ఏడుపు గొట్టు పెండ్లి అంటే తెలుసా? తెలియకపోతే చూడండి !

                                                           


                                   ఎవరైనా ఏదైనా పనిని తన ఇష్టం లేకుండా చేస్తుంటే " వాడి పద్దతి చూస్తుంటే ఇష్టం లేని పెండ్లికి తలంబ్రాలు పోసినట్లుంది "అని అంటున్టాము . ఆ  ఇష్టం లేని ఏడుపు గొట్టు పెండ్లి అనేది ఎలా ఉంటుందో ఈ క్రింది పెండ్లి విడియోలోని పెండ్లి కొడుకును చూస్తె తెలుస్తుoది. 
                                                                 
                             Link:         https://youtu.be/XWmqMjLpZv8


                              పై వీడియో కర్ణాటక లో జరిగిన ఒక బలవంతపు పెండ్లికి సంబందించింది . మొదటగా చూసిన వారెవరికైనా పెండ్లి కొడుకు ని చూస్తె నవ్వు వస్తుoది . కాని అతని ఏడుపు వెనుక ఉన్న పోలిస్ వారి దాష్టికం గురించి తెలుసుకుంటే బారత దేశంలో బలవంతపు పెండ్లిళ్ళు కు స్త్రీలే కాదు , పురుషులు కూడా ఎలా బలి అవుతున్నారో తెలుసుకొవచ్చు . విదియోలోని అమ్మాయి అబ్బాయి ప్రెమించుకున్నారట . కాని అ అమ్మాయి గురించి అతనికి ఏమి తెలిసిందో ఏమో , ఆ  అబ్బాయి ఊరు వదలి పారిపోయాడట . నాలుగేండ్లు తర్వాత అ ఊరికి వస్తే , అమ్మాయి తరపు వారు పోలిస్ కంప్లైంట్ ఇస్తే , వారు అతన్ని ఊరి యువతకు అప్పచెప్పి ఇద్దరికీ గుళ్ళో పెండ్లి చేసి పారేయండి అని హుకుం జారి చేస్తే , వారంతా అబ్బాయిని బలవంతంగా , బోరు బోరు మని ఏడుస్తున్నా పట్టించుకోకుండా తీసుకు వచ్చి పెండ్లి చెసారు. అమ్మాయి మాత్రం ఊళ్ళో వారితో పాటు యమ ఆనందగా ఉంది . అబ్బాయి ఏమో అతనికి ఏదో బూతాన్ని ఇచ్చి కట్ట బెదుతున్నట్లు ఒకటే ఏడుపు!.

    తాళి కడితే చాలు పెండ్లి అయిపోయినట్లే అని చాటి చెప్పే కన్నడ సినిమాలు (మన తెలుగు సినిమాలు కూడా అంతే నండోయి ), బాగా చూసారనుకుంటా అక్కడి పోలీసులు , అదే పాలో అయిపోయారు . అబ్బాయితో  అమ్మాయికి  గుళ్ళో తాళి కట్టించమని తప్పుడు సలహా ఒకటి ఇచ్చి తాము నేరానికి పాల్పడటమే  కాక ఊరి వారిని నేరస్తులను చెసారు. ఈ  ఒక్క వీడియో  సాక్ష్యం చాలు జరిగిన బలవంతపు పెండ్లిని చట్ట ప్రకారం రద్దు చేసి , దానికి బాద్యులైన వారందరి మిద కేసులు పెట్టదానికి .

   విషయం ఏదైనా ఉంటే కౌన్సిలింగ్ చేసి పిల్లవాడిని ఒప్పించి పెండ్లి చెయవచ్చు. లేక పొతే చీటింగ్ కేసు ఏమైనా పెట్టదగిన కేసు అయితే అలా  ప్రోసిడ్  కావచ్చు. ఎంత తిక్కలి తనం కాకపొతే ఇలా బలవంతపు పెండ్లి చేసి కాపురాలు చేయిస్తారా ? గుర్రాన్నినీళ్ళ  వద్దకు తీసుకు వెళ్ళ గలరేమో కానీ , నీళ్ళు  తాగించ లేరు అన్న ఇంగిత జ్ఞానం ఉన్న వారు ఇలాంటి పనులు చెయరు. మోకాల్లో మెదడు  ఉన్న వారికే ఇలాంటి విపరీతపు పరిష్కారాలు తోస్తాయి . చివరకు ఆ  అమ్మాయి బ్రతుకు రెండిటికి చెడ్డ రేవడి లా చెయ్యడం తప్ప , పోలిస్ వారు గాని , ఊరి వారు గాని ఒరగబెట్టేది ఏమి ఉండదు . తనంటే ఇష్టపడని వాడిని కట్టుకునే దుస్తితిని ఆ  అమ్మాయికి కలిగించినందుకు(అమాయకురాలు అయితే ) అ దేవుడు కూడా వారిని క్షమించడు గాక క్షమించడు
                                     (25/1/2014 Post Republished).

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!