా ఆలకించటం జరిగింది. ఇంతకి కథ ఏమిటంటే

  అమే(ఏడ్చే అమ్మాయి), ఆమే గారి బాయ్ ఫ్రండ్ ఒకరినినొకరు ఇస్టపడి, ఆ ఇష్టాని వివాహం వరకు తీసుకెళ్లాలంటే ఒకరినొకరు మరింతగా అంటే బాగా లోతుగా అర్థం చేసుకొవాడానికి ఫారెన్ పద్దతి అయిన డేటింగ్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని బావించి ఒక శుభముహుర్తాన ప్రొసీడ్ ఐయి పోయారు.

  ఇక్కడ ఒక విషయం మనం ముచ్చట్టించుకోవాలి. ఏమిటంటే మన సాంప్రాదాయం ప్రకారం వివాహానికి ముందు పెండ్లి చూపులు,తర్వాత నిశ్చయ తంబూలాలు లాంటి కార్యకమలతో ఇరువైపుల పెద్దల అంగీకారంతో పెండ్లి కుదుర్చుకుంటారు.ఆ తరవాత వివాహం చేసుకుని, శొభనం అనే తంతుతో ఆలు మగలుని ఒకటి చేస్తారు. ఇది మన పద్దతి. ఇక ఫారెన్ పద్దతి అయిన డేటింగ్ అంటే పెండ్లికి ముందే అన్ని కానిచ్చేసి, ఆ తర్వాత అణ్ణిట్లో ఒ.కె అనుకుంటే పెండ్లి చేసుకుంటారు. లేదంటే లేదు.ఏదైనా సరే పద్దతులు సాంప్రాదాయలు ఆ యా ప్రజల నమ్మ్కాలు, వారు యేర్పరచుకున్న విలువలు బట్టి. ఇందులో ఒకరిది తప్పు ఒకరిది ఒప్పు అనటానికి వీలు లేదు.కాని సమస్య ఏమిటంటె ఒక పద్దతి పాటించి, మరొక పద్దతిలో పలితం ఆశిస్తే ఎలా?

  ఇక మన కథలోకి వస్తే, అమ్మాయి, అబ్బాయి ఒకనొకరు బాగా(?) అర్థం చేసుకోవాడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. తీరా ఫలితం ఏమిటంటే అభ్బాయి కష్టం అమ్మాయికి నచ్చింది కాని,అమ్మాయి కష్టం అబ్బాయికి నచ్చక ’నో’ అనేశాడు.అప్పటిదాక భవిష్యత్ ఫారెన్ స్వర్గం లోకాలో విహరిస్తున్న అమ్మాయికి ఒక్కసారిగ ఇండియా నరకంలోకి తోసేసినట్టైంది.తను భారతీయ స్త్రీ అని గుర్తుకు వచ్చింది. తన సహజ అస్త్రమైన ఏడుపు,పెడబొబ్బలు తో పెద్దమనుషులని ఆశ్రయించింది. పాపం వాళ్లు మాత్రం ఏమి చేస్తారు, అబ్బాయిని పిలిపించి పంచాయతి పెడితే ఆ కుర్రాడు, అమ్మాయికి చెప్పిందే వారికి చెఫ్పాడు ’నో’ అని. అయినా పెద్దలు విదించిన ౩ లక్షల పెనాల్టి కట్టడానికి సిద్దపడ్డాదు. దీనితో అమ్మాయికి ఆ పెద్దమనుషుల మీద ,సమాజం మీద విపరీతమయిన కోపం వచ్చి, " ఒక స్త్రీ శీలానికి విలువ కడతారా? (అప్పుడు గుర్తు వచ్చింది ఆ స్త్రీ మూర్తికి శీలం విలువ గురించి) అని సదరు టి.వి చానల్ వారి దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటే  వారు ఆమే బాదని లోకమంతా చూపిస్తున్నారు.అదీ కథ.

    ఇక అక్కడ్నుంచి ఫారెన్ డేటింగ్లతో సగం పోయిన  అమే పరువు, చాన్నెల్ల రేటింగుల కోసం సాంతం పోయింది. వారు ఒకరి తర్వాత ఒకరు చేసిన రిలే ప్రసారాలతో,అబాయి మీద ఒక చీటింగ్ కేస్ పెట్టగలిగారు తప్ప అమ్మాయిని అబ్బాయిని కలపలేక పోయారు. రేపు చట్టమైనా సరే అతన్ని శిక్షించవచ్చేమో కాని పెండ్లి  చేసుకొమ్మని  కట్టడి చేయగలదా ?మరి ఇక్కడ జరిగిందేమిటి? చివరకు మిగిలిందేమిటి? స్త్రీ శీలానికి వెల కట్టడం తప్ప!

