కులం మారినా ’వ్యాపార బుద్ది' మారలేదు.


     

                                     అమ్మాయి ,అబ్బాయి గాడంగా ప్రేమించుకున్నారు. ఇరువురివి  వేరు,వేరు, కులాలు.అయినా వారి ప్రేమ ముందు "కులం" అడ్డం రాలేదు. పెండ్లి  చేసుకున్నారు. ఆ తర్వాత అబ్బాయి తరపు వారు "పెద్ద(?) మనసు" చేసుకుని ఇద్దర్ని ఆశిర్వదించారట. హాయిగా కాపురం చేస్తే ఆడపిల్ల  పుట్టింది. దానికి కూడ పెద్దలు ఏమి అనలేదట! జస్ట్ పాప బారసాలకి 2౦ తులాల బంగారం, లక్ష డిపాజిట్  తెమ్మని మాత్రమే అడిగారట, లేకుంటే వారి అబ్బాయికి మరో పెల్లీ ఖాయం అన్నారట  . దానికి ఆ గొప్ప ప్రేమికుడయిన భర్త కూడ వంత పాడాడట. ఏలాగు అంత ఇచ్చే స్తోమత తన తల్లితండ్రులకు లేదని ఆ ప్రేమికురాలు "ప్రేమించే భర్త" ను వదులుకోలేక, ఇటు "బంగారం" తేలేక,ఇంత అనర్దానికి కారణం పుట్టిన "ఆడపిల్లేనని" బావించి ఆ పాపని "గొంతు పిసికి చంపేసిందట ఆ "మహా ప్రేమికురాలయిన" ఇల్లాలు. తర్వాత కథ పొలిస్లు, కోర్ట్లు, అంతే.

   ఇక్కడ ఒక చిన్న అనుమానం ఏమిటంటె,అత్త మామలకు, కట్నం ముఖ్యమయితే, అది తెచ్చాకే కాపురం అనాలి. కాని అనలేదు."ఆడపిల్ల" కాబట్టి, "బంగారం" కావాలి అన్నారట. అదే మగపిల్లాడయితే అవసరం లేదా? మరి అటు కన్న తల్లి కూడ "ఆడపిల్ల" కాబట్టి చంపింది కాని, మగ పిల్లాడయితే చంపదు కదా?అంటే "కట్నం" అనేది వక వంక కావచ్చు. "ఆడపిల్లను"  హతమార్చడమే అందరి ఉద్దేశ్యం.అని నా అభి ప్రాయం.  ఇది హైదరాబాద్ లో  వారం క్రితం జరిగిన వాస్తవ సంఘటన.
                 "కులాంతర", "మతాంతర" " చివరకు ఖండాంతర వివాహాలు చేసుకున్నా, మన సమాజంలో "ఆడపిల్లల్ని" చంపటం మానటం లేదు. కారణం, మగపిల్లవాడు అయితే ప్లస్, ఆడపిల్ల  అయితే లాస్ అనే "నీచాతి నీచమయిన వ్యాపార" ద్రుక్పదం మన సమాజంలో బలంగా వేళూనుకుని ఉండడడమే. ఆడపిల్ల పుడితే మహలక్ష్మి పుట్టిందని బావించాలనే ఆచారం నుండి "శని" పుట్టింది అని బావించడానికి  , ఈ వరకట్న సమస్య ప్రథమ కారణం. చక్కటి మన కుటుంభ వ్యవస్తను చిన్నా బిన్నం చేసిందీ ఈ  "కట్న రక్కసి" యే. దీనిని సమూలంగా నాశనం చేస్తే తప్ప మన కుటుంబాలు బాగుపడవు. "ఆడపిల్లల్ని చంపే వారికి  ఇంకా సిగ్గు రాక పోవడం విచిత్రమే!. కొన్ని కులాలో ఆడ పిల్లలు పెళ్ళిలకు దొరకని పరిస్తితి ఈనాడు మనం కళ్లారా చూస్తున్నా, మగపిల్లలు వల్ల వొరిగేది ఏమి లేదని ఏన్నో సంఘటనలు రుజువు చేస్తున్నా, ఎందుకు ఆ "పసి పాపల్ని"  నాశనం చేస్తున్నారు.

   పసి పిల్లలే కదా సాక్ష్యం ఏముంది అనుకోవద్దు. ప్రతి జీవి కి ’ఉసురు" ఉంటుంది. అది పసి వాళ్లలో ఎక్కువ ఉంటుంది."ఆడ పిల్ల ఉసురు కొట్టుకుంటె  కుటుంబాలు ఊడ్చుకు పోతాయి" అనే సామెత ఎంతో అనుభవ పూర్వకంగా  పెద్దలు చెప్పిన మాట. కనీసం ఇదయినా నమ్మితే మంచిది.  
                                                               (7/12/2012 Post Republished).
                 

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!