  అసలు మనలోనే చాల మందికి మన పద్దతుల మీద గౌరవం ఉండటం లేదు. ఈ మద్య నిశ్చయ తాంబులాలే పెండ్లి చేసినట్టు చేసేస్తున్నారు . ఆ ఒక్కటి తప్ప అన్నీ పెండ్లికి ముందే చేస్తున్నారు. ఇది చూస్తున్న పిల్లలు వెర్రి ప్రాశ్చాత్య వ్యామోహంలో ఆ ఒక్కటి పూర్తిచేసే స్తాయికి ఎదిగారు. ఇక మన సినిమాలు, సాహిత్యాలు, అన్నీ భారతీయ విలువలను అపహాస్యం చేస్తూ విశ్రుంఖల స్వేచ్చే నిజమైన నాగరికతగా ఊదరగోడుతుంటే అదే నిజమనుకుంటున్నారు. కాబట్టి ఓ నవ నాగరికులార మీకు ఫారెన్ పద్దతుల మీద మోజుంటే హయిగా మీరు కోరుకున్న దేశానికి వెళ్ళి కోరుకున్న జీవితాన్ని అనుభ్హవించండి. అంతే కాని ఇండియాని ఫారేన్ చెయ్యకండి. ఆ పద్దతులు అవలంబించి దాని వల్ల నష్టపోతే ఇక్కడి సాంప్రాయదాయ రక్షణ పొందలేరు. 
                                                               

   పై కేసులో ఇద్దరు తప్పు(మన కట్టుబాట్లు ప్రకారం) చేస్తే, అమ్మాయే ఎందుకు నష్టపోయిందో ఆలోచించండి. ఫారెన్లో లెని విలువలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి. కాబట్టి పద్దతులు ఫారెన్ వైనా బుద్దులు ఇండియావే కాబట్టి ఇంగిత జ్ఞానం  తో మన కట్టు బాట్లను అనుసరించడం శ్రేయస్కరం . మన సైంటిస్టులు  స్త్రీని మోసం చేసే మొగవారి శిక్షల కోసం ఒక మందు కనిపెడితే బాగుండు. అది యెలా ఉండాలంటే మనం కోరినంత కాలం "ఆ ఒక్కటీ" పనిచెయ్యకుండ ఉండేటట్టు. దీనివల్ల అటు  మగవారికి, ఇటు ఆడవారికి లాబాలున్నాయి. యెలాగంటారా!తప్పు చేసిన మగవాళ్లు జైళ్లో ఉండాల్సిన బాద లేదు. స్త్రీలు వీళ్లని చూసి బయపడాల్సిన పనిలేదు. అంతా చూసి మురవా! చెప్పుకొని ఏడ్వా!    
                                              (7/10/2012 Post Republished).          
                                                                     

Comments

 1. దన్యవాదాలు వంశీగారు . మీలోని అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మీ గురించి మమ్మల్ని తెలుసుకోనివ్వండి.

  ReplyDelete
 2. sir meeru chepindi chala baagundi, పై కేసులో ఇద్దరు తప్పు(మన కట్టుబాట్లు ప్రకారం) చేస్తే, అమ్మాయే ఎందుకు నష్టపోయిందో ఆలోచించండి. ఫారెన్లో లెని విలువలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి. కాబట్టి పద్దతులు ఫారెన్ వైనా బుద్దులు ఇండియావే కాబట్టి ఇంగిత గ్నానం తో మన కట్టు బాట్లను అనుసరించడం శ్రేయస్కరం . మన సైంటిస్టులు స్త్రీని మోసం చేసే మొగవారి శిక్షల కోసం ఒక మందు కనిపెడితే బాగుండు. అది యెలా ఉండాలంటే మనం కోరినంత కాలం "ఆ ఒక్కటీ" పనిచెయ్యకుండ ఉండేటట్టు. దీనివల్ల అతు మగవారికి, ఇటు ఆడవారికి లాబాలున్నాయి. యెలాగంటారా!తప్పు చేసిన మగవాళ్లు జైళ్లో ఉండాల్సిన బాద లేదు. స్త్రీలు వీళ్లని చూసి బయపడాల్సిన పనిలేదు. అంతా చూసి మురవా! చెప్పుకొని ఏడ్వా!

  sir , mosam chese adavallaku meeru iche siksha ??????????????????

  ReplyDelete
  Replies
  1. మోసం చేసే వారెవ్వరైనా చీటింగ్ కేస్ పెట్టవచ్చు, శ్రీకాంత్ గారు, ఏడేళ్ల వరకు శిక్ష విదించవచ్చు కూడా! ఇకపోతే మేము చెప్పిన దాని విదంగా ఉండాలంటే స్త్రీలు మినాయించబడతారు,యేమ్దుకంటే పాపం వాళ్లు రెచ్చగొట్ట గలరు కాని, రేప్ చెయ్యలేరు కదా!

   Delete
 3. తండ్రిపై కోపంతో రేప్ కేసు పెట్టిన బాలిక... కోర్టు ఆగ్రహం

  తండ్రితో గొడవపడిన అతడిపై కోపంతో రేప్ కేసు పెట్టిన ఓ టీనేజ్ బాలికపై థానే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పీవోసీఎస్‌వో చట్టాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు, విచారణ తప్పుదోవ పట్టించినందుకుగానూ ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ప్రత్యేక న్యాయమూర్తి మృదుల భాటియా సదరు తండ్రిని నిర్దోషిగా విడుదల చేయడంతో పాటు... అతడిపై నమోదైన అభియోగాలను కొట్టివేశారు. బాలికపై తీసుకునే చర్యలు సమాజంలో పీవోసీఎస్‌వో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న వారందరికీ గట్టి సందేశం ఇచ్చేలా ఉండాలని తన ఆదేశాల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. 2013లో నవి ముంబైకి చెందిన సదరు బాలిక (16) తనపై తండ్రి అఘాయిత్యం చేశాడంటూ కేసుపెట్టింది. కోర్టు విచారణలో చివరికి అసలు విషయం ఒప్పుకుంది. తమ ఇద్దరి మధ్య తగాదా రావడంతో తండ్రిపై తప్పుడు కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించింది. బాలిక అబద్ధపు ఫిర్యాదు చేయడంపై న్యాయమూర్తి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘ఈ ఫిర్యాదు కారణంగా పీవోసీఎస్‌వో చట్టం దుర్వినియోగైమైంది. సొంత తండ్రిపైనే ఇలా ఫిర్యాదు చేయడం వల్ల.. ఆయన మనసును గాయపర్చడంతోపాటు మానసికంగా కుంగిపోయేందుకు కారణమైంది. దాదాపు మూడేళ్లపాటు అకారణంగా అతడు జైల్లో గడపాల్సి వచ్చింది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  http://www.andhrajyothy.com/artical?SID=349380

  ReplyDelete
  Replies
  1. మన దేశం లో పరువు హత్యలు పేరిట తమ బిడ్డల్ని పొట్టన పెట్టుకునే పాపపు సంస్కృతీ ఉన్నట్లే , తప్పుడు కేసులతో తల్లితండ్రులను సైతం వేధించడానికి వెనుకాడని బిడ్డలు కూడా ఎక్కువుగానే ఉన్నట్లు ఉంది . అటువంటి కేసులకు ఉదాహరణే మీరు ఇచ్చిన రిఫరెన్స్ . అలాగే 2014 లో ఒక అమ్మాయి తన ప్రియుడితో కల్సి తండ్రిని దారుణంగా చంపడమే కాక , దానికి కారణం 3 ఏండ్లుగా తన ముసలి తండ్రి లైంగిక వేధింపులు అని చెప్పింది . ఇంకొక అమ్మాయి అయితే ఏకంగా తల్లితండ్రులను చంపి వారి శవాల సమక్షం లో 3 రోజులు ప్రియుడితో కులికింది. ఇవి పరువు హత్యలు కంటే దారుణమైనవి అని చెప్పక తప్పదు . పూర్తీ వివరాలకు రేపేరెన్స్ లింక్ లు చూడవచ్చు .
   (1)#https://ssmanavu.blogspot.in/2014/05/blog-post_5.html

   (2)#https://ssmanavu.blogspot.in/2014/11/72.html

   Delete
  2. మీరన్నది నిజమే నండి. ఎదైనా దొంగతనం జరిగితే పోలిస్ ల దగ్గరికి వెళితే యఫ్.ఐ.ఆర్. రాసే ముందు పది సార్లు తిప్పించుకొని, వంద ప్రశ్నలు వేసి, నిర్దారించుకొన్న తరువాత రాస్తారు. అటువంటిది ఆ అమ్మాయి అబద్దాన్ని గోడ కట్టినట్లు చెప్పి, పోలిసులను కన్వీన్స్ చేసి కేసు పెట్టించిందంటే సామాన్య మైన విషయం కాదు. అందునా తండ్రి పైన చేసిన ఆరోపణ ఎమైనా తక్కువదా?

   Delete

Post a Comment

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )